భారత దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల

అయితే ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా చక్కని లాభాలతో మంచి పని తీరుతో స్థిరంగా ఉందని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఓవర్ వెయిట్ అంటూ మోర్గాన్ స్టాన్లీ ఇప్పటికే అంచనా వేసింది. అంతేకాకుండా మన భారత దేశ రేటింగ్ను కూడా అత్యధికంగా పెంచేసింది.  అయితే ప్రస్తుతం రేటింగులను ఇచ్చే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రేటింగ్ అత్యధికంగా పెంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మునపటి కంటే భారత దేశ […]

Share:

అయితే ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా చక్కని లాభాలతో మంచి పని తీరుతో స్థిరంగా ఉందని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఓవర్ వెయిట్ అంటూ మోర్గాన్ స్టాన్లీ ఇప్పటికే అంచనా వేసింది. అంతేకాకుండా మన భారత దేశ రేటింగ్ను కూడా అత్యధికంగా పెంచేసింది. 

అయితే ప్రస్తుతం రేటింగులను ఇచ్చే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రేటింగ్ అత్యధికంగా పెంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మునపటి కంటే భారత దేశ రేటింగ్ అనేది మెరుగ్గా ఉండడాన్ని గమనించి ఓవర్ వైట్ గా పరిగణించింది మోర్గాన్ స్టాన్లీ. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంస్కరణల ఎజెండా మూలధన్న విషయంలో అదే విధంగా లాభాల విషయంలో సానుకూల అభివృద్ధి ఉన్నందువలన మోర్గాన్ స్టాన్లీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తనకున్న విశ్వాసాన్ని బయటపెట్టింది. 

మరోవైపు మన పొరుగు దేశం అయిన చైనా రేటింగ్ ఇస్తూ ఈక్వల్ వెయిట్ అంటూ చెప్పుకొచ్చింది. మోర్గాన్ స్టాన్లీ చైనీస్ స్టాక్‌లపై రేటింగ్‌ను సమాన బరువుకు తగ్గించిన సమయంలో, భారతదేశం ఆర్థిక వ్యవస్థపై కదలిక వచ్చింది, పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు ప్రస్తుత అవకాశాలను వినియోగించుకోవాలని సూచించింది. వృద్ధి మరియు వాల్యుయేషన్ కొనసాగుతున్నందున MSCI చైనాను సమాన బరువుకు తగ్గించినట్లు విదేశీ బ్రోకరేజ్ తెలిపింది.

స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఎప్పుడూ సరైన రీతిలో ఉంది అంటూ, అందుకే భారతదేశంకి విదేశీ పెట్టుబడులు, పోర్ట్ పోలియోలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు వచ్చాయని చెప్పింది. అంతే కాకుండా దీర్ఘకాల అభివృద్ధి దశగా భారతదేశం మెల్లమెల్లగా అడుగులు వేయడాన్ని తాను గమనించాను అంటూ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం భారత దేశంలో స్థిరంగా ఉంది అంటూ 6.2 వృద్ధి చూస్తూ ఇంకాస్త అభివృద్ధి దశగా వెళ్తుందని తన నివేదికలో పేర్కొంది మోర్గాన్ స్టాన్లీ.

ఇతర దేశాల రేటింగ్ ని చూద్దాం: 

ఆసియా పసిఫిక్ ఎక్స్-జపాన్ మరియు ఎమర్జింగ్ మార్కెట్ల బాస్కెట్‌లో మోర్గాన్ స్టాన్లీకి భారతదేశం ఇప్పుడు ప్రధాన అధిక బరువు మార్కెట్‌గా మారింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మరియు చైనాలకు భారతదేశం యొక్క వాల్యుయేషన్ ప్రీమియంలు గత అక్టోబర్ గరిష్ట స్థాయి నుండి గణనీయంగా తగ్గాయి, కానీ ప్రస్తుతానికి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.

మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన నివేదికలో, కొరియాలో దాని అధిక బరువు రేటింగ్‌ను యధావిధిగా కొనసాగిస్తూనే ఉంది, తైవాన్‌కు సంబంధించి మరింత వాల్యుయేషన్ సపోర్ట్ మరియు “నాన్-టెక్ డ్రైవర్లు” దీనికి కారణం అంటున్నారు. మరో పక్క, ఇది ఆదాయాలు/విలువలు రిస్క్‌లను పేర్కొంటూ ఆస్ట్రేలియా ఈక్విటీల రేటింగ్‌ను తక్కువ బరువుకు తగ్గించింది. 

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని తెలిసి, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు మరింత మక్కువ చూపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఇది మన భారతదేశ రూపాయి మీద కూడా దాన్ని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. 

అంతేకాకుండా విదేశీ పెట్టుబడిదారులు భారతదేశ వైపు, ప్రస్తుతం వచ్చిన రేటింగు బట్టి పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపిస్తున్నట్లే అనిపిస్తోంది. ఇలాగే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త ముందుకు వెళ్లాలని కోరుకుందాం.