పెసిఫిక్ మ‌హాసముద్రంలో గోల్డెన్ గుడ్డు

సముద్రాలు ఎన్నో వస్తువులకు వేదికగా ఉంటాయి. ఎన్నో వింత వస్తువులు సముద్రాల్లో బయటపడుతుంటాయి. వాటిని మనం చూసినపుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకోసమే సముద్రాలలో బయటపడిన వస్తువుల విషయంలో శాస్త్రవేత్తలు కొత్త ఉత్సాహంతో ఉంటారు. ఈ వస్తువుల నుంచి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అందుకోసమే వీటి గురించి నిత్యం అన్వేషణను సాగిస్తుంటారు. ప్రస్తుతం పెసిఫిక్ మహాసముద్రంలో ఇటువంటి గమ్మత్తైన వస్తువు ఒకటి బయటపడింది. ఈ వస్తువును చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఆ […]

Share:

సముద్రాలు ఎన్నో వస్తువులకు వేదికగా ఉంటాయి. ఎన్నో వింత వస్తువులు సముద్రాల్లో బయటపడుతుంటాయి. వాటిని మనం చూసినపుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకోసమే సముద్రాలలో బయటపడిన వస్తువుల విషయంలో శాస్త్రవేత్తలు కొత్త ఉత్సాహంతో ఉంటారు. ఈ వస్తువుల నుంచి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అందుకోసమే వీటి గురించి నిత్యం అన్వేషణను సాగిస్తుంటారు. ప్రస్తుతం పెసిఫిక్ మహాసముద్రంలో ఇటువంటి గమ్మత్తైన వస్తువు ఒకటి బయటపడింది. ఈ వస్తువును చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఆ వస్తువు మీద పలు పరిశోధనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. 

గుడ్డును పోలిన బంగారు గోళం

ఈ మధ్య పసిఫిక్ సముద్ర గర్భంలో ఒక వింత వస్తువు కనిపించింది. అలస్కా తీరంలో ఈ వస్తువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుడ్డును పోలిన ఈ రహస్య వస్తువు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన పరిశోధనా బృందం ఆగస్టు 30వ తేదీన ఈ వింత వస్తువును కనుకొంది. అన్వేషకుల బృందం సీస్కేప్ అలాస్కా 5 యాత్రలో రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని అన్వేషిస్తున్నప్పుడు మెరిసే బంగారు గోళాన్ని కనుగొన్నారు. ఇది 10 సెంటీమీటర్ల (4 అంగుళాలు) కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంది. మరియు దాని బేస్ దగ్గర చిన్న కన్నీటిని కలిగి ఉంటుంది. దీంతో ఈ వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం శాస్త్రవేత్తలే అనే కాకుండా సాధారణ మానవులను కూడా ఈ వస్తువు ఆకర్షిస్తోంది. అందుకోసమే దీని విషయంలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. 

సోషల్ మీడియాలో షేర్ చేసిన NOAA

ఇలా వింత వస్తువు బయటపడడంతో అంతా ఒక్కసారిగా ఈ వస్తువు మీద కాన్సంట్రేట్ చేశారు. ఈ వింత వస్తువు గురించి అందుకు సంబంధించిన వీడియోను NOAA సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ బంగారు గోళము, గుడ్డు కేసింగ్ కావచ్చునని పేర్కొంది. ఇటువంటి వింత వస్తువులను కేవలం సినిమాల్లో చూడడం మాత్రమే అని ఇలా లైవ్ లో చూడడం ఇదే మొదటి సారని చాలా మంది ఈ విషయాన్ని చూసిన వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అందుకోసమే ఈ గోళం గురించి మరింత తెలసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కనిపించిన గోళం బంగారు వర్ణంలో ఉండడంతో అంతా అప్పటి నుంచి ఆ వస్తువును బంగారు గుడ్డు అని పిలవడం ప్రారంభించారు.  NOAA ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ కోఆర్డినేటర్ అయిన సామ్ కాండియో మాట్లాడుతూ.. బంగారు గోపురం తెలిసిన జాతి, కొత్త జాతితో అనుబంధించబడిందా లేదా ఇప్పటికే ఉన్న ఒక తెలియని జీవిత దశను సూచిస్తుందా అనేది అస్పష్టంగానే ఉందని తెలియజేశారు. 

మేము ‘గోల్డెన్ ఆర్బ్’ని సేకరించి ఓడలోకి తీసుకురాగలిగినప్పటికీ, అది జీవసంబంధమైన మూలం అనే వాస్తవాన్ని మించి దానిని గుర్తించలేకపోయామని అతడు వెల్లడించాడు. దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అతడు వెల్లడించాడు. ఇందుకోసం తగు ప్రణాళికలు వేస్తున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. కనుగొన్న విషయాలు తక్కువే అని కనుగోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని వారు చెబుతున్నారు. త్వరలోనే ఈ బంగారు గుడ్డుకు సంబంధించిన మరిన్ని విషయాలను గురించి పూర్తిగా అన్వేషిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో తప్పకుండా వివరాలను తెలుసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక NOAA ప్రస్తుతం అలాస్కా సమీపంలోని సముద్రపు లోతులను అన్వేషించడానికి ఐదు నెలల మిషన్ ను నిర్వహిస్తోంది. ఐదు నెలల పాటు ఈ మిషన్ కొనసాగుతోంది.