Egypt: పాలస్తీనా యుద్ధంలో త‌ల‌దూర్చిన‌ ఈజిప్ట్ వాసులు

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestine) యుద్ధం భయంకరంగా సాగుతోంది. మొదట సైలెంట్ (Silent) గా ఉన్న ఇజ్రాయెల్ (Israel) ను పాలస్తీనాలో ఉండే హమాస్ (Hamas) ఉగ్రవాదులు కవ్వించారు. దీంతో ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. దీంతో హమాస్ టెర్రరిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇజ్రాయెల్ (Israel) మాత్రం హమాస్ టెర్రరిస్టులు ఎంతలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కానీ యుద్ధాన్ని మాత్రం కంట్రోల్ చేయడం లేదు. ఈ యుద్ధంలో అనేక మంది సామాన్య పౌరులు (Common Mans) తీవ్రంగా నష్టపోతున్నారు. […]

Share:

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestine) యుద్ధం భయంకరంగా సాగుతోంది. మొదట సైలెంట్ (Silent) గా ఉన్న ఇజ్రాయెల్ (Israel) ను పాలస్తీనాలో ఉండే హమాస్ (Hamas) ఉగ్రవాదులు కవ్వించారు. దీంతో ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. దీంతో హమాస్ టెర్రరిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇజ్రాయెల్ (Israel) మాత్రం హమాస్ టెర్రరిస్టులు ఎంతలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కానీ యుద్ధాన్ని మాత్రం కంట్రోల్ చేయడం లేదు. ఈ యుద్ధంలో అనేక మంది సామాన్య పౌరులు (Common Mans) తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా కానీ ఇటు ఇజ్రాయెల్ (Israel), అటు హమాస్ వెనక్కు తగ్గడం లేదు. హమాస్ టెర్రరిస్ట్ (Terrorist) గ్రూప్ ను సమూలంగా నిర్మూలించే వరకు తమ పోరాటం మాత్రం తగ్గించమని ఇజ్రాయెల్(Israel) ప్రకటించింది. కేవలం ఆ దేశ సైనికులు (Soldiers) మాత్రమే కాకుండా ప్రధాని కూడా తమ టార్గెట్ హమాస్ మిలిటెంట్లే అని ప్రకటించారు. వారు అంతం అయ్యేంత వరకు తమ పోరాటం ఆపమని ప్రకటించారు. ఈయుద్ధం వల్ల కేవలం ఆ రెండు దేశాలలోఅని మాత్రమే కాకుండా అనేక ప్రపంచ దేశాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పాలస్తీనా పక్కన ఉన్న ఈజిప్ట్ దేశంలో కూడా నిరసనలు చెలరేగాయి. 

ఈజిప్టులో నిరసనలు 

ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestine) యుద్ధం గురించి కేవలం అక్కడి పౌరులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా (World Wide) అనేక మంది  ఆందోళన చెందుతున్నారు. కొంత మంది  ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. గత వారం చివర్లో పాలస్తీనియన్ (Palestine) అనుకూల ప్రదర్శనలలో పాల్గొన్న తరువాత కనీసం 100 మందిని ఈజిప్టులో (Egypt) అరెస్టు చేశారు. అయితే కొంతమందిని విడుదల చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. గాజా (Gaza) స్ట్రిప్‌ లో ఇజ్రాయెల్ సైనిక ప్రచారానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆమోదించిన నిరసనలు శుక్రవారం కైరోలో మరియు ఈజిప్ట్‌లోని ఇతర ప్రాంతాలలో జరిగాయి. ఈజిప్టులో అనధికారిక ప్రజా నిరసనలు నిషేధించబడ్డాయని కావున వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. 

Also Read: Palestine-Israel: పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం అవసరం.. 

40 మంది కైరోలో, 65 మంది అలెగ్జాండ్రియాలో

ఈ అరెస్ట్ లో దాదాపు 100 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 40 మంది కైరోలో, 65 మంది అలెగ్జాండ్రియాలో మరియు మరికొందరు ఇతర ప్రావిన్సులకు చెందినవారుగా పోలీసులు ప్రకటించారు. కైరో నుంచి పట్టుబడిన వారిలో పద్నాలుగు మందిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పిలిపించారని మానవ హక్కుల న్యాయవాది నబెహ్ ఎల్గనాడి తెలిపారు.

కైరో నుంచి కనీసం 18 మంది ఖైదీలను సోమవారం విడుదల చేశారని ఆ సంఖ్య మరింతలా పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి ప్రకటించారు. 

కేవలం అక్కడ మాత్రమే కాదు.. 

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కేవలం అక్కడి పౌరులకు మాత్రమే చిక్కులు తేవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ యుద్ధం వల్ల సఫర్ (Suffer) అవుతున్నారు. కేవలం గాజా పౌరులనే కాకుండా ఇజ్రాయెల్ లో నివాసం ఉంటున్న నివాసితులు కూడా ఈ యుద్ధానికి సఫర్ అవుతున్నారు. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ మీద అనవసరంగా హమాస్ గ్రూప్ టెర్రరిస్టులు దాడులు చేయడంతో వారు కూడా భీకర దాడులకు దిగారు. దీంతో యుద్ధంతో ఎటువంటి సంబంధం లేని అమాయక పౌరులు అనేక అవస్థలు పడుతున్నారు. అయినా కానీ హమాస్ టెర్రరిస్టులు మాత్రం తమ దాడులను ఆపడం లేదు. మరో పక్క ఇజ్రాయెల్ కూడా తమ లక్ష్యం సామాన్య పౌరులు కాదని భయంకర హమాస్ ఉగ్రవాదులేనని ప్రకటించింది. ఈ యుద్ధం గురించి అనేక ప్రపంచ దేశాలు ఆందోళలనను వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అనేక దేశాలతో పాటుగా ఐక్యరాజ్య సమితి (UNO) ప్రతినిధులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ హమాస్ ఉగ్రవాదులు మాత్రం వెనకడుగు వేయడం లేదు.