షాని లౌక్ బ్రతికే ఉందని తల్లి ఆవేదన

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మకమైన సంఘటన మళ్లీ ఇజ్రాయిల్ వీధిలో చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ దేశం మీద ఆకస్మిక దాడులకు దిగిన సమస్య ఉగ్రవాదుల మూక చేస్తున్న అరాచకాలు ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయిల్ వీధుల్లో షాని లౌక్ అనే యువతి మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించిన వైనం కనిపిస్తోంది. అంతేకాకుండా స్వయంగా, కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది.  షాని లౌక్ బ్రతికే ఉందని తల్లి ఆవేదన:  ఇజ్రాయిల్ వీధుల్లో […]

Share:

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మకమైన సంఘటన మళ్లీ ఇజ్రాయిల్ వీధిలో చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ దేశం మీద ఆకస్మిక దాడులకు దిగిన సమస్య ఉగ్రవాదుల మూక చేస్తున్న అరాచకాలు ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయిల్ వీధుల్లో షాని లౌక్ అనే యువతి మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించిన వైనం కనిపిస్తోంది. అంతేకాకుండా స్వయంగా, కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. 

షాని లౌక్ బ్రతికే ఉందని తల్లి ఆవేదన: 

ఇజ్రాయిల్ వీధుల్లో షాని లౌక్ అనే యువతి మృతదేహాన్ని నగ్నంగా ఊరేగించిన వైనం కనిపిస్తోంది. తన తల్లి అదేవిధంగా సోదరీ వీడియో చూసిన అనంతరం ఊరేగింపుకు గురైన వ్యక్తి, తన కన్న కూతురిని తల్లి వెల్లడించింది. అయితే ఇప్పుడు తన కూతురు చనిపోలేదని ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయాలపాలై ఒక హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతుందని, గాజా స్ట్రిప్ లో ఉంటున్న తన స్నేహితురాలు రికార్డ చెప్పిందని, షాని లౌక్ తల్లి ఆవేదన. 

అయితే తమకి జర్మన్ ప్రభుత్వం ఎలాగైనా సహాయం చేయాలని, తన కూతుర్ని తిరిగి తమకి అప్పగించేందుకు తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలని తల్లి తన ఆవేదనను వ్యక్తం చేసింది. తన కూతురు హాస్పిటల్ లో ఉందని, ప్రతి నిమిషం కూడా ఎంతో ముఖ్యమని ప్రభుత్వమే తమకు సహాయం చేయాలని కోరింది. 

ఇజ్రాయిల్ వీధుల్లో షాని లౌక్ నగ్నంగా ఊరేగింపు: 

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ షేర్ చేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయిల్ కు చెందిన నగ్నంగా ఉన్న అమ్మాయి మృతదేహాన్ని ఇశ్రాయేల్ వీధిలో ఊరేగిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. news.com.au ప్రకారం, మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికులకు చెందిన వారిని హమాస్ మొదట పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన అమ్మాయి తన సోదరి అని, జర్మన్ దేశానికి చెందిన అమ్మాయిని..టాటూ ఆర్టిస్ట్ అయిన షానీ లౌక్ అని ట్విట్టర్ ద్వారా ఆది లౌక్ స్పష్టం చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అంతే కాకుండా షానీ లౌక్ తల్లి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తనకి తెలియాలని, తన కూతురు గురించి తెలుసుకునేందుకు తనకి సహాయం చేయమని వేడుకుంటుంది.

నిజానికి షానీ లౌక్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వెళ్లినట్లు తన కజిన్ పేర్కొంది. అయితే తప్పకుండా తన సోదరి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకుంటుందని అనుకున్న తమకి నిజంగా ఒక పీడకల లాంటి సంఘటన ఎదురవుతుందని అనుకోలేదని ఆది లౌక్ పేర్కొంది. షాని హాజరైన సంగీత ఉత్సవం, హమాస్ మిలిటెంట్లచే దాడి చేసిన మొదటి సైట్లలో షాని హాజరైన మ్యూజిక్ ఫెస్టివల్ ఒకటి. దాదాపు 100 మంది సైనికులు మరియు పౌరులను హమాస్ కిడ్నాప్ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు విధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారని, పౌరులను ఊచకోత కోశారని.. వందలాది మంది దేశంపై దాడి చేశారని, ఇంకా వందల మంది ఇజ్రాయెల్ లోపల సైనికులతో పోరాడుతున్నారు అని ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు.