రూ.3 కోట్ల జీతాన్ని వద్దనుకున్న మెటా ఉద్యోగి..!

ఉద్యోగం పురుష లక్షణం. ఈ మాటలో కాస్త పురుషాధిక్యత స్పష్టంగా కనిపించినా.. ప్రతి వ్యక్తీ సంపాదనపరుడు కావాల్సిందే అనే సామాజిక సూత్రాన్నీ సూచిస్తున్నది. అవకాశాలకు, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్న నేటి రోజుల్లో ఇది అసాధ్యం కూడా కాదు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌, ఫోర్‌ వీలర్‌, అయిదంకెల జీతం.. అన్నీ యువతకు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఈ దూరపు కొండలను దగ్గరగా పరిశీలిస్తే.. గాయాల గతుకులు కనిపిస్తాయి. అయితే జీతంలో జీవితం ఉండదనుకున్నాడో ఏమో ఓ ఐటీ ఉద్యోగి […]

Share:

ఉద్యోగం పురుష లక్షణం. ఈ మాటలో కాస్త పురుషాధిక్యత స్పష్టంగా కనిపించినా.. ప్రతి వ్యక్తీ సంపాదనపరుడు కావాల్సిందే అనే సామాజిక సూత్రాన్నీ సూచిస్తున్నది. అవకాశాలకు, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్న నేటి రోజుల్లో ఇది అసాధ్యం కూడా కాదు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌, ఫోర్‌ వీలర్‌, అయిదంకెల జీతం.. అన్నీ యువతకు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఈ దూరపు కొండలను దగ్గరగా పరిశీలిస్తే.. గాయాల గతుకులు కనిపిస్తాయి. అయితే జీతంలో జీవితం ఉండదనుకున్నాడో ఏమో ఓ ఐటీ ఉద్యోగి తాను చేస్తున్న జాబ్‌కు రాజీనామా చేశాడు. రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నందుకు హాయిగా ఉందని అంటున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి 

ఎరిక్ యు (28) మెటా ఉద్యోగి. జీతం రూ.3 కోట్లు. అంతా బాగానే ఉంది. కానీ జాబ్‌ చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెవులు పగిలిపోయా శబ్ధాలు వచ్చేవి. అయినప్పటికీ, కోడింగ్‌తో కుస్తీ పట్టాడు. చివరికి తీవ్ర భయాందోళనల మధ్య మెటాకు రిజైన్‌ చేసి బయటకొచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

కష్టపడ్డా.. జాబ్‌ సంపాదించా

ఊహ తెలిసిన వయస్సు నుంచే ఫేస్‌బుక్‌లో పనిచేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గేట్లే కష్టపడ్డా. నా స్కిల్‌కు గూగుల్‌లో ఉద్యోగం వచ్చినా మెటాలో పనిచేసేందుకు మొగ్గు చూపా. ఎందుకంటే? మెటా క్యాంపస్‌ చాలా బాగుంటుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం తప్పని తర్వాతే తెలిసింది. భయంకరమైన ఒత్తిడికి గురైన తాను మెటాలో తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. 

అదృష్టాన్ని పరీక్షించి

ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించా.  అదృష్టవశాత్తూ, మెటాలో పనిచేస్తున్న నా స్నేహితురాలు వాండా (ఇప్పుడు ఎరిక్‌ కాబోయే భార్య) నాలో ఆందోళల్ని గుర్తించింది. అందుకే ఆ ఒత్తిడి నుంచి బయట పడేలా ప్రయత్నించారు. ఇతర ఆదాయా మార్గాల్ని అన్వేషించా. చివరికి రియల్‌ ఎస్టేట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా. మెటా నుంచి బయటకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 

రూ.3 కోట్ల జీతం అంటే మాటలా

370,000 డాలర్లు (రూ.3 కోట్లు) ఉద్యోగాన్ని వదిలివేయడం పిచ్చి పనే అని నాకు తెలుసు. మెటాలో కొనసాగితే ఆర్ధిక భద్రత ఉండేది. అయితే అది నాకు సరైనది కాదని భావిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం, రియల్ ఎస్టేట్‌ రంగంలో పనిచేస్తున్న యుకు’ ఇలాగే కొనసాగుతానని మాత్రం చెప్పడం లేదు. భవిష్యత్‌ బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు లింక్డిన్‌ పోస్ట్‌లో ముగించాడు. 

పని ఒత్తిడి తట్టుకోలేక 14 శాతం

మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన సంస్థల్లోనే ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉన్నాయని 2022-23లో మొదటి ఆర్థిక సంవత్సరంలో 23 శాతం వరకు ఉన్నట్లు తేలింది. దీనితో పోల్చుకుంటే బ్యాంకింగ్‌ – ఫైనాన్షియల్‌ రంగంలో 18 శాతం, తర్వాత హెల్త్‌కేర్‌ రంగం 12 శాతం, ఎఫ్‌ఎంసీజీ రంగం 11 శాతం, ఆటోమొబైల్‌ రంగం 11 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆకర్షణీయమైన పే ప్యాకేజీలు (21) శాతం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు (16) శాతం, పై అధికారులతో అసంతృప్తి (15) శాతం, పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు (14) శాతంగా ఉన్నారని, ఉద్యోగుల్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో వలసలు 39 శాతం కాగా. 5-10 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో 27 శాతం మంది.. 10-15 శాతం అనుభవం ఉన్నవారిలో 22 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేటతెల్లమయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 15 ఏళ్లు ఆపైన అనుభవం ఉన్నవారు మాత్రం వలసలకు చాలా తక్కువగా 15 శాతం ఉంటున్నాయి.