మొసలిని పెళ్లి చేసుకున్న మెక్సికన్ మేయర్..

ఊర్లో ఉన్న సంప్రదాయం : కొన్ని దేశాల సంప్రదాయాలు చాలా విచిత్రం గా ఉంటాయి. వారి ఆచారాల ప్రకారం పశువులతో వివాహాలు చేయిస్తూ ఉంటారు,కానీ కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి క్రూర మృగాలతో కూడా పెళ్లి చేయిస్తున్నారు. అలాంటి సంఘటన రీసెంట్ గా మెక్సికో కి ఒకటి జరిగింది. అక్కడ వారి ప్రాంతం లో వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ఆ ప్రాంతానికి సంబంధించిన మేయర్ కి ఒక ఆడ మొసలి ని […]

Share:

ఊర్లో ఉన్న సంప్రదాయం :

కొన్ని దేశాల సంప్రదాయాలు చాలా విచిత్రం గా ఉంటాయి. వారి ఆచారాల ప్రకారం పశువులతో వివాహాలు చేయిస్తూ ఉంటారు,కానీ కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి క్రూర మృగాలతో కూడా పెళ్లి చేయిస్తున్నారు. అలాంటి సంఘటన రీసెంట్ గా మెక్సికో కి ఒకటి జరిగింది. అక్కడ వారి ప్రాంతం లో వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ఆ ప్రాంతానికి సంబంధించిన మేయర్ కి ఒక ఆడ మొసలి ని ఇచ్చి పెళ్లి చెయ్యడం సంప్రదాయం గా వస్తున్న ఆచారం అట. ఈ విచిత్రమైన సంప్రదాయం దక్షిణ మెక్సికో లోని సాన్ ప్రాడో హువామేలులు అనే పట్టణం లో ఉందట. ఒక క్రూర మృగానికి ఇచ్చి వివాహం చెయ్యడం అనేది ఏమి సంప్రదాయమో మనకి తెలీదు కానీ, ఇది అజ్ఞానానికి పరాకాష్ట అని మాత్రం చెప్పొచ్చు. ఎప్పుడైనా మొసలి కి ఆకలి వేసిందంటే ఆ మేయర్ ఒకే ఒక గుటకతో  మింగేయగలడు. అంతే కాదు ఆ ముసలి వల్ల పరిసర ప్రాంతం లోని స్థానికులకు కూడా ప్రాణహాని పొంచి ఉంటుంది.

230 ఏళ్ళ నుండి ఇది జరుగుతుంది:

ఇంతకీ ఆ మొసలి ని పెళ్లి చేసుకున్న మేయర్ పేరు విక్టర్ హ్యూగో సోసా, అక్కడ అకాల వర్షాలు మరియు పంటలు నష్టపోకుండా ఉండేదుకు మాత్రమే కాకుండా , హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని కలిగించేందుకు కూడా ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తారు అట. ఇంతకీ ఆ మొసలి పేరు ఏమిటంటే అలీసియా అడ్రియానా అట. ఈ ఆచారం సుమారుగా 230 సంవత్సరాల నుండి వాళ్ల పూర్వీకుల ద్వారా పాటిస్తూ వస్తున్నారట. ఈ వివాహం ద్వారా తమ ప్రాంత ప్రజలకు అదృష్టం కలిసి వస్తుందని భావిస్తున్నారు. అంతే కాదు ప్రజలు అక్కడ పెళ్లి కొడుకుని చొంటల్ రాజు గా, మొసలి ని రాణిగా బావిస్తారట. ఈ కాలం లో కూడా విదేశాలలో ఇలాంటి ఆచారాలను నమ్ముతారు అంటే చాలా విచిత్రం గా ఉంది కదా!, అయితే ఈ 230 ఏళ్లలో ఇలా ఎన్నో ముసళ్ళతో పెళ్లి చేయించారు కానీ ఒక్క మొసలి కూడా ఇంట్లో ఉన్నప్పుడు దాడి చెయ్యడం కానీ, చంపడం కానీ జరగలేదట.

ఇది ఇలా ఉండగా మొసలి తో పెళ్లి జరిగిన తర్వాత అక్కడి ప్రజలు నృత్యం చేస్తూ , ఆ మొసలి ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్తారట. ఆ  తర్వాత మొసలి ని పెళ్లి బట్టలతో అందం గా అలంకరిస్తారట. అయితే ఈ క్రమం లో ముసలి బయపడి మనుషుల మీద దాడి చేసే ప్రమాదం కూడా ఉంది, అందుకోసం దాని ముక్కు కి తాడు కట్టేస్తారట.ఇక మత్యకారులు నృత్యం చేసేటప్పుడు వలలు వేసుకొని చేస్తారట. ఈ వేడుకని మొత్తం ఒక మహా ఉత్సవం లాగ జరిపిస్తారట. ఇక చివర్లో వరుడు ఆ మొసలి ని పైకి ఎత్తుకొని నృత్యం చేసి ముద్దాడుతాడు అట. సరిగ్గా సోసో కూడా ఈ ఆచారాలను తూచా తప్పకుండ ఫాలో అయ్యి ఆ మొసలి ని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, నేను నా భార్య పట్ల ఎంతో ప్రేమగా, నమ్మకంతో బాధ్యతగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వార్త బయటకి వచ్చిన తర్వాత దానిని చూసి అందరూ నోరెళ్ళబెట్టారు, అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలను ఈ స్థాయిలో నమ్ముతారా అని నవ్వుకుంటున్నారు.