తన బుద్ధిని మరొకసారి చూపించుకున్న చైనా

చైనా భారత దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఆక్రమించాలని ఎప్పటినుంచో పన్నాగాలు పన్నుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలోనే చైనా తన కొత్త మ్యాప్ విడుదల చేసింది. అయితే ఇందులో అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనాలో ఒక భాగంగా కలిసి కనిపించడం గమనార్హం. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే G20 సమావేశానికి చైనా ఏ ఉద్దేశంతో భారతదేశానికి వస్తుందో తెలియాల్సి ఉంది.  రెచ్చగొట్టే ప్రయత్నంలో చైనా:  ఇటీవల చైనా తన కొత్త మ్యాప్ రిలీజ్ […]

Share:

చైనా భారత దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఆక్రమించాలని ఎప్పటినుంచో పన్నాగాలు పన్నుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలోనే చైనా తన కొత్త మ్యాప్ విడుదల చేసింది. అయితే ఇందులో అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనాలో ఒక భాగంగా కలిసి కనిపించడం గమనార్హం. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే G20 సమావేశానికి చైనా ఏ ఉద్దేశంతో భారతదేశానికి వస్తుందో తెలియాల్సి ఉంది. 

రెచ్చగొట్టే ప్రయత్నంలో చైనా: 

ఇటీవల చైనా తన కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. అయితే చైనాలో అరుణాచల్ ప్రదేశ్ కూడా భాగంగా ఈ మ్యాప్ లో కనిపించడం జరిగింది. ఇది కచ్చితంగా చైనా చేస్తున్న పన్నాగమని కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నదని, బోర్డర్ విషయాలు తేలలేని క్రమంలో ఇటువంటి పన్నాగాలు చేసి ఏదో ఒకటి తేల్చుకుందామని ఉద్దేశంతో చైనా ఉన్నట్లు భారతదేశం ఊహాగానాలు చేస్తోంది. 

భారతదేశ రాజధానిలో జరిగే G20 సమావేశానికి హాజరయ్యేందుకు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మొగ్గు చూపుతున్నారా లేదా ఇతర ప్రణాళికలు ఉన్నాయా అనే దానిపై తీవ్రమైన ప్రశ్నలకు దారితీసింది చైనా మ్యాప్. చైనా ప్రతి సంవత్సరం ప్రామాణిక మ్యాప్‌ను విడుదల చేస్తూ ఉంటుంది, అయితే చైనా తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను వాదనలను తిరస్కరిస్తూ భారతదేశం, బీజింగ్‌తో తీవ్రమైన నిరసనను నమోదు చేయడం ఇదే మొదటిసారి.

ఈ క్రమంలోనే పెద్ద ప్రశ్న ఏమిటంటే, బీజింగ్ స్టాండర్డ్ మ్యాప్ అని పిలవబడే దాన్ని ఎందుకు విడుదల చేసింది? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాన్ని ఎందుకు స్ప్రెడ్ చేయాలని చూస్తుంది? అయితే దీనికి సమాధానం, జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లీడర్స్ లాంజ్‌లో అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో కొద్దిసేపు సంభాషించారు. ఈ క్రమంలోని తూర్పు లడఖ్‌లోని దేప్సాంగ్ బల్గే, అంతేకాకుండా డెమ్‌చోక్‌ల పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కొంచెం కూడా తమ వైపు నుంచి ఒప్పుకోకుండా, సదస్సు సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక సమావేశం కావాలని చైనా కోరుకున్నట్లు అర్థమవుతోంది. 

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ వాసులకు స్టాపిల్డ్ వీసాలు ఇచ్చిన చైనా: 

చెంగ్డూలో ఇటీవల జరిగిన సమ్మర్ వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ నుంచి తమ వుషు (మార్షల్ ఆర్ట్స్) బృందాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఆటగాళ్లకు చైనా స్టేపుల్ వీసాలు జారీ చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ మార్షల్ ఆర్ట్స్ జట్టులో భాగమైన నైమాన్ వాంగ్సు, ఒనిలు తేగా మరియు మెపుంగ్ లాంగు అనే ముగ్గురు మహిళా క్రీడాకారులు ఈ స్టేపుల్ వీసాలను, చైనా ద్వారా అందుకోవడం కూడా జరిగింది.

ప్రస్తుతం చైనా కొంతమంది క్రీడాకారులకు స్టాపర్ వీసాలు మంజూరు చేయడంపై తన అసమ్మతిని వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు ఎలా చేస్తారు అని పేర్కొంది. అంతేకాకుండా తమ వైపు నుంచి “నిరసన తెలియజేయడానికి” భారతదేశంలోని చైనా రాయబారిని పిలిపించింది. ఈ స్టేపుల్డ్ వీసాల సమస్య చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల భాగస్వామ్యంపై ప్రభావం చూపదని భారత ప్రభుత్వం అప్పట్లో స్పష్టం చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ నుండి భారతీయ పౌరులకు ఇటువంటి ‘స్టెపుల్డ్ వీసాలు’ జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, 2011 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లు, 2011 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌తో సహా అంతర్జాతీయ ఈవెంట్‌లకు ఈ ప్రాంతానికి చెందిన అథ్లెట్లకు ఈ విధంగానే జరిగినట్టు తెలిసింది. 

స్టేపుల్డ్ వీసా ఉన్న వ్యక్తి వారి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు చైనాలో పర్యటించిన ప్రదేశాలకు సంబంధించి, మరి ఏ ఇతర విషయాలుకు సంబంధించిన వివరాలేవీ నమోదు కావు. అయితే ఎప్పటినుంచో భారతదేశంలో కొన్ని ప్రాంతాల మీద కన్నేసిన చైనా, ఇలాంటి వీసాల ద్వారా కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా, అరుణాచల్ ప్రదేశ్ మరియు J&Kలను చైనాలో విలీనం చేసుకోవడానికి ఇదొక కొత్త పథకం చేస్తుందని, భారత్ వాపోయింది.