ప్లాస్టిక్ సర్జరీ కారణంగా మరణించిన అర్జెంటీనా మోడల్

అర్జెంటీనా మోడల్, నటి సిల్వినా లూనా 43 సంవత్సరాల వయస్సులో అకాల మరణం దిగ్భ్రాంతులకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ వార్త విన్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అర్జెంటీనా వినోద ప్రపంచంలో సుప్రసిద్ధ వ్యక్తి అయిన లూనా, ప్రత్యేకంగా బట్ లిఫ్ట్ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా, ఫలితంగా ఎదురైనా అనేక సమస్యల కారణంగా తన జీవితాన్ని కోల్పోయింది. అసలు ఏం జరిగింది:  నివేదికల ప్రకారం, లూనా చనిపోయే రెండు వారాల ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు […]

Share:

అర్జెంటీనా మోడల్, నటి సిల్వినా లూనా 43 సంవత్సరాల వయస్సులో అకాల మరణం దిగ్భ్రాంతులకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ వార్త విన్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అర్జెంటీనా వినోద ప్రపంచంలో సుప్రసిద్ధ వ్యక్తి అయిన లూనా, ప్రత్యేకంగా బట్ లిఫ్ట్ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా, ఫలితంగా ఎదురైనా అనేక సమస్యల కారణంగా తన జీవితాన్ని కోల్పోయింది.

అసలు ఏం జరిగింది: 

నివేదికల ప్రకారం, లూనా చనిపోయే రెండు వారాల ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ సర్జరీ తన జీవితంలో ఒక తీవ్రమైన మలుపుకి దారితీస్తుందని ఎవరు ఊహించలేదు, ఈ సర్జరీ అనంతరం, కిడ్నీ ఫెయిల్యూర్ తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసింది. ఆమెను రక్షించడానికి వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, లూనా చివరికి ఫలితం లేకపోయింది. ఆమె జీవితాన్ని ముగించింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ బాధలో మునిగిపోయారు.

ముందు నుంచే కిడ్నీ ప్రాబ్లం: 

2015లో కిడ్నీలో రాళ్ల కారణంగా కొంతవరకు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని అప్పట్లో డాక్టర్లు ఆమెను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఖచ్చితంగా, ఆమె కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేంతవరకు డయాలసిస్ కూడా చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించడం జరిగింది. కానీ ఈ క్రమంలోనే ఇలా జరగడం బాధాకరం.

2016లో, ఆమె మియామీకి వెళ్లి అర్జెంటీనా డాక్టర్ క్రిస్టియన్ పెరెజ్‌ను కలుసుకుంది, ఆమె ఇటువంటి సర్జరీ చేయించుకోకముందే, ఆమె వెనక భాగం నుంచి, క్రిస్టియన్ పెరెజ్‌ ద్వారా కొంత ప్రమాదకరమైన పదార్థాలు తొలగించుకుంది. అయితే సర్జరీకి సంబంధించి, ఆమె వాడిన మందుల కారణంగా కూడా, ఆటో యూనియన్ అనే వ్యాధి ఆమెకు సోకిందని, డాక్టర్ పెరెజ్ స్థానిక వార్తా సంస్థలకు తెలియజేశారు.

లూనా మరణ వార్త, కాస్మెటిక్ సర్జరీతో ముడిపడి ఉన్న నష్టాలను, అదేవిధంగా సర్జరీ చేయించుకునేటప్పుడు డాక్టర్ ని ఎంచుకునే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఎటువంటి జాగ్రత్తలు లేకుండా, ఇతరుల ప్రేరేపనతో సర్జరీలు చేయించుకోవడం అనేది ఒకింత ఆలోచించాల్సిన విషయం అంటున్నారు.

సిల్వినా లూనా మృతితో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆమె విషాద మరణం నిజానికి ఒక హెచ్చరిక కథగా మారిపోయింది. సౌందర్యాన్ని పెంచుకునే క్రమంలో అనవసరమైన సర్జరీల బారినపడి, కొని తెచ్చుకుంటున్న ప్రమాదాల గురించి మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా సౌందర్యాన్ని పెంపొందించుకునే విషయాన్ని పక్కనపడితే, ముఖ్యంగా అన్నిటికన్నా మనిషి యొక్క భద్రత మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యతను ఇవ్వడం అనేది, మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని మరొకసారి గుర్తు చేసింది సిల్వినా మరణం. 

సర్జరీ చేయించుకుని అనుకోకుండా మరణించిన వారు ఎంతో మంది: 

ముఖ్యంగా నటీనటులు ఈ ప్లాస్టిక్ సర్జరీల బారిన పడి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే, తెలుగు నటి ఆర్తి అగర్వాల్ ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ బారిన పడే చనిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కొన్ని నెలలకే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురై అమెరికాలో చనిపోయింది ఆర్తి అగర్వాల్. అంతేకాకుండా, కన్నడ నటి చేతన రాజ్, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ప్లాస్టిక్ సర్జరీ వల్ల వాటిల్లే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే ఎంతోమంది నటీనటులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఒకసారి సర్జరీ చేయించుకునే ముందు అన్ని జాగ్రత్తలు ప్రత్యేకించి చూసుకోవడం ఎంతో ముఖ్యం. లేదంటే విషాదం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు అర్జెంటీనా మోడల్, నటి సిల్వినా లూనా విషయంలో కూడా అదే జరిగింది.