దీపావళి రోజున అధికారిక హాలిడేగా ప్రకటించిన న్యూయార్క్  

మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు ఎంతో అనందంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగ వస్తుందంటే చాలు, చిన్న పిల్లల్లో ఉండే ఉత్సాహమే వేరు. సత్యభామ నరకాసురుడిని వధించిన సందర్భంగా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు అనేది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అయితే ఈ దీపావళి పండుగని ఇక్కడ ఎంత ఘనంగా జరుపుకుంటామో, ఇతర దేశాల్లో స్థిరపడిన మన భారతీయులు మాత్రం ఈ పండుగ రోజు కూడా పని చెయ్యాల్సిందే. […]

Share:

మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు ఎంతో అనందంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగ వస్తుందంటే చాలు, చిన్న పిల్లల్లో ఉండే ఉత్సాహమే వేరు. సత్యభామ నరకాసురుడిని వధించిన సందర్భంగా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు అనేది చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అయితే ఈ దీపావళి పండుగని ఇక్కడ ఎంత ఘనంగా జరుపుకుంటామో, ఇతర దేశాల్లో స్థిరపడిన మన భారతీయులు మాత్రం ఈ పండుగ రోజు కూడా పని చెయ్యాల్సిందే. టపాకాయలు కాల్చుకోవద్దు అని అక్కడి ప్రభుత్వాలు రూల్ ఏమి పెట్టలేదు కానీ, దీపావళి ని పని దినంగానే పరిగణించేవారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉండే ఫారిన్ దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బీటెక్ అయిపోగానే హైదరాబాద్ కి వెళ్లినంత తేలికగా ఇప్పుడు కుర్రాళ్ళు అమెరికా కి వెళ్లిపోతున్నారు. అక్కడే దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు.

మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి :

ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతీ ఏడాది ఇండియా నుండి అమెరికా కి లక్ష 25 వేల మంది చదువుకోవడం కోసం వెళ్తున్నారట. మరి అన్నేళ్లు ఉంటున్నప్పుడు, మన సేవలను అక్కడి ఐటీ కార్పొరేట్ కంపెనీలు అందుకుంటున్నప్పుడు, మన పండుగలకు కూడా విలువ ఇవ్వాలి కదా.  అందుకే న్యూ యార్క్ అసెంబ్లీ మెంబెర్ జెన్నిఫర్ రాజ్ కుమార్ సుమారుగా రెండు దశాబ్దాల నుండి ఈ విషయమై పోరాడుతూనే ఉంది. ఆమె పోరాటానికి ఫలితం మొత్తానికి దక్కింది. సోమవారం నాడు న్యూ యార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ దీపావళి పండుగని ఇక నుండి స్కూల్ హాలిడేగా ప్రకటించబోతున్నాము అని మీడియా ముందుకు వచ్చి ఒక అధికారిక ప్రకటన చేసాడు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఈ దీపావళి పండుగని స్కూల్ హాలిడే గా ప్రకటించే క్రమంలో నేను కూడా భాగం అయ్యినందుకు ఎంతో గర్వపడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో సర్వత్రా మన ఇండియా నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ ఏడాది విద్యార్థులకు ఈ దీపావళి పండుగ హాలిడే ని ఎంజాయ్ చేసే అదృష్టం లేదట. ఎందుకంటే 2023 -2024 క్యాలెండర్ ని పాస్ చేసి చాలా కాలం అయ్యిందని, ఈ ఏడాదికి కొత్తగా పాస్ అయిన బిల్లు వర్తించదని తెలుస్తుంది. ఈ సందర్భం గా ఎరిక్ ఆడమ్స్ ఇంకా మాట్లాడుతూ ‘ మా న్యూయార్క్ సిటీ ఎల్లపుడూ మార్పుని స్వాగతిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం లో ఉన్న అన్నీ కమ్యూనిటీస్ ని మరియు వారి సంప్రదాయాలు గౌరవించడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు మేము ప్రవేశ పెట్టిన స్కూల్ క్యాలెండర్ ఒక సరికొత్త రియాలిటీ కి శ్రీకారం చుట్టబోతుంది’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గవర్నర్ కాతి హొచ్చుల్ దీపావళి ని పబ్లిక్ స్కూల్ హాలిడే గా ప్రకటించే ఫైల్ మీద సంతకం కూడా చేసేసింది , అంటే ఇక నుండి దీపావళి పండుగ మన ప్రవభారతీయులు కూడా సంతోషం గా తన సొంత వాళ్ళతో గడపొచ్చు అన్నమాట. మరి వచ్చే ఏడాది నుండి న్యూ యార్క్ సిటీ ఎలా కాంతులతో విరజిమ్మబోతుందో చూడాలి. ఇక ఈ పండుగ వేడుక ఒక్కసారి అలవాటు అయితే ఫారిన్ సిటిజెన్స్ కూడా దీపావళి పండుగని జరుపుకుంటారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.