జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి 9 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధం

జాన్సన్ అండ్ జాన్సన్ దాని టాల్క్ ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి 9 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ కంపెనీ తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన వ్యాజ్యాలను పరిష్కరించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ 8.9 బిలియన్ డాలర్లను చెల్లించడానికి సిద్ధంగా ఉంది. కాగా.. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ వల్ల […]

Share:

జాన్సన్ అండ్ జాన్సన్ దాని టాల్క్ ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి 9 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ కంపెనీ తెలిపింది.

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన వ్యాజ్యాలను పరిష్కరించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ 8.9 బిలియన్ డాలర్లను చెల్లించడానికి సిద్ధంగా ఉంది. కాగా.. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ వల్ల కలిగే నష్టాల గురించిన సమాచారాన్ని ఇన్నాళ్ళూ దాచిపెట్టిందని ఈ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలకై చరిత్రలో అతిపెద్ద మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.

జాన్సన్ అండ్ జాన్సన్ తమ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని కేసు వేసిన వారికి 8.9 బిలియన్ డాలర్లను చెల్లించడానికి అంగీకరించింది. దీంతో ఈ సమస్యపై ఏళ్ల తరబడి సాగుతున్న న్యాయ పోరాటానికి తెరపడే అవకాశం ఉంది.

ఈ US ఆధారిత ఫార్మాస్యూటికల్ మరియు బేబీ ప్రొడక్ట్స్ కంపెనీ దీని కోసమై పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధమయ్యింది. ఇది కాస్మెటిక్ టాల్క్ వ్యాజ్యం నుండి ఉత్పన్నమయ్యే అన్ని క్లెయిమ్‌లను సమానంగా, సమర్థవంతమైన పద్ధతిలో పరిష్కరిస్తుంది.

తమ బేబీ పౌడర్ మరియు ఇతర టాల్క్ ఆధారిత ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని ప్రజలు పేర్కొంటున్నందున, ఉత్తర అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ పై పదివేల కేసులు నమోదయ్యాయి. 

కానీ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ తప్పును అంగీకరించలేదు. అయితే మే 2020లో.. ఈ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో తన టాక్-బేస్డ్ బేబీ పౌడర్‌ను విక్రయించడాన్ని నిలిపివేసింది.

కాస్మెటిక్ టాల్క్.. అండాశయ క్యాన్సర్ మరియు మెసోథెలియోమాకు కారణమవుతుందనే ఆరోపణలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీనిని స్వతంత్ర నిపుణులు, ప్రభుత్వ  సంస్థలు మరియు నియంత్రణ సంస్థలు ఎన్నో దశాబ్దాలుగా తిరస్కరించినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది.

జాన్సన్ అండ్ జాన్సన్ వారి లిటిగేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ ఒక ప్రకటనలో.. కంపెనీపై వచ్చిన వాదనలు నిరాధారమైనవని, సాక్ష్యాధారాలు చాలా  తక్కువగా ఉన్నాయని తెలిపారు. టార్ట్ సిస్టమ్‌లో ఈ కేసులను పరిష్కరించడానికి చాలా సమయం పడుతుందని, LTLపై అనేక ఖర్చులు పెరగవచ్చని దివాలా కోర్టు గుర్తించినప్పటికీ, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సరయిన ఆప్షన్ అదే అని హాస్ చెప్పారు. 

ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక మరింత సమానమైనది మరియు సమర్ధవంతంగా ఉంటుందని, హక్కుదారులు సకాలంలో పరిహారం పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.

అలాగే, మానవాళి ఆరోగ్యాన్ని కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని కంపెనీ తెలిపింది.

సంస్థ యొక్క అన్ని కాస్మెటిక్ టాల్క్ వ్యాజ్యాలను పరిష్కరించే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం పొందడానికి, దాని అనుబంధ సంస్థ, LTL మేనేజ్‌మెంట్ LLC.. స్వచ్ఛంద దివాలా రక్షణ కోసం కేసు దాఖలు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కొనసాగుతున్న కంపెనీ దివాలా చర్యలకు మద్దతుగా ఇప్పుడు అదనంగా 6.9 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టేందుకు కూడా సిద్ధమయినట్టు కంపెనీ తెలిపింది.

అయితే, మంగళవారం ఆమోదించబడిన పరిష్కార ప్రణాళిక ప్రకారం.. ఇకపై పరిష్కారం కోసం వేచి ఉండలేని వారికి వేగంగా న్యాయమైన పరిహారం అందిస్తుంది. ఈ వివాదానికి గురైన ప్రతి ఒక్కరికీ, వారు అర్హమైన వాటిని పొందేలా చూడడానికి ఇదే ఉత్తమ మార్గమని ఫిర్యాది తరఫు న్యాయవాదులు తెలిపారు.