రుణమాఫీ గురించి ప్రస్తావించిన బిడెన్

లోన్ ద్వారా చదువుకుంటున్న స్టూడెంట్ విద్యను పూర్తి చేయడానికి పేరుకుపోయే స్థిరమైన రుణాన్ని పరిష్కరించడానికి ఫెడరల్ విద్యార్థి రుణ మాఫీ గురించిన కొత్త రౌండ్‌ను బుధవారం వివరించారు, అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ జో బిడెన్. రుణమాఫీ గురించి ప్రస్తావించిన బిడెన్:  COVID-19 మహమ్మారి సమయంలో ప్రారంభమైన మూడేళ్ళ విరామం తర్వాత, ప్రస్తుతం లోన్ తీసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ చెల్లింపులను పునఃప్రారంభించవలసి ఉంటుంది. బిడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుణమాఫీ గురించి తన ప్రచార వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నందున […]

Share:

లోన్ ద్వారా చదువుకుంటున్న స్టూడెంట్ విద్యను పూర్తి చేయడానికి పేరుకుపోయే స్థిరమైన రుణాన్ని పరిష్కరించడానికి ఫెడరల్ విద్యార్థి రుణ మాఫీ గురించిన కొత్త రౌండ్‌ను బుధవారం వివరించారు, అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ జో బిడెన్.

రుణమాఫీ గురించి ప్రస్తావించిన బిడెన్: 

COVID-19 మహమ్మారి సమయంలో ప్రారంభమైన మూడేళ్ళ విరామం తర్వాత, ప్రస్తుతం లోన్ తీసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ చెల్లింపులను పునఃప్రారంభించవలసి ఉంటుంది. బిడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుణమాఫీ గురించి తన ప్రచార వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ప్రకటన వచ్చింది.

డెమొక్రాటిక్ అధ్యక్షుడి అందించిన సమాచారం ప్రకారం, 1,25,000 మంది రుణగ్రహీతలకు ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్‌ల ద్వారా $9 బిలియన్ల రుణాన్ని మాఫీ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా, బిడెన్ అధికారం చేపట్టినప్పటి నుండి 3.6 మిలియన్ల రుణగ్రహీతలు $127 బిలియన్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ అప్పుడే ఆగిపోలేదని ఇంకా కొనసాగుతూనే ఉందని మరొకసారి గుర్తు చేశారు బిడెన్. గత సంవత్సరం ప్రకటించిన సేవ్ ప్లాన్ వంటి వివిధ ప్రోగ్రామ్‌ల ఆధారంగా రుణగ్రహీతల ఆదాయంతో ముడిపడి చెల్లింపులను తగ్గిస్తుంది.

బిడెన్ యొక్క కొన్ని ప్రయత్నాలలో పబ్లిక్ సర్వీస్ రుణ మాఫీ వంటి ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్‌లను బలోపేతం చేయడం జరిగింది. సంవత్సరాలుగా, లక్షలాది మంది అర్హులైన రుణగ్రహీతలు వారు అర్హత సాధించిన విద్యార్థుల రుణ మాఫీ అనేది పొందలేకపోయారని, అయితే అధ్యక్షుడు బిడెన్ తిరిగి విద్యార్థి రుణ వ్యవస్థను పరిష్కరించడానికి చేస్తున్న అన్ని ప్రయత్నాలు అమోఘమని, ధన్యవాదాలు అని విద్యా కార్యదర్శి మిగ్యుల్ కార్డోనా ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇటీవల వీసాల జారీలో అమెరికా రికార్డ్: 

భారతీయ విద్యార్థులకు ఇతర దేశాలకు వెళ్లి చక్కని పైచదువులు చదవాలని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే పలు దేశాలు తమ వైపు నుంచి భారతీయ విద్యార్థుల కోసం చక్కని అవకాశాలను కల్పిస్తుండడం విశేషం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసినట్లు ప్రకటించింది. US నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులను దాఖలు చేసిన భారతదేశం నుండి 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారతదేశంలోని US మిషన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

2022లో, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు USలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదికలు పేర్కొన్నాయి. భారతదేశం నుండి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీస్, ఆర్థిక సహాయం మరియు స్కాలర్‌షిప్‌ల ఫలితంగా, ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు నిజానికి ఇది ఒక చక్కని అవకాశంగా మారింది. 

ఫ్రాన్స్ కూడా భారతదేశం నుండి సుమారు 30,000 మంది విద్యార్థులను స్వాగతించాలని తన  లక్ష్యాన్ని, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరికను వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం మరియు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు దేశాలు. 

ఇలా చాలా దేశాలు కూడా తమ దేశంలోని చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీసాల దగ్గర నుంచి స్కాలర్షిప్ల వరకు చాలా సదుపాయాలు కల్పిస్తూ, విదేశీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి దేశాలు.