హ‌ర్దీప్ సింగ్ కార‌ణంగా భారతదేశాన్ని తప్పుపడుతున్న కెనడా

వ్యాపార రీత్యా, ఆర్థిక లావాదేవీల మధ్య, ఎగుబడి దిగుబడి, ఇటువంటి విషయాలలో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న దేశాల మధ్య కొన్ని కొన్ని సందర్భాలలో శత్రుత్వాన్ని రేపే కొన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న టెర్రరిస్టు ముఠాల గురించి విభేదాలు రేకెత్తుతూనే ఉన్నాయి.. ఉగ్రవాదుల దాడులు, దేశాల మీద ప్రతీకరాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి.. ఇలాంటి సంఘటన ఇప్పుడు ఎదురయింది.  శత్రుత్వాన్ని రేకెత్తిస్తున్న అంశం:  గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత […]

Share:

వ్యాపార రీత్యా, ఆర్థిక లావాదేవీల మధ్య, ఎగుబడి దిగుబడి, ఇటువంటి విషయాలలో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న దేశాల మధ్య కొన్ని కొన్ని సందర్భాలలో శత్రుత్వాన్ని రేపే కొన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న టెర్రరిస్టు ముఠాల గురించి విభేదాలు రేకెత్తుతూనే ఉన్నాయి.. ఉగ్రవాదుల దాడులు, దేశాల మీద ప్రతీకరాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి.. ఇలాంటి సంఘటన ఇప్పుడు ఎదురయింది. 

శత్రుత్వాన్ని రేకెత్తిస్తున్న అంశం: 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. 

అసలు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ ఎవరు?: 

హర్దీప్ సింగ్ నిజ్జార్‌ జలంధర్‌లోని భర్ సింగ్ పురా అనే గ్రామానికి చెందినవాడు. 1997లో పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ప్లంబర్‌గా పనిచేశాడు. అతనికి వివాహమై ఇద్దరు కొడుకులు ఉన్నారు. కెనడాకు వలస వచ్చినప్పటి నుండి, అతను ఖలిస్తాన్ మిలిటెన్సీతో చాలా కాలం పాటు సంబంధాలు పెట్టుకున్నాడు. అంతేకాకుండా అతను నిజానికి, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF)కు ఒక “మాస్టర్ మైండ్” లాంటివాడు. అతను సిక్ ఫర్ జస్టిస్ (SFJ)అనే సంస్థలో కూడా సభ్యుడు. భారత్ అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

పంజాబ్‌లోని లూథియానాలో 2007లో ఆరుగురు మరణాలకు గాను, 40 మంది గాయపడిన పేలుడుతో సహా అనేక కేసుల్లో నిజ్జర్ కూడా ఒక నిందితుడు. అతను రాష్ట్రీయ సిక్కు సంగత్ అధ్యక్షుడు రుల్దా సింగ్ (పాటియాలా, 2009) హత్యలో కూడా హస్తమున్న వ్యక్తి. గత జూలైలో, పంజాబ్‌లోని జలంధర్‌లో హిందూ పూజారి హత్య కేసులో నిజ్జర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ₹ 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. కెనడా, యుకె మరియు యుఎస్‌లలోని భారత దౌత్య కార్యాలయాలపై ఇటీవలి జరిగిన దాడులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18, 2023న కెనడాలో కాల్చి చంపబడ్డాడు. సర్రేలోని గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిజ్జర్ ను తుపాకీలతో కాల్చి చంపేశారు. 

మరోవైపు భారత దేశంలో జరుగుతున్న ఆర్మీ ఆపరేషన్: 

ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్లలో, ఇప్పుడు నాలుగో రోజుకు చేరుకున్న అనంత టెర్రరిస్టుల వెతుకులాట కోసం, జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఆపరేషన్ కాస్త క్లిష్టమైనదని చెప్పుకోవచ్చు. నిజానికి ఉగ్రవాదుల స్థావరాల గురించి సమాచారం అందిన దగ్గర నుంచి జరుగుతున్న ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే ఆ ఉగ్రవాదులు ఎంత కరుడ గట్టిన ఉగ్రవాదులో, ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళు ఉంటున్న ప్రదేశం దట్టమైన అడవులు, వాతావరణ వారికి అనుకూలంగా మారడంతో మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో పడింది ఆపరేషన్. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ లో సుమారు మూడుసార్లు ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. పూంచ్ మరియు రాజౌరి జిల్లాలను కవర్ చేసే పిర్ పంజాల్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుదల మధ్య ఈ ఆపరేషన్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వైద్ మాట్లాడుతూ, అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు వారి మద్దతుదారుల వ్యూహంలో మరో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఉగ్రవాదులు కోకెర్‌నాగ్‌లోని గాదుల్ అడవుల్లోని కొండపై ఉన్న ఒక గుహలో దాక్కున్నారు, ఇది వారికి రక్షణతో పాటు వారిని చుట్టుముట్టిన జాయింట్ ఆర్మీ మరియు పోలీసు బృందం ప్రతి అడుగును గమనించే విధంగా వారికి సహాయపడుతుంది. గుహకు దారితీసే ఇరుకైన మార్గం, ఉగ్రవాదులకు ప్లస్ పాయింట్ గా మారింది. బుధవారం తెల్లవారుజామున బృందం వారి మొదటి దాడిని ప్రారంభించినందున ముగ్గురు సిబ్బంది వారి ప్రాణాలను కోల్పోయారు.