డిబేట్‌కు వెళ్లని ట్రంప్..

‘స్పిన్‌ రూమ్‌’ లోనికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌‌ను రానివ్వపోవడం కొత్త వివాదానికి దారి తీసింది.  ఫాక్స్ న్యూస్ వాళ్లు తమకు అనుకూలమైన అభ్యర్థులను రక్షించేందుకు ట్రంప్ మద్దతుదారులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని జూనియర్ ట్రంప్ ఆరోపించారు మూడేళ్లు గిర్రున తిరగాయి.. మరో 15 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అటు వివాదాలతో, ఇటు కేసులతో, మధ్య ప్రచారంతో ప్రతిరోజే వార్తల్లోనే ఉంటున్నారు డొనాల్డ్ ట్రంప్. 2017 నుంచి 2021 దాకా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. గత […]

Share:

‘స్పిన్‌ రూమ్‌’ లోనికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌‌ను రానివ్వపోవడం కొత్త వివాదానికి దారి తీసింది.  ఫాక్స్ న్యూస్ వాళ్లు తమకు అనుకూలమైన అభ్యర్థులను రక్షించేందుకు ట్రంప్ మద్దతుదారులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని జూనియర్ ట్రంప్ ఆరోపించారు

మూడేళ్లు గిర్రున తిరగాయి.. మరో 15 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అటు వివాదాలతో, ఇటు కేసులతో, మధ్య ప్రచారంతో ప్రతిరోజే వార్తల్లోనే ఉంటున్నారు డొనాల్డ్ ట్రంప్. 2017 నుంచి 2021 దాకా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. గత ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. తాను గద్దె దిగడానికి ముందే జరిగిన ఘటనలతో చరిత్రలో వివాదాస్పద అధ్యక్షుడిగా అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. మరోవైపు ఆయన కుమారుడిని కూడా వివాదాలు చుట్టుమడుతున్నాయి. ‘స్పిన్‌ రూమ్‌ (అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్రతినిధులను ఇంటర్వ్యూ చేసే వేదిక)’ లోనికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌‌ను రానివ్వపోవడం కొత్త వివాదానికి దారి తీసింది. 

అసలు ఏమైంది?

ఫాక్స్ న్యూస్ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ చర్చకు డొనాల్డ్ ట్రంప్ హాజరుకాలేదు. దీంతో స్పిన్‌ రూమ్‌లోకి సరొగేట్స్‌ (ప్రతినిధులు)ను అనుమతించబోమని ఫాక్స్ న్యూస్ సంస్థ ప్రకటించింది. స్పిన్ రూమ్‌లోని వెళ్లేందుకు జూనియర్ ట్రంప్‌నకు అనుమతివ్వలేదు.  ఇది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై ఆయన ట్విట్టర్‌‌ (ఇప్పుడు ‘ఎక్స్‌’గా మారింది)లో తీవ్రంగా స్పందించారు. ‘‘ఫాక్స్ న్యూస్ వాళ్లు తమకు అనుకూలమైన అభ్యర్థులను రక్షించేందుకు ట్రంప్ మద్దతుదారులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. సెన్సార్ చేయాలని చూస్తున్నారు. ఓ వైపు వీళ్ల రేటింగ్స్ దారుణంగా పడిపోతుంటే.. మరోవైపు టక్కర్ కార్ల్‌సన్‌తో మా నాన్న (ట్రంప్) ఇంటర్వ్యూను 93 మిలియన్ల మంది వీక్షించారు” అని ట్వీట్ చేశారు. డిబేట్ గురించి స్పందిస్తూ.. రామస్వామి (అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు)  స్టాండ్ అవుట్ పెర్ఫర్మర్ అని చెప్పారు. డిసాంటిస్ ఒక భయాందోళనకు గురైన జింక అని ఎద్దేవా చేశారు. మరోవైపు రామస్వామి కూడా.. డొనాల్డ్ ట్రంప్ 21వ శతాబ్దపు అత్యుత్తమ అధ్యక్షుడు అంటూ పొగడ్తలు కురిపించారు. 

డిబేట్‌కు వెళ్లని ట్రంప్

బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) జీవోపీ (రిపబ్లికన్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ) చర్చ జరగాల్సి ఉంది. ఈ డిబేట్‌కు తాను హాజరుకాబోవడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో డిబేట్‌లో సరొగేట్లను అనుమతించబోమని ఫాక్స్ న్యూస్ ప్రకటించింది. ట్రంప్ రావడం లేదని తెలిపిన తర్వాతే సరొగేట్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యూయార్క్ పోస్ట్ స్పందిస్తూ.. ఏ అభ్యర్థికి చెందిన ప్రతినిధులనూ వేదికపైకి అనుమతించరని, ఇది ట్రంప్‌నకు మాత్రమే ప్రత్యేకమేమీ కాదని స్పష్టంచేసింది. మరోవైపు తాను డిబేట్‌కు గైర్హాజరు కావడన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అక్కడ 2 గంటలపాటు కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించారు. డిబేట్‌కు బదులు ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ టక్కర్ కార్ల్‌సన్‌తో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూ ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..  ‘‘దీనిపై చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని నన్ను అంటున్నారు. కానీ చూడండి.. ఇప్పటికే పోల్స్‌ వచ్చాయి.. నేను 50 నుంచి 60 పాయింట్ల లీడ్‌లో ఉన్నాను. ఇదే సమయంలో అక్కడ డిబేట్లలో పాల్గొనే వారిలో ఒకటి, సున్నా, 2 పాయింట్లతో ఉన్నారు. నేను అక్కడ గంట నుంచి 2 గంటలపాటు కూర్చోవాల్సిన అవసరం ఉందంటారా?” అని ట్రంప్ ప్రశ్నించారు. ‘‘ఆ మీడియా సంస్థ నాతో స్నేహపూర్వకంగా ఉండదు. వాళ్లు రాన్ డిసాన్‌క్టిమోనియస్‌ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అతడిపై ఆశలు వదులుకున్నారు. 2016 లో కూడా ఇలానే జరిగింది” అని అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ వివరించారు.