నాతో డేటింగ్ చాలా క‌ష్టం అంటున్న 45 ఏళ్ల వ్య‌క్తి

అందం ఈ పదానికి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థాలు చెబుతుంటారు.  అందంగా ఉండడం కోసం చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. కొంత మంది వీటిలో సక్సెస్ అయినా కొంత మంది మాత్రం ప్రయత్నాల్లో విఫలం అవుతుంటారు. ఇటువంటి వారు మార్కెట్లోకి వచ్చిన ప్రతి కాస్మోటిక్ క్రీంను వాడుతుంటారు. అయినా కానీ కొందరికి అనుకున్న ఫలితాలు రావు. తాజాగా  ఓ వ్యక్తి  అందం కోసం ఎటువంటి సాహసం చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్ల బెట్టక మానరు. మరీ  అతడు అందం […]

Share:

అందం ఈ పదానికి ఒక్కొక్కరు ఒక్కోలా అర్థాలు చెబుతుంటారు.  అందంగా ఉండడం కోసం చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. కొంత మంది వీటిలో సక్సెస్ అయినా కొంత మంది మాత్రం ప్రయత్నాల్లో విఫలం అవుతుంటారు. ఇటువంటి వారు మార్కెట్లోకి వచ్చిన ప్రతి కాస్మోటిక్ క్రీంను వాడుతుంటారు. అయినా కానీ కొందరికి అనుకున్న ఫలితాలు రావు. తాజాగా  ఓ వ్యక్తి  అందం కోసం ఎటువంటి సాహసం చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్ల బెట్టక మానరు. మరీ  అతడు అందం కోసం అలా చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా ఏడాదికి 2 మిలియన్లను ఖర్చు పెడుతూ వామ్మో అని అనిపించేలా చేస్తున్నాడు. 

45 సంవత్సరాల వయసు కానీ… 

బ్రయాన్ జాన్సన్ అనే 45 సంవత్సరాల సాఫ్ట్ వేర్ బిలియనీర్ తన అందం గురించి చెప్పిన రహస్యం  వైరల్ అవుతోంది. రూపాయి కాదు రెండు కాదు ఇతడు అందంగా కనిపించడం కోసం ఏడాదికి రెండు బిలియన్ల మనీని ఖర్చు చేస్తాడట. అంతే కాకుండా అతడు అందాన్ని మెయింటేన్ చేయడం కోసం అమ్మాయిలతో డేటింగ్ కు కూడా దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. అతడు ఈ విషయం వెల్లడించిన తర్వాత మరింత వైరల్ అయ్యాడు. 

పోడ్ కాస్ట్ లో కనిపించి

గత వారం బ్రయాన్ జాన్సన్ ఓ పోడ్ కాస్ట్ లో కనిపించాడు. అతను ఇప్పటికి కూడా ఒంటరిగా ఉన్నట్లు ప్రకటించాడు. అందం కోసం ఒంటరిగా ఉండడం చాలా ప్రయోజనంగా ఉంటుందని ఆయన తెలిపాడు. అతడు తన రోజువారీ జీవితాన్ని కూడా పంచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైల్ ను ఫాలో అయేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి సిటీ  లైఫ్ లో పెందలాడే నిద్రపోవడం చాలా కష్టం. ఏ పని లేకున్నా కానీ ఏదో ఒకటి చేస్తూ మనం నిద్రపోవడాన్ని వాయిదా వేస్తుంటాం. కానీ జాన్సన్ మాత్రం అలా కాదు. అతడు తనకు ఎన్ని పనులున్నా కానీ రాత్రి 8.30కి తప్పనిసరిగా నిద్రపోతాడట. అంతే కాకుండా ఉదయం పూట 6 గంటల నుంచి 11 గంటల వరకు రోజుకు 2250 కేలరీల ఆహారం తీసుకుంటానని వెల్లడించాడు. దీంతో అతడు చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. మిస్టర్ జాన్సన్ మరో విషయాన్ని వెల్లడించాడు. తాను పూర్తి నాన్ ఆల్కాహాలిక్ అని అతడు పేర్కొన్నాడు. అంతే కాకుండా అందం మెయింటేన్ చేసేందుకు ట్యాబ్లెట్స్ తీసుకుంటానని వెల్లడించాడు. 

సెక్స్ కూడా చేయడట.. 

మిస్టర్ జాన్సన్ మరో పెద్ద విషయం తెలిపాడు. తాను అందంగా ఉండడం కోసం ఎవరితో కూడా సెక్స్ లో పాల్గొనని స్పష్టం చేశాడు. అందం కోసం ఇవన్నీ తప్పవని ప్రకటించాడు. నాతో ఎవరైనా డేటింగ్ చేయాలని అనుకుంటే వారికి నా గురించి పది విషయాల జాబితాను అందిస్తానని అతడు తెలిపాడు. ఇంతకు ముందు జాన్సన్ రోజుకు ఒక గ్లాసు వైన్ తీసుకునే వాడట. కానీ అదనపు కేలరీలను నివారించేందుకు అతడు మద్యం సేవించడం కూడా మానేశాడు. దీంతో అతడు చాలా గ్రేట్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. మిస్టర్ జాన్సన్ ఒక బిలియనీర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి అతడు అందం కోసం ఇంతలా ఖర్చు పెట్టగలుగుతున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ అతనికి అందం మీద ఉన్న ఆసక్తే అతనితో ఇంతలా ఖర్చు చేపిస్తోంది.    కావున అందం కోసం మనుషులు ఏమైనా చేస్తారనేందుకు ఇది చక్కని ఉదాహరణ.