Kerala Nurse: యెమెన్‌లో కేరళ నర్సు మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు

కేరళ నర్సుకు నిరాశ

Courtesy: Twitter

Share:

Kerala Nurse: కేరళకు చెందిన ఓ నర్సుకు యెమెన్‌లో మరణశిక్ష పడింది. ఆ శిక్షను సవాల్‌ చేస్తూ ఆమె చేసిన అభ్యర్థనను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

యెమెన్‌ (Yemen)లో ఓ హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు (Nurse) నిమిష ప్రియ (Nimisha Priya)కు అక్కడి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. మరణ శిక్ష (Death Penalty)ను సవాల్‌ చేస్తూ ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను యెమెన్‌ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరణశిక్ష అమలు తప్పేలా కన్పించట్లేదు. మరోవైపు తన కుమార్తెను కాపాడుకునేందుకు యెమెన్‌ వెళ్లేందుకు అనుమతినివ్వాలని ప్రియ తల్లి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

కేరళకు(Kerala) చెందిన నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్‌(Yemen) వెళ్లింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్‌కు తిరిగి రాగా.. ఆమె మాత్రం ఉద్యోగ రీత్యా అక్కడే ఉండిపోయింది. 2015లో యెమెన్‌ దేశస్థుడైన తలాల్‌ మహ్దీ(Talal Mahdi) సాయంతో అక్కడే ఓ క్లినిక్‌ను(Clinic) ప్రారంభించింది. అయితే, కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ప్రియ పాస్‌పోర్ట్‌ను లాగేసుకున్న మహ్దీ.. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు.

దీంతో అతడి నుంచి ఎలాగైనా పాస్‌పోర్ట్‌ను(Passport) తీసుకుని స్వదేశానికి రావాలనుకున్న ప్రియ.. 2017 జులైలో మహ్దీకి మత్తు ఇంజెక్షన్‌(Anesthetic injection) ఇచ్చింది. అయితే, అది కాస్తా ఓవర్‌డోస్‌(Over Dosh) అవడంతో మహ్దీ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మహ్దీ మృతిచెందడంతో భయాందోళనకు గురైన ఆమె.. మరో వ్యక్తితో కలిసి మృతదేహాన్ని మాయం చేసింది. నాలుగు రోజుల తర్వాత వారి నేరం బయటపడటంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు(Arrest) చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన యెమెన్‌ కోర్టు(Yemen Court).. ప్రియకు మరణశిక్ష(Death Penalty) విధిస్తూ తీర్పునిచ్చింది.

కుమార్తె మరణశిక్ష(Death Penalty) గురించి తెలియగానే ప్రియ తల్లి యెమెన్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, యెమెన్‌లో అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశానికి రాకపోకలపై భారత్‌ 2016లోనే నిషేధం విధించింది. దీంతో అక్కడి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ప్రియ తల్లి దిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించారు. తన కుమార్తెను విడిపించుకునేందుకు యెమెన్‌ వెళ్లేందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌పై(Petition) దిల్లీ హైకోర్టు తాజాగా మరోసారి విచారణ జరిపింది. అయితే, మరణశిక్షపై ప్రియ దాఖలు చేసిన అప్పీల్‌ను నవంబరు 13న యెమెన్‌ సుప్రీంకోర్టు(Yemen Supreme Court) తిరస్కరించినట్లు కేంద్రం తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. దీంతో ప్రియ తల్లిని యెమెన్‌ పంపించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు(Delhi HighCourt).. కేంద్రాన్ని ఆదేశించింది.

అరబ్ దేశంలో(Arab country) అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్(Yemen) వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును(Delhi Highcourt) ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్‌ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు.

ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది.