Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం..

Nepal Earthquake: నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం(Earthquake)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 128 మంది చనిపోగా.. దాదాపు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే శిథిలాల కింద మరికొందరు చిక్కుకోవడంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్ భూకంపం(Nepal earthquake)లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం నేపాల్‌ను వణికించింది. ఈ భూకంపం ధాటికి భారత్‌(India)లోని పలు […]

Share:

Nepal Earthquake: నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం(Earthquake)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 128 మంది చనిపోగా.. దాదాపు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే శిథిలాల కింద మరికొందరు చిక్కుకోవడంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నేపాల్ భూకంపం(Nepal earthquake)లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం నేపాల్‌ను వణికించింది. ఈ భూకంపం ధాటికి భారత్‌(India)లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో మొదట ప్రమాద తీవ్రత అంత బయటపడలేదు. సహాయక చర్యలు(Assistive measures) చేపడుతుండగా.. మృతులు, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ భారీ భూకంపం సంభవించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ(National Earthquake Monitoring), పరిశోధన కేంద్రం పేర్కొంది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు రిక్టర్‌ స్కేల్‌(Richter scale)పై 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(US Geological Survey) తెలిపింది. 

జజర్‌కోట్‌(Jajarkot)లో భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం గుర్తించింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లా(Rukham District)లో 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ(Pushp Kamal Dahal Prachanda) సంతాపం ప్రకటించారు.

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 128 కి ఎగబాకింది. మరోవైపు.. 140 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో నేపాల్(Nepal) విపత్తు నిర్వహణ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టం కావడంతో వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించడం, చనిపోయిన వారి మృత దేహాలను వెలికితీయడం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతకు భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi), ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), బిహార్‌(Bihar)లలోని పలు ప్రాంతంలో భూమి కంపించడంతో అర్ధరాత్రి జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌(Viral)గా మారాయి.

 నేపాల్‌లో 2015న వచ్చిన భూకంపం నాటి విషాదఛాయలు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే.. దానికి మించిన ప్రకృతి విలయం రాబోతోందని  హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్‌లో నెల రోజుల్లో మూడు సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి వచ్చిన బలమైన ప్రకంపనలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది  మందిని మింగేశాయి. నేపాల్‌లో  మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 

నవంబర్ 2022లో నేపాల్‌లోని దోటీ జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న (అక్టోబర్‌ 3న) నేపాల్‌ను తాకిన వరుస భూకంపాలు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. నేపాల్ సెంట్రల్ బెల్ట్ నిరంతర శక్తి విడుదల రంగంగా గుర్తించబడిందని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ టెక్టోనిక్ ప్లేట్(Tectonic plate), యురేషియన్ ప్లేట్(Eurasian plate) ఢీకొన్నందున ఆ ప్రాంతంలో ఎప్పుడైనా పెను భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనే కాదు… చాలా మంది నిపుణులు అనేక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.