యాక్టివిజన్ అప్పీల్‌కు రెండు నెలల గ్యాప్ కోరిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ సోమవారం లండన్ ట్రిబ్యునల్‌ను వివాదాన్ని పరిష్కరించడానికి పార్టీలకు మరింత సమయం ఇవ్వడానికి, యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 69 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేయడంపై బ్రిటన్ బ్లాక్‌కు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను రెండు నెలల గ్యాప్ కావాలని కోరింది. బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA), క్లౌడ్ గేమింగ్‌లో పోటీపై ప్రభావం గురించి ఏర్పడిన ఆందోళన గురించి, ఏప్రిల్‌లో “కాల్ ఆఫ్ డ్యూటీ” గేమ్ బ్లాక్ చేస్తునట్లు ప్రకటించిన మొదటి అథారిటీ.  అసలు విషయం ఏమిటి:  U.S. […]

Share:

మైక్రోసాఫ్ట్ సోమవారం లండన్ ట్రిబ్యునల్‌ను వివాదాన్ని పరిష్కరించడానికి పార్టీలకు మరింత సమయం ఇవ్వడానికి, యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 69 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేయడంపై బ్రిటన్ బ్లాక్‌కు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను రెండు నెలల గ్యాప్ కావాలని కోరింది. బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA), క్లౌడ్ గేమింగ్‌లో పోటీపై ప్రభావం గురించి ఏర్పడిన ఆందోళన గురించి, ఏప్రిల్‌లో “కాల్ ఆఫ్ డ్యూటీ” గేమ్ బ్లాక్ చేస్తునట్లు ప్రకటించిన మొదటి అథారిటీ. 

అసలు విషయం ఏమిటి: 

U.S. ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC) కూడా టై-అప్‌ను వ్యతిరేకించింది, అయితే ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి FTC దరఖాస్తును ఫెడరల్ కోర్టు తిరస్కరించడంతో గత వారం కొంత గందరగోళం ఏర్పడింది. అది నిజానికి ఒక ఓటమిగా భావించింది. బ్రిటన్‌లో, CMA తుది నివేదిక సాధారణంగా చివరి నిర్ణయంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కంపెనీలు సిఎంఎ ద్వారా ఏదైనా వ్యతిరేకన అందుకుంటే గనుక వారు ఇంకేమీ చేయలేరు. కేవలం కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT)ని ఆశ్రయించాల్సి ఉంటుంది అంతే.

అయితే గత వారం, U.S. ఫెడరల్ కోర్టు జరిపిన విచారణ తర్వాత, CMA సవరించిన ప్రతిపాదనను మళ్లీ చూడవచ్చని తెలిపింది. కొత్త విచారణకు లోబడి మళ్లీ కొత్తగా తయారు చేయబోయే ఒప్పందం, ఇంతకుముందు ఏర్పడిన గందరగోళానికి స్వస్తి చెప్తాయి అని కోర్టు భావిస్తుంది. అయితే ప్రస్తుతం, CAT లో వేసిన కేసుకు రెండు నెలల గ్యాప్ కోసం దరఖాస్తు చేశాయి. CMA న్యాయవాదులు కోర్టు దాఖలులో ప్రతిపాదనలు అనేవి కేసును త్వరగా ముందుకు తీసుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అని చెప్పుకొచ్చారు.

కోర్టు ఏమంటుంది: 

మైక్రోసాఫ్ట్ న్యాయవాదులు, కోర్టు ఫైలింగ్‌లలో CMA ఒప్పందాన్ని క్లియర్ చేయడానికి సమయం పడుతుందని, అంతేకాకుండా ఈ సమయంలో సరైన నిర్ణయం ఒక మంచి పరిష్కారం ఆలోచించొచ్చు అన్నారు. అయితే, న్యాయమూర్తి మార్కస్ స్మిత్ మాట్లాడుతూ, CMA సవరించిన ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి సరైన చట్టపరమైన దారి ఉందా లేదా అనే దానిపై న్యాయవాదులను వినాలనుకున్నట్లు తెలిపారు. U.S.లో FTCకి సంబంధించిన మొదటి ఓటమిని CMA పరిగణనలోకి తీసుకున్నారా! లేదా అని కూడా న్యాయమూర్తి అడిగారు. 

మైక్రోసాఫ్ట్ గురించి మరింత: 

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేది రెడ్‌మండ్, వాషింగ్టన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ ఇంటర్నేషనల్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ అందించిన అత్యంత ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు చెప్పాలంటే విండోస్ లైన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, మైక్రోసాఫ్ట్ 365 ఉత్పాదకత అప్లికేషన్‌ల సూట్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఎడ్జ్ వెబ్ బ్రౌజర్‌లు. దీని ప్రధాన హార్డ్‌వేర్ ఉత్పత్తులు Xbox వీడియో గేమ్ కన్సోల్‌లు, టచ్‌స్క్రీన్ పర్సనల్ కంప్యూటర్‌ల మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ లైనప్ అని చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్ 2022 ఫార్చ్యూన్ 500 ర్యాంకింగ్స్‌లో మొత్తం రాబడి ద్వారా అతిపెద్ద యునైటెడ్ స్టేట్స్ కార్పొరేషన్‌లలో 14వ స్థానంలో నిలిచింది. ఇది 2022 నాటికి మైక్రోసాఫ్ట్ కి అందిన లాభాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ తయారీదారుగా నిలిచింది. ఇది అతిపెద్ద ఐదు అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇందులో Alphabet, Amazon, Apple మరియు Meta ప్లాట్ఫార్మ్స్ కూడా భాగమే.