కల్పనా చావ్లా.. అంతరిక్ష యానంలో తొలి భారతీయ మహిళ వ్యోమగామి.. ఎందరికో ఆదర్శం!

భారతీయ మహిళలకు పెద్దగా ప్రోత్సాహం లేని సమయంలో జన్మించిన కల్పనా చావ్లా.. పెద్ద పెద్ద కండలు తిరిగిన మగవాళ్ళు కూడా చిన్న బోయేలా అంతరిక్షంలో అడుగుపెట్టి.. ప్రపంచ మహిళలోకం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది కల్పనా చావ్లా.. స్త్రీ జాతి గర్వించేలా చరిత్ర సృష్టించింది. ఆమె జీవితం ఎంతోమంది స్త్రీలకు ఆదర్శం. భారతీయ మహిళలకు పెద్దగా ప్రోత్సాహం కూడా లేని సమయంలో జన్మించిన కల్పనా చావ్లా.. పెద్ద పెద్ద కండలు తిరిగిన మగవాళ్ళు కూడా చిన్న బోయేలా అంతరిక్షంలో […]

Share:

భారతీయ మహిళలకు పెద్దగా ప్రోత్సాహం లేని సమయంలో జన్మించిన కల్పనా చావ్లా.. పెద్ద పెద్ద కండలు తిరిగిన మగవాళ్ళు కూడా చిన్న బోయేలా అంతరిక్షంలో అడుగుపెట్టి.. ప్రపంచ మహిళలోకం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది

కల్పనా చావ్లా.. స్త్రీ జాతి గర్వించేలా చరిత్ర సృష్టించింది. ఆమె జీవితం ఎంతోమంది స్త్రీలకు ఆదర్శం. భారతీయ మహిళలకు పెద్దగా ప్రోత్సాహం కూడా లేని సమయంలో జన్మించిన కల్పనా చావ్లా.. పెద్ద పెద్ద కండలు తిరిగిన మగవాళ్ళు కూడా చిన్న బోయేలా అంతరిక్షంలో అడుగుపెట్టి ప్రపంచ మహిళలోకం సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఆమె మరణించి సంవత్సరాలు గడుస్తున్నా.. భవిష్యత్తు తరాలకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆమె సాధించిన కీర్తి చరిత్ర ఈ విశ్వం ఉన్నంత వరకు చెరిగిపోనిది. పూర్వకాలంలో అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడేవారు. పెద్దవారు వారిని వంటగది నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఇదే జరుగుతోంది.. పరిస్థితులు మారుతున్నా.. కాలంలో మార్పులు వస్తున్నప్పటికీ.. కొంత మందిలో మార్పులు రావడం లేదు. అయితే ఇలాంటి వాళ్లందరికీ చక్కటి ఉదాహరణ కల్పనా చావ్లా అని చెప్పాలి.

బాల్యం: 

ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కాలంలో పుట్టిన ఈమె.. ఆ కాలంలో మహిళలకు కూడా అన్ని రంగాలలో గుర్తింపు రావాలన్నా కారణంతో ఆమె వేసిన తొలి అడుగు ఎంతో మంది భారతీయ మహిళలకు స్ఫూర్తిని ఇచ్చింది. కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రం కర్నల్ లో 1962లో జన్మించారు.  ఠాగూర్ స్థాపించిన బాలనికేతన్ స్కూల్లో సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి తన తండ్రి పూర్తి సహకారాన్ని అందించారు. ఆ సహకారంతోనే తన తండ్రి తో తరచూ బయటకు వెళ్తూ ఉండేవారు.

అదే సమయంలో తండ్రితో కలసి లోకల్ క్లబ్ కు వెళ్ళినప్పుడు ఏరొప్లేన్ లను చూసేవారట.  అలా విమానం రెక్కల్ని తన మనసుకు తొడుక్కున్నారు కల్పనా చావ్లా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే.. 1982లో ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేయడానికి టెక్సాస్ యూనివర్సిటీలో సీటు కోసం అమెరికా వెళ్ళింది. ఆ తర్వాత 1991 లో అమెరికా పౌరసత్వం పొంది.. అదే ఏడాది నాసాలో చేరారు. Nasa’s Ames Research Center లో చేరి అక్కడ పనిచేస్తూ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఆ కాలంలోనే పీహెచ్డీ పూర్తి చేశారు.. అలా పురోగతి సాధించిన కల్పన.. 1997 నవంబర్ 19వ తేదీన మొదటిసారిగా ఎస్ టి ఎస్ -87 మిషన్ లో భాగంగా కొంతమంది వ్యోమగాములతో కలిసి అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

మొదటి అంతరిక్ష యాత్రలో కల్పనా చావ్లా 6.5 మిలియన్ మైళ్ళకు పైగా ప్రయాణించారు. సుమారు 376 గంటలు.. అంటే 15 రోజుల 16 గంటల పాటు అంతరిక్షంలోనే గడిపింది. కల్పనాకి చావ్లా విజయవంతమైన అంతరిక్ష ప్రయాణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ 2003లో జనవరి 16వ తేదీన ఎస్ టి ఎస్ – 107 మిషన్ లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు.  కానీ ఆ సమయంలోనే అనంత లోకాలలో కలిసిపోయారు. 2023 ఫిబ్రవరి 1న భూమికి తిరిగి వస్తుండగా  ఆకాశమార్గంలోనే రాకెట్ పేలుడు సంభవించి, ఆమె వీరమరణం పొందారు.  ఇక ఆమె మరణం, కీర్తి చరిత్రలో అలా మిగిలిపోయింది. ఈ స్పేస్ షిప్ లోనే కల్పనా చావ్లా తో సహా మొత్తం ఏడుగురు వ్యోమగాములు ఈ ప్రమాదంలో స్వర్గస్తులయ్యారు. 

అప్పటికి కల్పనా వయసు 35 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఘనత సాధించిన కల్పనా చావ్లా అంటే నేటికీ.. అందరికీ స్ఫూర్తిదాయకం. అంతేకాదు మొట్టమొదటిసారి అంతరిక్ష యానంలో వ్యోమగామిగా ప్రయాణించిన తొలి భారతీయ మహిళగా కూడా ఈమె రికార్డు సృష్టించింది.