భార‌త్‌లో సూప‌ర్‌మూన్‌..!

అంతరిక్షంలో అప్పుడప్పుడు అనుకోకుండా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం.. నిజంగా ఆకాశంలో ఆ అద్భుతాలు జరిగినప్పుడు మనకు స్పష్టం అవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు.. చల్లటి వాతావరణాన్ని  అందించే చంద్రుడు కూడా ఒక్కోసారి మన నెత్తిమీదకి వచ్చాడా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది.  ఇక ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా చంద్రుడు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో భూమికి అతి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఇలా వచ్చినప్పుడే మనం ఆ చంద్రుడిని సూపర్ మూన్ అని […]

Share:

అంతరిక్షంలో అప్పుడప్పుడు అనుకోకుండా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం.. నిజంగా ఆకాశంలో ఆ అద్భుతాలు జరిగినప్పుడు మనకు స్పష్టం అవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు.. చల్లటి వాతావరణాన్ని  అందించే చంద్రుడు కూడా ఒక్కోసారి మన నెత్తిమీదకి వచ్చాడా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది.  ఇక ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా చంద్రుడు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో భూమికి అతి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఇలా వచ్చినప్పుడే మనం ఆ చంద్రుడిని సూపర్ మూన్ అని పిలుస్తూ ఉంటాము. ఇకపోతే ఈ ఏడాది అనగా 2023 సంవత్సరంలో నాలుగు సార్లు సూపర్ మూన్  మనకు కనిపిస్తుందట. వీటిలో మొదటిది జూలై 3 2023న అంటే ఈరోజు రాత్రికి కనిపించనుంది.

ఈరోజు సాయంత్రం 7:39 నిమిషాలకు సూర్యుడు అస్తమించిన తర్వాత భూమికి ఆగ్నేయం వైపు చూస్తే మనం ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సూపర్ మూన్ సమయంలో భూమి నుంచి చంద్రుడు 2,24,895 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటాడు.. సాధారణంగా వేసవి తర్వాత వర్షాకాలం సంభవించేటప్పుడు ఈ అరుదైన దృశ్యాన్ని చూడడం అసంభవం ఎందుకంటే ఆకాశంలో మబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా చూడడం అనేది సాధ్యపడదు అయితే ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా లేనందువల్ల ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటికే దేశ రాజధాని అయిన ఢిల్లీలో సాయంత్రం 5:08 నిమిషాలకు ఆకాశంలో సూపర్ మూన్ కనిపించిందని సమాచారం. ఇక అమెరికాలో కూడా ఈ సూపర్ మూన్ ను బక్ మూన్ అని అంటారట. ఇక ప్రతి జూలై మాసంలో కూడా మగ జింక కొమ్ములు రాలడం.. తిరిగి పెరగడం జరుగుతుంది.. ఇక ఆ సమయంలోనే అక్కడి వాళ్లు బక్ మూన్ గా పేర్కొంటారు. ఇక ఈ ఏడాది మొత్తం 13 పౌర్ణమిలు సంభవించనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. జూలై మూడవ తేదీన సూపర్ మూన్ వస్తుండగా.. ఆగస్టులో బ్లూ మూన్ కనిపిస్తుంది అని అంతకంటే ముందు ఒకటవ తేదీన స్టర్జన్ మూన్, 30వ తేదీన బ్లూ మూన్ ఆకాశంలో కనిపించనున్నాయట. 

ఆ తర్వాత సెప్టెంబర్ 29వ తేదీన హార్వెస్ట్ మూన్, అక్టోబర్ 28న హంటర్ మూన్, నవంబర్ 27న బీవర్ మూన్ డిసెంబర్ 26న కూల్ మూన్ పేరుతో అద్భుతాలు జరుగుతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఖచ్చితమైన వృత్తాకారంలో తిరగదు అందువల్ల దాని కక్షలో అది భూమి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా పెద్దగా కనిపిస్తుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చాడు కాబట్టే సూపర్ మూన్ ఏర్పడుతోంది అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు ఆకాశంలో సూపర్ మూన్ కనిపించబోతోంది ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సూపర్ మన భారతదేశంలో ఏ సమయంలో చూడవచ్చు అనే విషయానికి వస్తే.. మన దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం 5:08 నిమిషాలకు ఈ సూపర్ కనిపిస్తుంది అని వివరించారు. చంద్రుడు సాధారణంగా కనిపించే దానికంటే ఈరోజు ఏడు శాతం పెద్దగా కనిపిస్తాడట ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా కనిపించడాన్ని సూపర్ మూన్ అంటామని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని అబ్రహం ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ షానన్ స్మోల్ తెలిపారు. మొత్తానికైతే ఈరోజు కనిపించబోయే అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి యావత్ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.