ప్రాణాంతక ‘మెర్స్’ వైరస్ కలకలం

ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఎలా వణికించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లెక్కలేనంత ఆస్తి నష్టం , ప్రాణ నష్టం సంభవించింది. ఈ అంటూ వ్యాధి పేరు వింటేనే జనాలు వణికిపోతారు. దీని దరిద్రం సంపూర్ణంగా వదిలింది, ఇక ప్రశాంతం గా బ్రతకొచ్చు అని అనుకుంటున్న సమయం లో లేటెస్ట్ గా కరోనా వైరస్ ఫ్యామిలీ  నుండి మెర్స్ కోవ్ అనే సరికొత్త వైరస్ ఒక వ్యక్తిలో ఉన్నట్టుగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అబుదాబీ లో 28 […]

Share:

ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఎలా వణికించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లెక్కలేనంత ఆస్తి నష్టం , ప్రాణ నష్టం సంభవించింది. ఈ అంటూ వ్యాధి పేరు వింటేనే జనాలు వణికిపోతారు. దీని దరిద్రం సంపూర్ణంగా వదిలింది, ఇక ప్రశాంతం గా బ్రతకొచ్చు అని అనుకుంటున్న సమయం లో లేటెస్ట్ గా కరోనా వైరస్ ఫ్యామిలీ  నుండి మెర్స్ కోవ్ అనే సరికొత్త వైరస్ ఒక వ్యక్తిలో ఉన్నట్టుగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అబుదాబీ లో 28 ఏళ్ళ కుర్రాడికి అనారోగ్యం రావడం తో అతని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రి లో చేర్పించారు. అనుమానిత లక్షణాలు ఉండడం తో డాక్టర్లు పీసీఆర్ తియ్యగా అతనికి మెర్స్ కోవా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఇది కరోనా కుటుంబానికి చెందినది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నిర్ధారించింది. ఈ వార్త ఇప్పుడు మీడియా లో సంచలనం గా మారింది.

అయితే ఇతనితో పాటు గత మూడు రోజులు తిరిగిన 108 మందిని పరీక్షించగా వారిలో మెర్స్ కోవా వైరస్ తాలూకు ఛాయలు ఏమాత్రం కనిపించకపోవడం విశేషం. ఈ విషయాన్నీ స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) చెప్పుకొచ్చింది. ఒంటె వంటి జంతువుల నుండి ఇలాంటి వైరస్ సోకే అవకాశం ఉంది కానీ, ఈ వ్యక్తి నివసిస్తున్న పరిసరాల్లో అసలు ఒంటెలు అనేవే లేవు. మరి ఎక్క్కడి నుండి ఈ వైరస్ ఇతని శరీరం లోకి ప్రవేశించింది అనే దానిపై ఆరాలు తీస్తున్నారు. మరోవైపు అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి ఎలా ఉంది అనేదానిపై అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  కానీ , ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్యశాఖ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ జనాల్లో ఈ వార్త పాకడం తో అందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. మీడియా సైతం అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయంటే :

మెర్స్ (MERS -COV) కి పూర్తి అర్థం ఏమిటంటే ది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది 2012 వ సంవత్సరం లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బ్రిటన్ , అమెరికా తో సహా 27 దేశాల్లో వెలుగుచూసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 2605 కేసులు ఈ వైరస్ పై నమోదు కాగా, అందులో 35 శాతం మంది చనిపోయినట్టు చెప్పుకొచ్చారు. అంటే వీరిలో 936 మంది చనిపోయారు అన్నమాట.అంతటి ప్రాణాంతక వ్యాధి ఇది. ఈ వైరస్ సోకినవాళ్లు ఇప్పటి వరకు ఎక్కువగా చనిపోయినవాళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. 

ఈ వైరస్ ఒంటె వంటి జంతువుల నుండి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినవాళ్లకు ఊపిరి పీల్చుకునే సమస్య, విపారీటమైన దగ్గు , జ్వరాలో తో పాటుగా నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి.  మరి ఈ ప్రాణాంతక వ్యాధి ఇతర దేశాల్లోకి పాకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ వ్యాధి అత్యంత ప్రాణాంతకం అని తెలిసిన తర్వాత జనాలు వణికిపోతున్నారు. 100 శాతం లో 35 శాతం మరణాలు అంటే కరోనా సెకండ్ వేవ్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పొచ్చు. మరి దీనిని వ్యాప్తి చెందకుండా ఎలా నివారిస్తారు అనేది చూడాలి. మన భారత దేశ ప్రభుత్వం ఈ వ్యాధి ని ఇండియాలోకి అడుగుపెట్టకుండా ఎలా చూస్తుందో చూడాలి.