Mushrooms: పుట్ట‌గొడుగుల మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడింది

ఇటీవల చాలా రకాల మర్డర్ (Murder) మిస్టరీలు మనం చూసే ఉంటాం. సొంత అత్తమామలను భర్తను చంపేందుకు, వారు తినే ఆహారంలో కోడలు స్లో పాయిజన్ ఇచ్చి, చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక మర్డర్ (Murder) మిస్టరీ వీడాల్సి ఉంది. పుట్టగొడుగులు (Mushrooms) వంటకం తిన్న ముగ్గురు చనిపోవడం జరిగింది. అయితే పుట్టగొడుగులు (Mushrooms) వంటకం తయారు చేసిన మహిళను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు.  పుట్టగొడుగులు మీల్ మర్డర్ […]

Share:

ఇటీవల చాలా రకాల మర్డర్ (Murder) మిస్టరీలు మనం చూసే ఉంటాం. సొంత అత్తమామలను భర్తను చంపేందుకు, వారు తినే ఆహారంలో కోడలు స్లో పాయిజన్ ఇచ్చి, చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక మర్డర్ (Murder) మిస్టరీ వీడాల్సి ఉంది. పుట్టగొడుగులు (Mushrooms) వంటకం తిన్న ముగ్గురు చనిపోవడం జరిగింది. అయితే పుట్టగొడుగులు (Mushrooms) వంటకం తయారు చేసిన మహిళను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. 

పుట్టగొడుగులు మీల్ మర్డర్ మిస్టరీ: 

విక్టోరియా రాష్ట్రంలో ముగ్గురిని చంపినట్లు అనుమానిస్తున్న పుట్టగొడుగులు (Mushrooms) వంటకం వండిన ఆస్ట్రేలియా మహిళను హత్యానేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ (Australian) పోలీసులు (Police) గురువారం నాడు 49 ఏళ్ల ఎరిన్ ప్యాటర్‌సన్‌ను అరెస్టు (Arrest) చేసిన తర్వాత, మెల్‌బోర్న్‌ (Melbourne)కు ఆగ్నేయంగా ఉన్న చిన్న గ్రామీణ పట్టణం లియోంగాథా గురించి, మర్డర్ (Murder) మిస్టరీ గురించి అందరూ తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం నిందితురాలు (Accused) ప్యాటర్‌సన్‌ను అరెస్టు (Arrest) చేసి, USB కీల వంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నచోటులను పసిగట్టగల “టెక్నాలజీ డిటెక్టర్ డాగ్స్” సహాయంతో ఆమె ఇంటిని వెతకడం ప్రారంభించారని పోలీసులు (Police) తెలిపారు. అయితే మరోపక్క తాను ఎలాంటి తప్పు చేయలేదని కొట్టిపారేసిన ప్యాటర్సన్, జూలైలో బీఫ్ వెల్లింగ్టన్ డిష్‌లో భాగంగా పుట్టగొడుగులను తన మాజీ అత్తమామలు డాన్ మరియు గెయిల్ ప్యాటర్సన్, స్థానిక బాప్టిస్ట్ పాస్టర్ ఇయాన్ విల్కిన్సన్, అతని భార్య హీథర్‌లకు వడ్డించడం జరిగింది. అదే రోజు రాత్రి, పుట్టగొడుగులు (Mushrooms) వంటకాన్ని తిన్న నలుగురి ఆరోగ్యం క్షీణించడంతో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల్లోనే ముగ్గురు చనిపోయారు.

అయితే చనిపోయిన వారి అనారోగ్య లక్షణాలు చూస్తే..పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయని పోలీసులు (Police) భావిస్తున్నారు. అయితే నిందితురాలి (Accused) ఇంటిని సెర్చ్ చేయడం పూర్తయిన తర్వాత హోమిసైడ్ స్క్వాడ్ పరిశోధకులు ఆమెను ప్రశ్నిస్తారని విక్టోరియా పోలీసు స్క్వాడ్‌లోని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ తెలిపారు. ఇలాంటి విషాదం రాబోయే సంవత్సరాల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని . ఆ ఊరిలో ఉండే కొందరు భావిస్తున్నారు.

ఈ పుట్టగొడుగులు చాలా ప్రమాదం: 

దేశంలో పుట్టగొడుగులను తినడం వల్ల మరణాలు సంభవించడం అనేది చాలా అరుదు, ఇందులో “డెత్ క్యాప్” పుట్టగొడుగులు (Mushrooms)‌తో సహా అనేక జాతులు ఉన్నాయి, ఇవి మానవునికి చంపేంత ప్రమాదకరమైనవి. ఈ పుట్టగొడుగులు (Mushrooms) ఆస్ట్రేలియాలోని తడి, వెచ్చని ప్రాంతాలలో మొలకెత్తుతాయి. అవి నిజానికి ప్రతి ఒక్కరు తినే పుట్టగొడుగులు (Mushrooms) లాగే కనిపిస్తాయి. ఇతర రకాల పుట్టగొడుగుల కంటే తియ్యగా ఉంటాయి, ఈ పుట్టగొడుగులు (Mushrooms)ను తిన్న వెంటనే.. కాలేయం మరియు మూత్రపిండాలను విషపూరితంగా మార్చి.. మనిషి మెల్లమెల్లగా క్షీణించి చనిపోయేలా చేస్తుంది. 

పుట్టగొడుగులు (Mushrooms) ముగ్గురు చనిపోయిన వెంటనే పోలీసులు (Police), కమ్యూనిటీ న్యూస్‌లెటర్ ఎడిటర్ ప్యాటర్‌సన్‌ను అనుమానితురాలిగా పేర్కొన్నారు. ప్యాటర్సన్ తన మీద పడిన నిందను ఒప్పుకోవడం జరగలేదు. అంతేకాకుండా.. ఆగస్ట్‌లో ఆమె తెలియకుండానే ఆసియా కిరాణా దుకాణం నుండి పుట్టగొడుగులను (Mushrooms) కొన్నానని, విషప్రయోగం ప్రమాదవశాత్తూ జరిగిందని ఆమె వాదిస్తోంది.