జో బిడెన్ ట్వీట్-మోదీ రిప్లై

 ఆదివారం ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ భారతదేశం మరియు అమెరికా మధ్య జరుగుతున్న స్నేహసంబంధిత చర్చలు ప్రపంచ మేలు కోసం మరియు మన ప్లానెట్ మరింత పటిష్టంగా మరియు స్థిరంగా మారుస్తుంది, భారతదేశం మరియు అమెరికా మధ్య జరుగుతున్నా స్నేహసంబంధిత చర్చలు ప్రపంచానికి చాలా ఉపయోగకరమైనవని జో బిడెన్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు “అమెరికా మరియు భారతదేశం మధ్య స్నేహం ప్రపంచంలోనే అత్యంత పరిణామాత్మకం గా ఉంటుందని, మరియు […]

Share:

 ఆదివారం ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ భారతదేశం మరియు అమెరికా మధ్య జరుగుతున్న స్నేహసంబంధిత చర్చలు ప్రపంచ మేలు కోసం మరియు మన ప్లానెట్ మరింత పటిష్టంగా మరియు స్థిరంగా మారుస్తుంది,

భారతదేశం మరియు అమెరికా మధ్య జరుగుతున్నా స్నేహసంబంధిత చర్చలు ప్రపంచానికి చాలా ఉపయోగకరమైనవని జో బిడెన్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు

“అమెరికా మరియు భారతదేశం మధ్య స్నేహం ప్రపంచంలోనే అత్యంత పరిణామాత్మకం గా ఉంటుందని, మరియు దీనివలన గతంలో కంటే ఎంతో బలంగా మరియు సన్నిహితంగా, డైనమిక్ ఉంటుంది” అని ఇటీవల ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు సంబంధించిన వీడియో మాంటేజ్‌ను షేర్ చేస్తూ బిడెన్ ట్వీట్ చేశారు. 

బిడెన్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, ప్రధాని మోదీ ట్విట్టర్‌లో, “నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను @POTUS @JoeBiden! మన దేశాల మధ్య స్నేహం ప్రపంచ మేలుకొరకే అన్నారు. ఇది మన ప్లానెట్ మరింత పటిష్టంగా మరియు స్థిరంగా మారుస్తుంది” అని “నా ఇటీవలి పర్యటన మన బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రధాని మోదీ అన్నారు. 

ప్రధానమంత్రి జూన్ 20న అమెరికా పర్యటనకు  వెళ్లి మరియు  న్యూయార్క్‌ లో  అతను జూన్ 21న తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

తరువాత, వాషింగ్టన్ DC లో, అధ్యక్షుడు బిడెన్ వైట్ హౌస్ వద్ద అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.  ఇద్దరు నాయకులు గురువారం చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు, అనంతరం అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రసంగం మరియు అతని గౌరవార్థం బిడెన్స్ వైట్ హౌస్‌లో విందును ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో నేను, జిల్​ (బైెడెన్​ సతీమణి) చాలా మంచి సమయం గడిపాము. ఈ పర్యటన చాలా ప్రొడక్టివ్​గా సాగింది. ఈరోజున.. భారత్​- అమెరికా మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాను,” అని శ్వేతసౌధంలో జరిగిన స్టేట్​ డిన్నర్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు

రోజులు గడిచే కొద్ది.. భారతీయులు, అమెరికన్లు దగ్గరవుతున్నారు. ఒకరి గురించి ఒకరు బాగా అర్ధం చేసుకుంటున్నారు అని ,. హాలోవీన్​ కోసం భారత్​లోని పిల్లలు స్పైడర్​మ్యాన్​లు అవుతున్నారు. అమెరికన్లు ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తున్నారు,” అని స్టేట్​ డిన్నర్​లో మోదీ అన్నారు.

స్టేట్​ డిన్నర్​కి ముందు.. అమెరికా కాంగ్రెస్​లో ప్రసంగించారు ప్రధాని మోదీ. ఆ తర్వాత.. కాంగ్రెస్​ సభ్యుల్లో చాలా మంది.. మోదీతో ఫొటోలు దిగాలని, ఆటోగ్రాఫ్​ తీసుకోవాలని క్యూ కట్టడం విశేషం

.

ఈ పర్యటన రక్షణ, అంతరిక్షం మరియు వాణిజ్యం వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ముఖ్యమనై ఒప్పందాలు గా గుర్తించబడింది. మరియు రెండు దేశాల మధ్య స్నేహ సంబందాలు బాగా మెరుగయ్యాయి అని , అలాగే ఈ పర్యటన వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని అన్నారు. మోదీ ఎప్పుడు అమెరికాలో ప‌ర్య‌టించినా ఏదో తెలీని ఉత్సుక‌తతో ఉంటారు. ఈ రెండు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు కొనసాగాల‌ని ఇరు దేశ లీడ‌ర్లు అనుకుంటున్నారు.