జస్టిన్ ట్రూడో తన భార్య తో 18 ఏళ్ల తర్వాత విడిపోయారు

ప్రపంచంలో మరో దేశాధినేత విడాకులకు సిద్ధమయ్యారు…కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. తన భార్య సోఫీ  గ్రెగోయిర్  నుండి విడిపోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు..అలానే  సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ట్రూడో, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో బుధవారం ప్రకటించారు మరోవైపు,సోఫీ కూడా తన భర్త తో విడిపోతున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ లో ప్రకటించింది.ఈ జంట ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర […]

Share:

ప్రపంచంలో మరో దేశాధినేత విడాకులకు సిద్ధమయ్యారు…కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోయారు. తన భార్య సోఫీ  గ్రెగోయిర్  నుండి విడిపోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు..అలానే  సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ట్రూడో, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో బుధవారం ప్రకటించారు మరోవైపు,సోఫీ కూడా తన భర్త తో విడిపోతున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ లో ప్రకటించింది.ఈ జంట ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

అధికారంలో ఉండగానే విడాకులు తీసుకున్న రెండో కెనడా ప్రధాని….

వీరిద్దరూ 2003లో కలుసుకున్నారు.సోఫీ గ్రెగోయిర్ ట్రూడో క్యూబెక్ లో టెలివిజన్ రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. 2005లో వివాహం చేసుకున్నారు.ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు దీర్ఘకాల సంబంధాల సవాళ్లతో సహా వారు చాలా కాలం  కలిసి ఉన్నారు.ఆమె జస్టిన్ ట్రూడోతో కలిసి మూడు ఎన్నికలకు ప్రచారం కూడా చేసారు . ఆమె మహిళల హక్కులు, మానసిక ఆరోగ్య సమస్యలకోసం వాదించడం ద్వారా చాలాసార్లు వార్తల్లో నిలిచారు.

జస్టిన్‌ ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల సంరక్షణను ఇద్దరూ కలిసి చూసుకుంటామని వారు  తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలో మరో నివాసంకు సోఫీ ట్రూడో షిఫ్ట్ అయ్యారు అంతే కాకుండా అధికారంలో ఉండగానే విడాకులు తీసుకున్న రెండో ప్రధాని జస్టిన్ ట్రూడో. అంతకుముందు అతని తండ్రి పియరీ ట్రూడో 1979లో భార్య మార్గరెట్ నుండి విడిపోయారు. అధికారంలో ఉండగానే విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ 1984లో విడిపోయారు 

పబ్లిక్ అప్పీరియన్స్‌లోట్రూడో దంపతులు  ఎప్పుడూ హ్యాపీ కపుల్ గా కనిపిస్తుంటారు. 

అలాంటి ముచ్చటైన ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మూడేళ్ల కిందట 2020 నాటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. భార్య సోఫీని పొగడ్తల్లో ముంచెత్తిన ట్రూడో.. ఆమె నా భాగస్వామి..నా బెస్ట్ ఫ్రెండ్ అని అభివర్ణించారు. కాగా, ట్రూడో దంపతుల నిర్ణయంపై వారి అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విడాకులు పిల్లలను విచ్ఛిన్నం చేస్తాయని వ్యాఖ్యానించారు.

వీరికి జేవియర్ (15), ఎల్లా-గ్రేస్ (14), హాడ్రియన్ (9) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విడిపోవడానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో తన పిల్లలకు ఒక కుటుంబంలా ఉంటానని జస్టిన్ ట్రూడో తెలిపారు..

 2015లో అధికారం చేపట్టిన తర్వాత ట్రూడోకు ఎదురైన అతి పెద్ద వ్యక్తిగత సంక్షోభాలలో ఇది ఒకటి. ఎన్నికల్లో తన లిబరల్ పార్టీ స్థానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఇటీవలే క్యాబినెట్‌ను పునర్వవస్థీకరించారు. జనాదరణలో వెనుకబడినప్పటికీ 2025 అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించాలని ట్రూడో నిశ్చయించుకున్నారు.

ప్రధాని స్థాయికి తగిన గౌరవం ఇవ్వలేదా… 

 ప్రధాని హోదాలో ఐదేళ్ల కిందట 2018 ఫిబ్రవరిలో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో తొలిసారి పర్యటించారు. కుటుంబసమేతంగా వచ్చిన కెనడా అధికారిక పర్యటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. ట్రూడో, ఆయన కుటుంబం పర్యటనను ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చాలా వరకు విస్మరించారనే వాదనలు ఉన్నాయి. ట్రూడో ఢిల్లీలో విమానం దిగినప్పుడు ఆయనకు ఒక జూనియర్ మంత్రి స్వాగతం పలికారు. దీనిని ప్రస్తావిస్తూ కెనడా ప్రధాని స్థాయికి తగిన గౌరవం ప్రభుత్వం ఇవ్వలేదని చాలా మంది విమర్శించారు.

కెనడా ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో..చట్టపరమైన విభజన ఒప్పందంపై దంపతులు సంతకం చేసినట్లు తెలిపింది. విడిపోయినప్పటికీ, తమ  పిల్లలను సురక్షితమైన, ప్రేమ పూర్వక వాతావరణంలో పెంచడంపై ఇద్దరూ దృష్టిపెడతామని చెప్పారు. ఈ సవాలు సమయంలో వారి గోప్యతను గౌరవించాలని జస్టిన్ ట్రూడో కార్యాలయం ప్రజలను కోరారు.