కాబోయే భార్య కోసం ఖరీదైన ఇల్లు కొన్న జెఫ్ బెజోస్

అమెజాన్ ఫౌండర్, ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు jeff bezos తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన “బిలియనీర్ బంకర్” ఎన్‌క్లేవ్‌లో $68 మిలియన్ల భవనాన్ని కొనుగోలు చేశాడు.  బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రస్తుతం జెఫ్ బెజోస్ నికర ఆస్తి 163 బిలియన్ డాలర్లు. అమెజాన్ మాజీ సీఈఓ, శాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్న బెజోస్ ఆమెకు ఇటీవలే 2.5 మిలియన్ డాలర్ల విలువ గల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. తాజాగా  ఇండియన్ క్రీక్ […]

Share:

అమెజాన్ ఫౌండర్, ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు jeff bezos తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన “బిలియనీర్ బంకర్” ఎన్‌క్లేవ్‌లో $68 మిలియన్ల భవనాన్ని కొనుగోలు చేశాడు. 

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రస్తుతం జెఫ్ బెజోస్ నికర ఆస్తి 163 బిలియన్ డాలర్లు. అమెజాన్ మాజీ సీఈఓ, శాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్న బెజోస్ ఆమెకు ఇటీవలే 2.5 మిలియన్ డాలర్ల విలువ గల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. తాజాగా  ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లోని ఓ మూడు పడక గదులు, మూడు బాత్‌రూమ్‌ల ఎస్టేట్‌ను మార్కెట్‌లో లేని ధరతో కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఈ ఇల్లు ఉన్న ఐలాండ్ ఒక మానవ నిర్మిత ఐలాండ్. దీనికి స్వంత మునిసిపాలిటీ, మేయర్, సొంత పోలీసు బలగాలు ఉన్నాయి. ఈ ఐలాండ్‌లో టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్, జూలియో ఇగ్లేసియాస్ వంటి ప్రముఖుల ఇళ్ళు ఉన్నాయి. 

ఈ భవనం 9,259 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1965లో నిర్మించారు. దీని వాటర్ ఫ్రంట్‌లో 2.8 ఎకరాల స్థలం ఉంది. ఇది గతంలో పనామాతో సంబంధాలు కలిగి ఉన్న MTM స్టార్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌లో మాజీ హోటలియర్, మేనేజర్ అయిన తులియా సౌసీ డి గొంజాలెజ్ గోర్రోండోనా యాజమాన్యంలో ఉండేదని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఇదే ప్రాపర్టీ, గతంలో 1982లో 1.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. నేటి ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే దీని ధర కేవలం 4.4 మిలియన్ డాలర్లు మాత్రమే. కానీ జెఫ్ బెజోస్ మాత్రం ఏకంగా 63 మిలియన్ డాలర్లు వెచ్చింది కొనుగోలు చేయడం గమనార్హం.

ఇండియన్ క్రీక్ ఐలాండ్

ఇండియన్ క్రీక్ ఐలాండ్ 294 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 18-హోల్స్ గోల్ఫ్ కోర్ట్‌తో  పాటు నీటికి ఎదురుగా 40 వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలను కలిగి ఉంది. బ్రెజిలియన్ టేకు రేవులు కూడా ఉన్నాయి.  ఇక్కడ 100 పైగా అడుగుల పొడవున్న విలాసవంతమైన ఓడలు, 417 అడుగుల సూపర్‌యాచ్‌లు కూడా ఉన్నాయి. 

2021 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపం యొక్క జనాభా సంఖ్య కేవలం 81 మాత్రమే. కాగా జెఫ్ బెజోస్ ఇంకో ఇంటిని కూడా కొనాలని చూస్తున్నారని బ్లూమ్‌బర్గ్ రిపోర్టర్ ఒకరు వెల్లడించారు. అది కూడా అత్యంత ధరకే కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. Homes.com ప్రకారం ఆ ఇల్లు ధర 85 మిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లోని రోడ్ నంబర్ 12లో ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లు ప్రస్తుతం బెజోస్ కొన్న ఇల్లు కంటే పెద్దది. ఈ భవనం 19,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు బెడ్‌రూమ్‌లు, 14 బాత్‌రూమ్‌లు కలిగి ఉంది.

జెఫ్ బెజోస్ రియల్ ఎస్టేట్స్

తాజా కొనుగోలుతో జెఫ్ బెజోస్ రియల్ ఎస్టేట్స్ ఆస్తి భారీగా పెరిగింది. అతనికి 2020లో 165 మిలియన్ డాలర్లు పెట్టి కొన్న బెవర్లీ హిల్స్‌లోని తొమ్మిది ఎకరాల మాన్షన్, వాషింగ్టన్, DCలో అతిపెద్ద ఇల్లు, హవాయిలో 78 మిలియన్ డాలర్ల ఎస్టేట్స్ ఉన్నాయి. దీంతో పాటు మదీనా వాష్‌లో 5.3 ఎకరాల ఆస్తి, టెక్సాస్‌లో 30,000 ఎకరాల ర్యాంచ్, NYCలోని ఫిఫ్త్ అవెన్యూ అపార్ట్మెంట్ భవనంలో దాదాపు 100 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ ఉంది.

ట్రెండింగ్ లో బెజోస్ నిర్ణయం

జెఫ్ బెజోస్  2019లో మెకెంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. ఖరీదైన విల్లాలు, పడవలు, క్రూజ్ షిప్‌లపై భారీగా వెచ్చిస్తున్నాడు. అతను తాజాగా కొనుగోలు చేసిన 500 మిలియన్ డాలర్ల విలువ చేసే పడవ నిర్వహణకు సంవత్సరానికి 25 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంటే, అతని ఖర్చులు ఏ స్థాయిలో పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు.