టిక్ టాక్ కి గడ్డు కాలం.. మరో ఎదురు దెబ్బ.. ఈ సారి న్యూజిలాండ్

టిక్ టాక్ ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా పలుదేశాలు టిక్ టాక్ పై చర్యలు తీసుకుంటున్నాయి.  టిక్ టాక్ యాప్ ను భారతదేశం బ్యాన్ చేసింది. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ యాప్ కి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కాగా టిక్ టాక్ ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా పలుదేశాలు టిక్ టాక్ పై చర్యలు తీసుకుంటున్నాయి.  టిక్ […]

Share:

టిక్ టాక్ ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా పలుదేశాలు టిక్ టాక్ పై చర్యలు తీసుకుంటున్నాయి.  టిక్ టాక్ యాప్ ను భారతదేశం బ్యాన్ చేసింది.

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ యాప్ కి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కాగా టిక్ టాక్ ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా పలుదేశాలు టిక్ టాక్ పై చర్యలు తీసుకుంటున్నాయి.  టిక్ టాక్ యాప్ ను భారతదేశం కూడా బ్యాన్ చేసింది. ఇటీవల అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. ఇప్పుడు ఆ కోవలోకి న్యూజిలాండ్ కూడా చేరింది. న్యూజిలాండ్ పార్లమెంట్ కూడా టిక్ టాక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. 

న్యూజిలాండ్ లో బ్యాన్..

తాజాగా న్యూజిలాండ్ దేశం టిక్ టాక్ వినియోగాన్ని నిషేధించింది. పార్లమెంట్ నెట్ వర్క్ నుంచి టిక్ టాక్ నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా పార్లమెంట్ నెట్వర్క్ పరిధిలో ఉన్న అన్ని ఫోన్ల నుంచి టిక్ టాక్ వినియోగం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

టిక్ టాక్ అసంతృప్తి

టిక్ టాక్ బ్యాన్ విషయంలో ఆ సంస్థ స్పందించింది. తమకు ఎటువంటి సమాచారం అందించకుండానే నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మాకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా.. న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో అమెరికా కూడా టిక్ టాక్ పై నిషేధం విధించింది. దాంతో ఒక్క అమెరికాలోనే 10 కోట్ల మంది యూజర్లు ఆ యాప్ ను అన్ ఇన్స్టాల్ చేశారు. కాగా.. టిక్ టాక్ సంస్థ మాత్రం దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛపై అమెరికా దాడిగా అభివర్ణించింది. అమెరికన్ సంస్కృతి, విలువల విషయంలో ఇది నిరంకుశ చర్యగా తిట్టిపోసింది. 

ఎలాంటి ప్రమాదం లేదు

ప్రస్తుత పరిణామాల మధ్య టిక్ టాక్ సంస్థ సీఈఓ షో జి చ్యూ యూఎస్ కాంగ్రెస్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. టిక్ టాక్ కార్యకలాపాలు అన్ని దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ నుంచి సాగుతాయి. చైనా కేంద్రంగా బైట్ డాన్స్ పనిచేస్తోంది. టిక్ టాక్ యాప్ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదు. అలాగే 150 మిలియన్ అమెరికన్ల యూజర్ల డేటాకు ఇది ఎలాంటి ప్రమాదం కలిగించదని ఆయన తెలిపారు.

మీ పిల్లలు టిక్ టాక్ వాడతారా.?

అదే విధంగా భారతదేశంలో విధించిన నిషేధంపై కాంగ్రెస్ సభ్యుడు మరోసారి ప్రస్తావించారు. టిక్ టాక్ ను భారత్ 2020లో నిషేధించింది. మార్చి 21న ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ఉద్యోగులకు, సంస్థకు ఏ విధంగా అందుబాటులో ఉందో వెల్లడించండి అంటూ ప్రశ్నించారు. కాగా.. మా సంస్థ సిబ్బందికి ప్రస్తుత పరిణామాల గురించి వివరించమని చెప్పాను. మా వద్ద కఠినమైన డేటా యాక్సిస్ విధానాలు ఉన్నాయి. ఇలాంటి కథనాలతో మేము ఏకీభవించమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మీ పిల్లలు టిక్ టాక్ ఉపయోగిస్తారా అనే ప్రశ్న చ్యూ ని అడుగగా.. మా పిల్లలు సింగపూర్ లో ఉంటున్నారు, ఆ దేశంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్ టాక్ చైల్డ్ వెర్షన్ అందుబాటులో లేదు. ఈ వెర్షన్ అమెరికాలో అందుబాటులో ఉంది. మా పిల్లలు అమెరికాలో ఉంటే వారు ఈ యాప్ ను ఉపయోగించేందుకు ఒప్పుకుంటాను అని తెలిపారు.