అమెరికా వెళ్లాలనే కల.. పీడకలగా మారనుందా? 

అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది చాలా మంది కలగంటూ ఉంటారు. ఎన్నో దేశాల నుంచి మంచి ఉద్యోగాల కోసం, స్థిరపడడం కోసం వెళ్లే వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సంవత్సరం న్యూయార్క్ సిటీలో వలసదారుల సంఖ్య సుమారు 1,18,000లకు పెరిగింది. ఈ విషయమే న్యూయార్క్ సిటీకే కాకుండా అక్కడికి వెళ్లిన వలసదారులకు ముప్పుగా మారింది.  వలసదారుల కష్టాలు:  అమెరికా వెళ్లి హాయిగా దర్జాగా మంచి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని […]

Share:

అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది చాలా మంది కలగంటూ ఉంటారు. ఎన్నో దేశాల నుంచి మంచి ఉద్యోగాల కోసం, స్థిరపడడం కోసం వెళ్లే వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సంవత్సరం న్యూయార్క్ సిటీలో వలసదారుల సంఖ్య సుమారు 1,18,000లకు పెరిగింది. ఈ విషయమే న్యూయార్క్ సిటీకే కాకుండా అక్కడికి వెళ్లిన వలసదారులకు ముప్పుగా మారింది. 

వలసదారుల కష్టాలు: 

అమెరికా వెళ్లి హాయిగా దర్జాగా మంచి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని హాయిగా సంపాదిస్తూ గడపాలనేది చాలామంది చిరకాల కోరిక. ఇలా ఆలోచించి చాలామంది ఎన్నో దేశాల నుంచి ప్రతి ఏటా అమెరికాకు వలస వెళుతూ ఉంటారు. ఇప్పుడు అందరి’అమెరికన్ డ్రీమ్’ అనేది న్యూయార్క్‌లో పెద్ద సంక్షోభాన్ని రేకెత్తించింది. మెరుగైన జీవితం,మరిన్ని అవకాశాల కోసం తపనతో వేలాది మంది వలసదారులు అమెరికా చేరుకుంటూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా ఇళ్ల కష్టాలు ఎదురవుతున్న క్రమం కనిపిస్తోంది. 

న్యూయార్క్ నగరం గత సంవత్సరం నుండి పోలీస్ స్టేషన్ అక్కడ వలసదారుల సంఖ్య 118,000కి చేరుకుంది. వారిలో 60,000 మందికి పైగా సిటీ ఏర్పాటు చేస్తున్న షెల్టర్ సిస్టమ్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వారి అవసరాలు తీర్చలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఇది న్యూయార్క్ నగరాన్ని నాశనం చేయగల ఒక పెద్ద సంక్షోభం అంటూ మేయర్ ఆడమ్స్ పేర్కొన్నారు.

పరిపాలన కష్టమవుతుంది: 

చాలా మంది వలసదారులు భద్రత, పని మరియు స్థిరత్వం కోసం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండి న్యూయార్క్‌కు వచ్చారు. కానీ కొత్తగా వచ్చిన వలసదారులను కొత్త నగరంలో కలపడం అంత తేలికైన పని కాదు. వలసదారులు సాధారణంగా హోటళ్లు, కార్యాలయ భవనాలు, పాఠశాల వ్యాయామశాలలలో రోజులు గడుపుతున్నారు. అయితే నిజానికి.. నగర పాలక సంస్థ, కొంతమంది వలసదారులకు వసతి కల్పించేందుకు బడ్జెట్ హోటళ్లకు తన వైపు నుంచి చెల్లిస్తూ వచ్చింది.. కానీ ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల, ఆ పరిస్థితి కూడా చేయి జారిపోయేలా ఉంది. 

ఖర్చు మోత: 

వలసదారుల కోసం నిజానికి మూడేళ్లలో $12 బిలియన్లు ఖర్చవుతుందని, గతంలో పార్కింగ్ స్థలాలు మరియు క్రూయిజ్ షిప్‌లలో వలసదారుల కోసం వసతి కల్పించేవారని మేయర్ ఆడమ్స్ పేర్కొన్నారు. ఎరిక్ ఆడమ్స్ మరియు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఇద్దరూ.. జో బిడెన్ పరిపాలన వలస సంక్షోభానికి తగినంత మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు వలసదారులకు వసతి కల్పించడం పెద్ద భారంగా మారిందని న్యూయార్క్ మేయర్ వాపోతున్నారు.

అయితే మరోపక్క తీవ్రమైన సంక్షోభం గురించి తెలుసుకున్న న్యూయార్క్ వాసులు, సమస్యకు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్లాలని.. వలసదారులకు తగిన వనరులను వ్యూహాత్మకంగా కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచో అమెరికా కల నెరవేర్చుకోవాలని వచ్చిన వలసదారులకు, అమెరికా కల పీడకలగా మారకూడదని, న్యూయార్క్ వాసులు కోరుకుంటున్నారు.

ఇళ్లతో పాటు వలసదారులు ముఖ్యంగా పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వారు అధికారికంగా పని చేయడం ప్రారంభించే ముందు, వారు తప్పనిసరిగా వర్క్ పర్మిట్ పొందాలి, ఇది ప్రాసెస్ చేయడానికి ఆరు నెలల వరకు పట్టచ్చు. పర్మిట్ లేకుండా, వలసదారులు కేవలం కాంట్రాక్ట్ పనివాళ్లగానే పరిగణలోకి వస్తారు, మరి ముఖ్యంగా వారు తరచుగా అధిక పని భారాన్ని మోస్తూ, తక్కువ జీతం తీసుకున్నవారవుతున్నారు. వలసదారుల కష్టాలు తీరేందుకు న్యూయార్క్ ఎటువంటి ముందడుగు వేయబోతుందో చూడాల్సి ఉంది.