Nawaz Sharif: భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటా- నవాజ్ షరీఫ్

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) బ్రిటన్‌లో నాలుగేళ్లు గడిపిన తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చారు. లాహోర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని, కాశ్మీర్ సమస్య(Kashmir issue)ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పాక్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్(Nawaz Sharif).. లాహోర్‌లోని మినార్-ఏ-పాకిస్తాన్ వద్ద తన పార్టీ (PML-N) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పడానికి మరియు కాశ్మీర్ సమస్యను […]

Share:

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) బ్రిటన్‌లో నాలుగేళ్లు గడిపిన తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చారు. లాహోర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని, కాశ్మీర్ సమస్య(Kashmir issue)ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పాక్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్(Nawaz Sharif).. లాహోర్‌లోని మినార్-ఏ-పాకిస్తాన్ వద్ద తన పార్టీ (PML-N) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పడానికి మరియు కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఆకాంక్షను ఆయన ప్రస్తావించారు.

 పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం ద్వారా పాకిస్తాన్‌(Pakistan)ను ఆర్థిక శక్తిగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను షరీఫ్ నొక్కిచెప్పారు. పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుండి విడిపోయి ఉండకపోతే, భారతదేశం(India) ద్వారా అనుసంధానించే ఆర్థిక కారిడార్ ఉండేదని పేర్కొన్నారు. షరీఫ్ రాజ్యాంగాన్ని అనుసరించాలని మరియు పాకిస్తాన్ అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

అదనంగా, అతను తన ప్రవాస సమయంలో తన తల్లి మరియు భార్యను కోల్పోయిన భావోద్వేగ అనుభవాలను పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘నవాజ్ షరీఫ్‌ను అతడి దేశం నుంచి విడదీసింది ఎవరో చెప్పండి ? పాకిస్తాన్‌(Pakistan)ను అణుశక్తిగా మార్చింది మేమే. దేశ ప్రజలకు చౌకగా విద్యుత్ అందేలా ఏర్పాట్లు చేసింది మేమే. ఇకపై కూడా ఈ దేశ నిర్మాణానికి రాజీ లేకుండా శ్రమిస్తాం’’ అని ఆయన తెలిపారు.‘‘రాజకీయాల వల్ల నేను వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయాను. రాజకీయ కారణాల వల్లే నా తల్లి, భార్య చనిపోయినప్పుడు వారికి సరైన వీడ్కోలు కూడా చెప్పలేకపోయాను’’ అని చెబుతూ షరీఫ్ ఎమోషనల్ అయ్యారు.

 ‘‘నన్ను నమ్మండి.. మీ ప్రేమను చూసి నా బాధంతా మర్చిపోయాను. నా బాధలు మళ్లీ గుర్తుకు రావాలని అనుకోవడం లేదు. కానీ ఎప్పటికీ మానలేని గాయాలు కొన్ని ఉన్నాయి’’ అని కార్యకర్తలతో నవాజ్ అన్నారు. షరీఫ్ తిరిగి రావడం మరియు ప్రకటనలు పాకిస్తాన్‌లో గణనీయమైన దృష్టిని ఆకర్షించాయి.

పాక్ తలరాత మార్చేస్తారా..?  

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) దాదాపు నాలుగేళ్ల తరవాత పాక్‌కి వచ్చారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవాజ్ మళ్లీ పాక్‌లో అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇస్లామాబాద్ హైకోర్టు (Islamabad High Court) షరీఫ్‌కి ప్రొటెక్టివ్ బెయిల్ ఇచ్చింది. అందుకే వెంటనే పాకిస్థాన్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ కీలక ప్రకటన చేసింది. “అందరూ వేడుకలు చేసుకోవాల్సిన సమయమిది. ఆయన రాకతో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం” అని వెల్లడించింది. 

నవాజ్ షరీఫ్‌(Nawaz Sharif) పాకిస్థాన్‌కి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అంతే కాదు. రాజకీయాల్లో ఉండకుండా అనర్హతా వేటు వేశారు. ఏడేళ్ల జైలు శిక్ష పడినప్పటికీ ఏడాదిలోగానే బయటకు వచ్చారు. యూకే(UK)లో మెడికల్ పేరుతో కోర్టు ఉత్తర్వులనూ పక్కన పెట్టి విడుదలయ్యారు. గతేడాది నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్‌(Shehbaz Sharif) ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ హయాంలోనే కొన్ని కీలక మార్పులు చేశారు. రాజకీయ నాయకుల అనర్హతా వేటు గడువుని తగ్గించారు. ఏడేళ్ల గడువుని ఐదేళ్లకి తగ్గించారు.  

భారత్ ఓ వైపు చంద్రుడిని చేరుకుంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు అడుక్కుతింటోందని ఇటీవలే నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ G20 సమ్మిట్‌ని నిర్వహించిందని, ప్రస్తుతం భారత్‌లో 600 బిలియన్ డాలర్ల ట్రెజరీ ఉందని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్.. చైనా, అరబ్ దేశాలు సహా ప్రపంచం నలుమూలల నుంచి 1-1 బిలియన్ డాలర్లను యాచిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి ముందు మనం ఏం తలెత్తుకోగలమని అన్నట్లుగా పాకిస్తాన్ మీడియా కథనాలు రాసింది. 

నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఈ స్థితికి రావడానికి కారణమైన వారు దేశంలోని అతిపెద్ద నేరస్థులు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ప్రభుత్వం దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించింది. లేదంటే దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.వెయ్యికి చేరుకునేది. దేశం ప్రస్తుత ఈ పరిస్థితికి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్, మాజీ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్ బాధ్యులు’’ అని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.