భయానకంగా మౌయి కార్చిచ్చు..

అమెరికాకు చెందిన మౌయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. 100 మంది మరణించడమే కాకుండా వేల సంఖ్యలో మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. ఒకప్పుడు భూతల స్వర్గంలా ఉండే మౌయి దీవులు ప్రస్తుతం ఒక రకమైన విషాదంతో మిగిలిపోయాయి. వందల మంది మరణించడమే కాక వేల సంఖ్యలో మూగ జంతువులు కూడా గూడును కోల్పోయాయి. అక్కడ చెలరేగిన కార్చిచ్చు […]

Share:

అమెరికాకు చెందిన మౌయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. 100 మంది మరణించడమే కాకుండా వేల సంఖ్యలో మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. ఒకప్పుడు భూతల స్వర్గంలా ఉండే మౌయి దీవులు ప్రస్తుతం ఒక రకమైన విషాదంతో మిగిలిపోయాయి. వందల మంది మరణించడమే కాక వేల సంఖ్యలో మూగ జంతువులు కూడా గూడును కోల్పోయాయి. అక్కడ చెలరేగిన కార్చిచ్చు వెయ్యి డిగ్రీల ఫారన్ హీట్ (538 డిగ్రీ సెల్సియస్) వేడిని ఉత్పత్తి చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

ఫొటోలు తీసిన NASA

అంతరిక్ష పరిశోధన కేంద్రం NASA  ఈ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఎటు చూసినా ప్రస్తుతం అక్కడ బూడిదే కనిపిస్తోంది.  ఈ విధ్వంసం ఎంత దారుణంగా ఉందో NASA పంపిన ఫొటోలను చూస్తేనే అర్థమవుతోంది. మనం ఫొటోలలో చూస్తేనే ఇలా ఉంటే అక్కడే ఉన్న మనుషులకు జంతువులకు ఎంతలా బాధ కలిగిందో అని అంతా  చర్చించుకుంటున్నారు. పసిఫిక్ మహాసముద్రం నుంచి 259 మైళ్ల దూరంలో కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఫొటోలు తీయబడ్డాయి. 

100 దాటిన మృతుల సంఖ్య

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. బుధవారం నాటికి ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 100 దాటిపోయినట్లు అక్కడి స్థానిక  అధికారులు వెల్లడించారు. ఈ మంటలకు సరైన కారణం ఇంకా తెలియరాలేదు. కానీ నిపుణులు మాత్రం మంటలకు కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టారు. 

అవే అంటించాయా??

మౌయి దీవి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెరుకు తోటల దహనం, మరియు గడ్డి దహనం వంటివి ఈ మంటలకు కారణం కావొచ్చునని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మంటలు చెలరేగేందుకు గడ్డి కారణం కావొచ్చు కానీ ఈ మంటల ద్వారా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. వాతావరణ మార్పులు కూడా ఈ మంటల పెరుగుదలకు దోహదం చేశాయని వారు చెబుతున్నారు. కావున వాతావరణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా వాతావరణ మార్పు అనేది ఇలా కార్చిచ్చు సంభవించినపుడు ఒక ముప్పు గుణకంలా పని చేస్తుందని NASA  కు చెందిన స్పేస్ సెంటర్ డైరెక్టర్ స్మిత్ తెలియజేశారు. అందుకోసమే మనం వాతావరణం పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరించాలని ఆయన సూచించారు. 

నిరాశ్రయులుగా వేల మంది

ఈ మంటల వల్ల వందల సంఖ్యలో మనుషులు మరణించడమే కాకుండా వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. చాలా మంది నిరాశ్రయులు కాగా మరింత మంది తప్పిపోయినట్లు సమాచారం. కావున ఈ మంటలు తీవ్ర నష్టంతో పాటు మానవాళికి పెద్ద గుణపాఠాన్ని నేర్పాయి. అంతే కాకుండా నష్టాలను కూడా మిగిల్చాయి. 

వైరల్ అవుతున్న స్పేస్ ఫొటోలు 

NASA  పంపిన ఉపగ్రహ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వీటిని చూసిన చాలా మంది నెటిజన్లు ఫీల్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతో సుందరంగా ఉంటూ పర్యాటకులను అట్రాక్ట్ చేసే మౌయి ద్వీపం మంటల్లో తన రూపాన్ని కోల్పోవడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కార్చిచ్చు త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నారు. అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఎన్ని సహాయక చర్యలు చేపట్టినా కానీ మౌయిలో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.