యూకేలో వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఎరిస్ 

కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడించింది. అనేక దేశాలు కరోనా దెబ్బకు విలవిలలాడాయి. లక్షలాది మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇది చాలదన్నట్లు ఇంకా కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో మనుషులను వెంటాడుతోంది. ఇంకా నేను ఉన్నానంటూ.. గుర్తుచేస్తుంది   ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.మరో కొత్త వేరియంట్‌ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది ఇబ్బందులకు గురి […]

Share:

కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి గడగడలాడించింది. అనేక దేశాలు కరోనా దెబ్బకు విలవిలలాడాయి. లక్షలాది మందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. ఇది చాలదన్నట్లు ఇంకా కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో మనుషులను వెంటాడుతోంది. ఇంకా నేను ఉన్నానంటూ.. గుర్తుచేస్తుంది 

 ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.మరో కొత్త వేరియంట్‌ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో  వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యూకేలో శరవేగంగా వ్యాపిస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది… ఇప్పుడు అది ఒమిక్రాన్‌ నుంచి మరో కొత్త వేరియంట్ ఈజీ.5.1 గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది.

మే నెలల మొదటిసారిగా గుర్తించబడిన EG.5.1 లేదా Eris యూకేలో కోవిడ్ కేసుల సంఖ్యను పెంచుతోంది. ప్రస్తుతం యూకేలో 10 కోవిడ్ కేసుల్లో ఒకటి ఈ తాజా స్ట్రెయిన్ కారణంగా ఉన్నాయి. దీని కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్‌లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్‌కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు.

తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్‌ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

ఒమిక్రాన్ రకానికి చెందిన, కోవిడ్ -19 వైరస్ కంటే వేగంగా వ్యాపించే ఈ కొత్త జాతిపై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, EG.5.1 మునుపటి స్ట్రెయిన్ కంటే ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి కారణం లేదంటున్నారు. మునుపటి ఇన్ఫెక్షన్‌లు లేదా టీకాల నుండి రోగనిరోధక శక్తి క్షీణించడం వల్ల కేసుల పెరుగుదలకు కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణను నిర్మించడానికి బూస్టర్ షాట్‌లు తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.

కొత్త కోవిడ్ వేరియంట్ ఎరిస్ లక్షణాలు..

ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని నిపుణులు సూచించారు. ఈ వేరియంట్ యొక్క వ్యాప్తిపై ఫోకస్ పెట్టాం. చికిత్స, నివారణ చర్యలు కొనసాగుతాయి. టీకాలు వేయించుకోని వారు వెంటనే తీసుకోవాలి. ఇప్పటివరకు చేయకపోతే బూస్టర్ షాట్లు తీసుకోవాలి. లక్షణాలు ఉన్న వ్యక్తులను వేరుగా ఉండాలి. అవసరమైతే పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా, ఇప్పుడు పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనందున, కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది ఆసుపత్రిలో చేరికలకు దారి తీస్తుందా లేదా చెప్పలేము అని నిపుణులు చెప్పారు.

ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్‌ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు.