జిల్ బిడెన్ కు కరోనా పాజిటివ్

అమెరికా ప్రెసిడెంట్ జోక్ బిడెన్ భార్య, ఫస్ట్ లేడీకి కరోనా పాజిటివ్. సోమవారం నాడు ప్రకటించిన వైట్ హౌస్. ఫస్ట్ లేడీ, జిల్ బిడెన్ కు కరోనా సింటమ్స్ కనిపించడంతో, టెస్టులు చేయించగా ఆమెకు కరోనా పాజిటివ్ గా రిజల్ట్ వచ్చిందని వైట్ హౌస్ ఇటీవల ప్రకటించింది. జో బిడెన్ సంగతేమిటి: అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తన భార్యకు కరోనా పాజిటివ్ రాగా, తాను కూడా అప్రమత్తమై టెస్టులు చేయించుకోగా నెగిటివ్గా వచ్చినట్లు మరోసారి […]

Share:

అమెరికా ప్రెసిడెంట్ జోక్ బిడెన్ భార్య, ఫస్ట్ లేడీకి కరోనా పాజిటివ్. సోమవారం నాడు ప్రకటించిన వైట్ హౌస్. ఫస్ట్ లేడీ, జిల్ బిడెన్ కు కరోనా సింటమ్స్ కనిపించడంతో, టెస్టులు చేయించగా ఆమెకు కరోనా పాజిటివ్ గా రిజల్ట్ వచ్చిందని వైట్ హౌస్ ఇటీవల ప్రకటించింది.

జో బిడెన్ సంగతేమిటి:

అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తన భార్యకు కరోనా పాజిటివ్ రాగా, తాను కూడా అప్రమత్తమై టెస్టులు చేయించుకోగా నెగిటివ్గా వచ్చినట్లు మరోసారి ప్రకటించింది వైట్ హౌస్. 

అయితే గత సంవత్సరం ఆగస్టు నెలలో జో బిడెన్ భార్యకు కరోనా సోకగా, గత సంవత్సరం జులై నెలలో జో బిడెన్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతానికి, జోబిడెన్ భార్య జిల్ తన నివాసంలోనే, క్వారెంటీన్ లో ఉంటున్నట్లు సమాచారం. 

అయితే మరో రెండు రోజుల్లో, బిడెన్ భారత్ పర్యటన ఉండగా, తన భార్యకు కరోనా రావడం కలవరం రేపుతోందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే జో బిడెన్ కు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ, ఈ వారం అంతటా ఆయనకి రెగ్యులర్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది, అంతేకాకుండా 24 గంటలు పర్యవేక్షణలో ఉంటూ, కరోనా సింటమ్స్ కనిపిస్తున్నాయో లేదో మానిటర్ చేయడం జరుగుతుంది.

బిడెన్ భారత్ పర్యటన ప్రకటించిన వైట్ హౌస్:

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో జరగనున్న G20 సమ్మిట్ కోసం అధ్యక్షత వహిస్తున్న భారతదేశం, ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనుంది. సమ్మిట్ సందర్భంగా, G20కి నాయకత్వం వహించినందుకు భారత దేశ ప్రధాని మోదీని, అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రశంసించారని వైట్ హౌస్ తెలిపింది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రభావాల గురించి కూడా భారతదేశ ప్రధానమంత్రి,  అమెరికా అధ్యక్షుడు సమావేశం కానున్నారని.. అదేవిధంగా దేశాల మీద యుద్ధం యొక్క ప్రభావాలు తగ్గించేందుకు మరియు ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, ప్రపంచ బ్యాంకుతో సహా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా, ఇరుదేశాలు మాట్లాడుకుంటాయని, వైట్ హౌస్ తెలిపింది.

G20 సమ్మిట్:

వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు.

ఇంచుమించు 110 దేశాల నుంచి సుమారు 12,300 మంది ప్రతినిధులు రానున్నట్లు అంచనా. ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగిన సమావేశాలలో, ఇప్పుడు జరగబోయే G-20 సబ్మిట్ అనేది అతి పెద్ద సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

G20 సమ్మిట్ లో ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, UK మరియు US ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ (EU). అతిథి దేశాలు: బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE.