2100 నాటికి అన్ని వ్యాధుల నిర్మూలనే లక్ష్యం- జుకర్‌బర్గ్‌ ఫౌండేషన్‌

2100 నాటికి ప్రపంచంలో అన్ని వ్యాధులను నిర్మూలించడానికి కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ భార్య ప్రిస్కిల్లా చాన్‌ పేర్కొన్నారు. మ‌నుషుల్లో న‌మోదు అయ్యే అన్ని ర‌కాల వ్యాధుల‌ను నిర్మూలించే ఉద్దేశంతో చాన్ జుక‌ర్‌బ‌ర్గ్ సంస్థ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2100 సంవ‌త్స‌రం నాటికి అన్ని వ్యాధుల‌కు చెందిన డేటా బేస్‌ను త‌యారు చేయాల‌ని ఆ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. చాన్ ఫౌండేష‌న్‌కు చెందిన‌ చాన్ జుక‌ర్‌బ‌ర్గ్ ఇన్సియేటివ్‌(సీజెడ్ఐ) దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. […]

Share:

2100 నాటికి ప్రపంచంలో అన్ని వ్యాధులను నిర్మూలించడానికి కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ భార్య ప్రిస్కిల్లా చాన్‌ పేర్కొన్నారు.

మ‌నుషుల్లో న‌మోదు అయ్యే అన్ని ర‌కాల వ్యాధుల‌ను నిర్మూలించే ఉద్దేశంతో చాన్ జుక‌ర్‌బ‌ర్గ్ సంస్థ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 2100 సంవ‌త్స‌రం నాటికి అన్ని వ్యాధుల‌కు చెందిన డేటా బేస్‌ను త‌యారు చేయాల‌ని ఆ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. చాన్ ఫౌండేష‌న్‌కు చెందిన‌ చాన్ జుక‌ర్‌బ‌ర్గ్ ఇన్సియేటివ్‌(సీజెడ్ఐ) దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. 2100 నాటికి కంప్యూటింగ్ సిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప‌రిశోధ‌కులు ఆ డేటాను స్ట‌డీ చేసి వ్యాధుల నిర్మూల‌న‌కు ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సీజెడ్ఐ తెలిపింది.

మెటా సంస్థ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, ఆయ‌న భార్య ప్రిస్కిల్లా చాన్‌ దీనిపై తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. క‌ణాల‌ను క్యాట‌లాగ్ చేసి, వాటి వ‌ల్ల క‌లిగే వ్యాధుల‌పై స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ డేటాను వ్యాధుల చికిత్స‌కు సంబంధించిన కీల‌క‌మైన ఆవిష్క‌ర‌ణ‌లకు వాడుకోనున్న‌ట్లు తెలిపారు. ఈ శ‌తాబ్ధం చివ‌ర‌లోగా అద్భుత‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ‌యోమెడిసిన్‌లో ఎన్నో అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్లు చెప్పారు.

జన్యువుల ఆధారంగా కణాల స్థితి, క‌ణాలను అధ్య‌య‌నం చేసే సామ‌ర్థ్యం ఉన్న డిజిట‌ల్ మోడ‌ల్స్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని, దీని ద్వారా ప‌రిశోధ‌కులు మ‌న క‌ణాల ప్ర‌వ‌ర్త‌న‌ను అంచ‌నా వేయ‌గ‌ల‌ర‌ని, వ్యాధుల స‌మ‌యంలో క‌లిగే పరివ‌ర్త‌న‌ల‌ను గుర్తించ‌గ‌ల‌ర‌ని జుక‌ర్‌బ‌ర్గ్ త‌న ప్ర‌ట‌క‌న‌లో తెలిపారు. ఆరోగ్య‌క‌ర‌మైన‌, వ్యాధి సోకిన క‌ణాల‌ను ఏఐ ద్వారా స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

వైద్య రంగంలోకి ఏఐ:

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రంగంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఏఐ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు గ్యాడ్జెట్స్, యాప్‌ల లాంటి వాటికే పరిమితమైనటువంటి ఏఐ సేవలు.. ఇప్పుడు మెల్లగా వైద్యరంగానికి సైతం క్రమంగా విస్తరిస్తున్నాయి. కృత్రిమ మేథస్సుగా పిలిచే ఈ టెక్నాలజీ మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఆధారితమైన వినూత్న పేషెంట్ ట్రయాజ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది వైరల్ వ్యాప్తి సమయంలో రోగి వ్యాధి తీవ్రత, ఆసుపత్రిలో చేరే వ్యవధిని అంచనా వేస్తుంది. 

చికిత్స అనేది అనారోగ్యం, తీవ్రత, రోగ నిరూపణ, వనరుల లభ్యత ఆధారంగా రోగి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తుంది. హ్యూమన్ జెనోమిక్స్ జర్నల్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ఈ తాజా ప్లాట్‌ఫారమ్‌ జీవక్రియల నుంచి డేటాను ప్రభావితం చేస్తుంది. కణ జీవక్రియకు సంబంధించిన చిన్న అణువుల అధ్యయనం ద్వారా ఈ ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణ రోగి నిర్వహణను మెరుగుపరచడానికి, అలాగే స్థానిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అలెర్ట్‌ చేస్తుంది. అలాగే త్వరగా వ్యాప్తి చెందే తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షనన్స్‌ సమయంలో వనరులను మరింత సమర్థవంతంగా కేటాయించడంలో డాక్టర్లకు చాలా బాగా సహాయం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. 

ఈ వ్యవస్థ ముఖ్యంగా రోగి పరిస్థితిని అంచనా వేసి ఏ రోగులను ఇంటికి పంపవచ్చో? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అడ్మిషన్ అవసరమయ్యే రోగులను అంచనా వేయడంతో పాటు రోగి ఆరోగ్య ఫలితాలను ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆసుపత్రి వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించాలని కోరుకునే డాక్టర్లకు ఈ ప్లాట్‌ఫారమ్‌ మంచి సదుపాయంగా మారనుంది.