జిన్‌పింగ్ రాక‌పోవ‌డం నిరాశే: జో బైడెన్

ఇండియాలో జరిగే జీ 20 సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్రావడం లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. ఎన్నటి నుంచో జిన్‌పింగ్ రాక మీద ఊహాగానాలు వస్తున్న వేళ… అతడు రావడం లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జీ 20 సమావేశాల కోసం దేశ రాజధాని నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సమావేశాలకు వచ్చే వివిధ దేశాల అధినేతల కోసం ఇండియన్ గవర్నమెంట్ తో […]

Share:

ఇండియాలో జరిగే జీ 20 సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్రావడం లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. ఎన్నటి నుంచో జిన్‌పింగ్ రాక మీద ఊహాగానాలు వస్తున్న వేళ… అతడు రావడం లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జీ 20 సమావేశాల కోసం దేశ రాజధాని నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సమావేశాలకు వచ్చే వివిధ దేశాల అధినేతల కోసం ఇండియన్ గవర్నమెంట్ తో పాటు ఢిల్లీ గవర్నమెంట్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకావడం లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో సమావేశాలకు వచ్చే అనేక రకాల దేశాల అధినేతలు జిన్ పింగ్ నిర్ణయం మీద స్పందిస్తున్నారు. 

ఆ నిర్ణయం నిరాశపర్చింది..

జిన్ పింగ్ నిర్ణయం తీసుకు్నన తర్వాత ఇదే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. తన భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని, అయితే తన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ 20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసిందని తెలిపారు. జీ 20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బైడెన్ సెప్టెంబర్ 7న భారత్‌కు వెళతారని, ఈ చారిత్రాత్మక సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కూడా ఉంటుందని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది. జీ 20 ప్రస్తుత అధ్యక్షుని హోదాలో, భారతదేశం సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో న్యూఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తోంది. భారతదేశ పర్యటన కోసం ఎదురు చూస్తున్నారా అని బైడెన్ ను విలేకరులు ప్రశ్నించగా.. అవును ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటూ బైడెన్ బదులిచ్చారు. జీ 20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాకపోవడం అనే నిర్ణయం పట్ల బైడెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేను జిన్ పింగ్ నిర్ణయంతో చాలా నిరాశకు గురయ్యానని, కానీ నేను అతనిని చూడబోతున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న జీ20 సదస్సుకు బైడెన్ తో పాటుగా దాదాపుగా రెండు డజన్లకు పైగా ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. ఇటీవలి మీడియాలో వచ్చిన కథనాల ప్రకాకం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. జిన్ పింగ్ కు బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరు కానున్నారు. జకార్తాలో జరిగే తూర్పు ఆసియా సదస్సుకు హాజరైన తర్వాత లీ కియాంగ్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. 2021లో.. చైనా యొక్క COVID-19 పరిమితుల కారణంగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇటలీకి వెళ్లలేకపోయారు. 

ఎందరో అధినేతలు

ఈ జీ20 సమావేశాలకు ఎన్నో దేశాల అధినేతలు హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా రానున్నట్లు ఇప్పటికే వారు ధృవీకరించారు. ఇక వీరు మాత్రమే కాకుండ ఇంకా అనేక దేశాల అధినేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10న ఇండియాలో జీ 20 సమావేశాలు ముగిసిన తర్వాత భాగస్వామ్యాన్ని మన దేశ ప్రధాని మోదీ సగర్వంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ లాలూకు అందజేయనున్నారు. జీ 20 సభ్య దేశాలు ప్రపంచ GDPలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయనే విషయం తెలిసిందే. జీ 20 గ్రూప్ లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, UK, US మరియు యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు ఉన్నాయి.