ల‌క్‌ మార్చిన పాస్ బుక్

కాలం కలిసి రావాలే కానీ.. కళ్లు మూసి తెరిచేలోగా కోటీశ్వరులైపోవచ్చు.. అదృష్టం ఉండాలే కానీ సునామీ వచ్చినా స్విమ్మింగ్ చేయొచ్చు.. అవును మరి.. జీవితం అలాంటిదే. ఎవరిని ఎప్పుడు ఎలా పరీక్షిస్తుందో తెలియదు.. ఎవరికి ఎప్పుడు లక్ దక్కుతుందో అర్థం కాదు.. అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రి మన జీవితాలు మారిపోతాయి. ఇతడి జీవితం కూడా అలాంటిదే. కాకపోతే.. కాస్త ఆలస్యమైందంతే.. చెత్తలో దొరికిన ఓ పాత పుస్తకం కారణంగా ఓ వ్యక్తి జీవితం మారిపోయింది. చిలీ […]

Share:

కాలం కలిసి రావాలే కానీ.. కళ్లు మూసి తెరిచేలోగా కోటీశ్వరులైపోవచ్చు.. అదృష్టం ఉండాలే కానీ సునామీ వచ్చినా స్విమ్మింగ్ చేయొచ్చు.. అవును మరి.. జీవితం అలాంటిదే. ఎవరిని ఎప్పుడు ఎలా పరీక్షిస్తుందో తెలియదు.. ఎవరికి ఎప్పుడు లక్ దక్కుతుందో అర్థం కాదు.. అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రి మన జీవితాలు మారిపోతాయి. ఇతడి జీవితం కూడా అలాంటిదే. కాకపోతే.. కాస్త ఆలస్యమైందంతే..

చెత్తలో దొరికిన ఓ పాత పుస్తకం కారణంగా ఓ వ్యక్తి జీవితం మారిపోయింది. చిలీ దేశంలో ఉండే ఎక్సీక్వెల్ హినోజోస.. తన ఇంట్లో పాత సామాన్లు సర్దుతుంటే.. పెద్ద ట్రంకు పెట్టె కనిపించింది. అదృష్టం మేల్కొలిపిందో ఏమో.. ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో చూస్తే మొత్తం చెత్త. పడేద్దామనుకున్నాడు.. కానీ గమనిస్తే ఓ పాస్‌బుక్ కనపించింది. అది అలాంటి ఇలాంటిది కాదు.. ఓ బ్యాంక్ పాస్ బుక్. తన తండ్రిది. కేవలం తన తండ్రికి మాత్రమే తెలిసిన, ఆయన బ్యాంకులో దాచుకున్న సొమ్ముకు సంబంధించినది.1960–70ల నాటిది. ఆయన చనిపోయి 10 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఆ పాస్‌బుక్ గురించి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు ఇల్లు సర్దుతుంటే దొరికింది. చూస్తే అందులో అప్పట్లో 1.4 లక్షల చిలియన్ పీసోస్ డిపాజిట్ చేశారు. ఇంటి కొనుగోలు కోసం ఎక్సీక్వెల్ తండ్రి ఆ డబ్బులను దాచుకున్నాడు. అప్పటికి అది చాలా చిన్న మొత్తమే. చెప్పుకునేంత పెద్ద పొదుపు కాదు. కానీ కాలం మారే కొద్దీ.. ఏళ్లు గడిచే కొద్దీ.. దాని విలువ పెరిగిపోయింది. అతడి తండ్రి చనిపోయాక.. బ్యాంకు పాస్‌బుక్ అలానే ట్రంకు పెట్టెలో ఏళ్లకేళ్లు ఉండిపోయింది. ట్రంకు పెట్టెలోనే.. ఆ పొదుపును ఎన్నో రెట్లు పెంచింది.

ఆనందం ఆవిరి

బ్యాంకు బుక్కు దొరకడంతో సంతోషపడిపోయాడు ఎక్సీక్వెల్. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే ఆ బ్యాంకు ఖాతా క్లోజ్ అయింది. అయితే పాస్‌బుక్‌పై ‘స్టేట్ గ్యారంటీడ్’ అనే ముద్ర కనిపించింది. అంటే దాని అర్థం.. ఆ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని చిలీ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది అని. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇస్తూ వేసిన స్టాంప్ అది. దీంతో ఆవిరైన ఆశలు మల్లీ చిగురించాయి. వెంటనే బ్యాంకు అధికారులను అతడు సంప్రదించాడు. కానీ ప్రభుత్వం ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది. డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అతడు ప్రభుత్వంపై దావా వేశాడు. తాజాగా కోర్టులో ఎక్సీక్వెల్ కేసు విచారణకు వచ్చింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఎక్సీక్వెల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఎక్సీక్వెల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అతడి చేతికి ఏకంగా 1.2 మిలియన్ డాలర్లు రాబోతున్నాయి. మన కరెన్సీలో ఇది అక్షరాలా పది కోట్ల రూపాయాలు. 

అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్

కొన్ని పాత వస్తువులు, కాగితాలు ఎందుకూ పనికిరావని చెత్తలో పడేస్తాం.. కానీ తరచి చూస్తే ఇలా కొన్ని విలువైనవి, జీవితాన్ని మార్చేవి ఉంటాయి. అయితే అదృష్టాన్ని అందిపుచ్చుకోవడం మనలోనే ఉంటుంది. 60 ఏళ్ల నాటి తన తండ్రి పాస్‌బుక్‌ ఎక్సీక్వెల్‌కు ఆలస్యంగా దొరకడమే మంచిదైంది. అప్పడే తన తండ్రి చూసి ఉన్నా, డబ్బులు విత్ డ్రా చేసి ఉన్నా, లేదా 10 ఏళ్ల కిందటే ఈ పాస్‌బుక్‌ దొరికి ఉన్నా ఇంత పెద్ద మొత్తం అంది ఉండేది కాదు. అందుకే పెద్దలు అన్నారు ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని.. అంతేనా? ‘ఆలస్యం.. ఆమృతం.. విషం..’ అని కూడా అన్నారు. ఇక్కడ ఆలస్యమే అమృతమైంది.. కాదంటారా?