టయోటా, హోండా కార్మికుల వేతనాల పెరుగుదల

జపనీస్ మోటారు పరిశ్రమ దిగ్గజాలు టయోటా, హోండా ఆ దేశంలోని తమ కార్మికులకు కొన్ని దశాబ్దాల పాటు జీతాలు పెద్దగా పెంచలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు దిగ్గజ కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది. టయోటా, హోండా ఈ రెండు కంపెనీలు వాటి చక్కని ప్యాకేజింగ్‌‌‌తో, సౌకర్యవంతమైన, నాణ్యత గల కార్లను సరసమైన ధరలో తయారు చేయడానికి ప్రసిద్ది చెందిన మాన్యుఫ్యాక్చరర్స్. డ్రైవర్ల యొక్క అవసరాలను తీర్చడానికి అనేక రకాల కార్లు, ఎస్‌యూవీలు, […]

Share:

జపనీస్ మోటారు పరిశ్రమ దిగ్గజాలు టయోటా, హోండా ఆ దేశంలోని తమ కార్మికులకు కొన్ని దశాబ్దాల పాటు జీతాలు పెద్దగా పెంచలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు దిగ్గజ కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

టయోటా, హోండా ఈ రెండు కంపెనీలు వాటి చక్కని ప్యాకేజింగ్‌‌‌తో, సౌకర్యవంతమైన, నాణ్యత గల కార్లను సరసమైన ధరలో తయారు చేయడానికి ప్రసిద్ది చెందిన మాన్యుఫ్యాక్చరర్స్. డ్రైవర్ల యొక్క అవసరాలను తీర్చడానికి అనేక రకాల కార్లు, ఎస్‌యూవీలు, ట్రక్కులను తయారు చేసి విక్రయిస్తారు.

టయోటా మరియు హోండా దశాబ్దాలలో అతిపెద్ద వేతన పెంపును ప్రకటించాయి

గత నెలలో ప్రచురించబడిన అధికారిక గణాంకాల ద్వారా.. జపాన్ ద్రవ్యోల్బణ రేటు గత 40 సంవత్సరాలలో అత్యధిక స్థాయిలో ఉన్నదని తేలింది. అందువల్ల, ఖర్చులను తట్టుకోగలగడానికి ఆయా సంస్థలు జీతాలను పెద్ద మొత్తంలో పెంచనున్నాయి.

ప్రతి సంవత్సరం జపనీస్ సంస్థలు సాధారణంగా మార్చి నెలలో మూడవ వారంలో తమ నిర్ణయాలను ప్రకటిస్తాయి. అయితే దానికి ముందు కొన్ని వారాలపాటు యూనియన్లతో జీతాల గురించి చర్చలు జరుపుతాయి.

ఈ సంవత్సరం వాళ్ళు ఎప్పటికంటే ముందే ఆ నిర్ణయాలను ప్రకటించారు. అయితే ఆ కార్ల మాన్యుఫ్యాక్చరర్ కంపెనీలు ఇలా ఎందుకు చేశాయనేది మాత్రం చెప్పలేదు.

యూనియన్లు డిమాండ్ చేస్తున్న జీతాలు, బోనస్‌లను చెల్లిస్తామని టయోటా తెలియజేసింది. గత 20 సంవత్సరాలలో జీతాలు ఇంత ఎక్కువగా పెరగటం ఇదే మొదటిసారని అన్నారు.

టయోటా ఇన్‌కమింగ్ ప్రెసిడెంట్ కోజి సాటో మాట్లాడుతూ.. ఇది జపాన్ యొక్క మోటారు పరిశ్రమలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, “దీనివల్ల ప్రతి సంస్థలోను కార్మికులు, మేనేజ్మెంట్ల మధ్య స్పష్టమైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది” అని అన్నారు.

హోండా కంపెనీ

అదే విధంగా వారి ప్రత్యర్థి కార్ల మాన్యుఫ్యాక్చరర్ కంపెనీ హోండా వారు.. యూనియన్ కోరినట్లుగా జీతాల పెరుగుదల, బోనస్‌ ల డిమాండ్లను “పూర్తిగా తీర్చాము” అని తెలిపారు.

జీతాలు 5% పెంచుతున్నామని, ఇది 1990 నుండి జపాన్ ద్రవ్యోల్బణంలో వచ్చిన మార్పు కంటే ఎక్కువ పెరుగుదల అని కంపెనీ తెలిపింది. ప్రారంభ జీతాలు పెరిగేకొద్దీ, యువకులైన ఉద్యోగులకు ఆ మేరకు పంచుతామని హోండా ప్రతినిధి తెలిపారు.

“తీవ్రమైన వ్యాపార వాతావరణం ఉన్నప్పటికీ, ఉద్యోగులందరూ చేయగల వాతావరణాన్ని సృష్టించాలనే బలమైన కోరిక ఉంది. అవసరం పనిని ముందుకు తీసుకొని వెలుతుంది” అని ఆ ప్రతినిధి తెలిపారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా.. పెరుగుతున్న ధరలతో పోరాడుతున్న ప్రజలకు సహాయపడటానికి జీతాలు పెంచాలని సంస్థలకి పిలుపునిచ్చారు.

జనవరిలో ఫ్యాషన్ చైన్ యునిక్లో యజమాని, ఫాస్ట్ రిటైలింగ్, జపాన్లో సిబ్బంది వేతనాన్ని 40% వరకు పెంచిందని అన్నారు. మార్చి ప్రారంభం నుండి జపాన్‌లోని ప్రధాన కార్యాలయాలు, ఆ కంపెనీల దుకాణాలలో పనిచేసే ఫుల్ టైం  ఉద్యోగులకు కొత్త పే పాలసీ వర్తిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.

కొన్ని దశాబ్దాలుగా జపాన్‌లో ధరలు, జీతాల పెరుగుదల రెండూ స్థిరంగా ఉన్నాయి. దేశాలు మహమ్మారి ఆంక్షలను సడలించడంతో ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి.

డిసెంబరులో జపాన్‌‌లో ప్రధాన వస్తువుల ధరలు గత సంవత్సరం, ఆ ముందు సంవత్సరం నుండి 4% పెరిగాయి.