తీవ్ర అస్వస్థకు గురైన నేపాల్ అధ్యక్షుడు.. ఆస్పత్రికి తరలింపు..

తాజాగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడర్ తీవ్ర అస్వస్థకు గురైనట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.. ఇక మంగళవారం ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఉన్నట్టుండి స్పృహ తప్పినట్లు సమాచారం.  దీంతో హుటాహుటిన ఆయనను ఖాట్మండులోని మహారాజుగంజ్ త్రిబువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ఇకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఓకేనట్లు గుర్తించారు దీంతో మెరుగైన చికిత్స అందించడానికి బుధవారం రామచంద్ర పౌడేల్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్లు […]

Share:

తాజాగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడర్ తీవ్ర అస్వస్థకు గురైనట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.. ఇక మంగళవారం ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఉన్నట్టుండి స్పృహ తప్పినట్లు సమాచారం.  దీంతో హుటాహుటిన ఆయనను ఖాట్మండులోని మహారాజుగంజ్ త్రిబువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ఇకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఓకేనట్లు గుర్తించారు దీంతో మెరుగైన చికిత్స అందించడానికి బుధవారం రామచంద్ర పౌడేల్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించినట్లు తెలుస్తోంది.

పౌడెల్ అడ్వైజర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వెంటనే మేము ఆయన్ను ఆసుపత్రికి తరలించారు గత 15 రోజుల నుంచి ఆయన యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. అయితే, ఉన్నట్టుండి ఇలా జరిగేసరికి వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది అంటూ ఆయన వెల్లడించారు. ఇకపోతే పౌడెల్ ఆసుపత్రి పాలైన విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించడానికి నేపాల్ దేశ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ఆసుపత్రికి చేరుకున్నారు. 78 సంవత్సరాల వయసు గల ఈయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వాయు మార్గం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు, అందువల్ల బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకు తరలించినట్లు అధ్యక్షుడు మీడియా సలహాదారు కిరణ్ పోకరెల్ తెలిపారు. అంతేకాదు, ఆయనతో పాటు కుమారుడు చింతన్ పౌడెల్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆస్పత్రిలో చేరడం ఇది రెండవసారి.. అంటే కేవలం 30 రోజుల వ్యవధిలోని ఆయన రెండవ సారి ఆసుపత్రి పాలయ్యారు. వాస్తవానికి గత వారమే ఆయన కడుపునొప్పితో ఆసుపత్రిపాలైన విషయం తెలిసిందే. ఇకపోతే మళ్లీ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన చికిత్సకు ప్రభుత్వ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా తయారు చేసి ఒక అధికారుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదికను తయారు చేసి, అనంతరం ప్రభుత్వానికి కూడా అందజేస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా అధ్యక్షుడి చికిత్సపై తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని మళ్లీ తిరిగి రావాలి అని నేపాల్ దేశ ప్రజలు గాఢంగా కోరుకుంటున్నారు.

రామచంద్ర పౌడెల్ విషయానికి వస్తే ఇదే సంవత్సరం మార్చి 10వ తేదీన నేపాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే నెల 13వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు నేపాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్, యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్రనెబమాంగ్‌పై ఘానా విజయం సాధించారు. పౌడెల్ 214 మంది ఎమ్మెల్యేలు , 352 మంది ప్రవీణ్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లను అవలీలగా కైవసం చేసుకున్నారు. ఇంత మెజారిటీతో గెలుపొందిన ఈయన దేశానికి మరింత సేవలు చేయాల్సి ఉంది. కానీ, ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ‌లోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.