య‌వ్వ‌నంగా ఉండేందుకు ఈ మిలియనీర్ ఏం చేస్తున్నాడో తెలుసా??

అందం… అందం.. అందం.. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అందం కోసం వెంపర్లాడుతున్నారు. అందమైన ఆకృతిని సొంతం చేసుకునేందుకు ఎంత ఖర్చయినా సరే చేసేందుకు వెనుకాడడం లేదు. ఎంతటి కఠినమైన నియమాలైనా పాటిస్తున్నారు. అంతే కాకుండా ఎంత కష్టం అయినా దానిని చేస్తున్నారు. ఇక మార్కెట్లో అందం కోసం ఉన్న బ్యూటీ క్రీమ్స్ గురించి అందరికీ తెలిసిందే. వాటికి ధర ఎంత అయినా వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అవి ఫలితాలను ఇస్తాయా? లేదా అని కూడా […]

Share:

అందం… అందం.. అందం.. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అందం కోసం వెంపర్లాడుతున్నారు. అందమైన ఆకృతిని సొంతం చేసుకునేందుకు ఎంత ఖర్చయినా సరే చేసేందుకు వెనుకాడడం లేదు. ఎంతటి కఠినమైన నియమాలైనా పాటిస్తున్నారు. అంతే కాకుండా ఎంత కష్టం అయినా దానిని చేస్తున్నారు. ఇక మార్కెట్లో అందం కోసం ఉన్న బ్యూటీ క్రీమ్స్ గురించి అందరికీ తెలిసిందే. వాటికి ధర ఎంత అయినా వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అవి ఫలితాలను ఇస్తాయా? లేదా అని కూడా ఆలోచించకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు. తాను ఎప్పటికీ యవ్వనంగా ఉండడం కోసం ఓ మిలియనీర్ చేస్తున్న పనులు చూస్తే ఎవరికైనా సరే షాక్ తగలకుండా మానదు. 

ఇతడే ఆ మిలియనీర్..

బ్రయాన్ జాన్సన్ అనే మిలియనీర్ తన శరీరాన్ని వృద్ధాప్యంలోకి బయో-హాక్ చేయడానికి సంవత్సరానికి 2 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాడు. ఈ లెక్కలు ఎవరో చెప్పలేదు. స్వయాన అతడే వెల్లడించాడు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. తాను రోజూ 111 మాత్రలు తీసుకుంటానని చెప్పాడు. అతను తన ప్రోగ్రెస్ ను ట్రాక్ చేసేందుకు వివిధ రకాల ఆరోగ్య పరికరాలను కూడా ఉపయోగిస్తాడట. అతను ఓ రకమైన బేస్ బాల్ టోపీని ధరించాడు. ఆ టోపీ మామూలు టోపీ కాదు. అది తన స్కాల్ప్ (కుదుళ్లలోకి) ఎరుపు కాంతిని షూట్ చేస్తుంది. అంతే కాదు తన సొంత మలం నమూనాలను సేకరించేందుకు అతడు నిద్రించే సమయంలో అతని పురుషాంగానికి ఒక చిన్న జెట్ ప్యాక్ ను ధరించి నిద్రిస్తాడు. అంతే కాదు ఈ జెట్ ప్యాక్ అనేది రాత్రి పూట ఆ మిలియనీర్ అంగస్తంభన (ఎరెక్షన్)ను కూడా ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ వార్తను విని అంతా షాక్ అవుతున్నారు. 

డిన్నర్ చేసేది అప్పుడే… 

మిలియనీర్ జాన్సన్ తన మొత్తం శరీరాన్ని యాంటీ ఏజింగ్ అల్గారిథమ్‌ కి మార్చాలని అనుకుంటున్నాడట. డిన్నర్ ఎవరైనా రాత్రి పూట చేస్తారు. సమయంలో కాస్త తేడా ఉన్నా కానీ డిన్నర్ అనేది రాత్రి చేయడమే అందరికీ అలవాటు. కానీ మన మిలియనీర్ జాన్సన్ మాత్రం డిన్నర్ ని ఉదయం 11 గంటల సమయంలో తింటాడట. జాన్సన్ కు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అతని 46 ఏళ్ల అవయవాలు 18 ఏళ్ల వయస్సులో ఉన్న అవయవాలలా కనిపించేలా చేయడమే జాన్సన్ లక్ష్యం. మిలియనీర్ జాన్సన్ తన చెల్లింపు ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్‌ ట్రీ పేమెంట్ సొల్యూషన్స్‌ ను 800 డాలర్ల మిలియన్ల నగదుకు ఈ కామర్స్ కంపెనీ ఈ-బేకి విక్రయించాడు. ఈ విక్రయాన్ని తనకు ముప్పై సంవత్సరాల వయసు ఉన్నపుడు మిలియనీర్ ఈ డీల్ పొందాడు. దాంతో జాన్సన్ అదృష్టం మలుపు తిరిగి అతడు మిలియనీర్ అయ్యాడు. ఈ టెక్ మిలియనీర్ కంపెనీలో వర్క్ చేసే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన కేట్ టోలో కూడా ఈ బ్లూప్రింట్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డాడు. 

ఆడిలో అత్యంత నెమ్మదిగా… 

ఈ 46 ఏళ్ల మిలియనీర్ లాస్ ఏంజెల్స్ వీధుల్లో పయనిస్తూ.. ఒకానొక సమయంలో గంటకు 16 మైళ్ల వేగంతో వెళ్తున్నాడు. అతడి వద్ద కార్లు లేవా అంటే అతడు 16 మైళ్ల వేగంతో ఎలక్ట్రిక్ ఆడి కారులో వెళ్తుండడం గమనార్హం. ఈ మిలియనీర్ కు జీవితం మీద ఆశ ఎక్కువ. ఒక వేళ యాక్సిడెంట్ అయితే తన జీవితాన్ని తాను కోల్పోవాల్సి ఉంటుందని ఇంత నెమ్మదిగా వెళ్తాడు. మిలియనీర్ చెప్పేటపుడు కూడా డ్రైవింగ్ గురించి ఇదే చెబుతాడు. యాక్సిడెంట్ అయి చనిపోవడం కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా? అని ఈ మిలియనీర్ చెప్పాడు. ఈ మిలియనీర్ ఆస్తి విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఉండడం విశేషం.