ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సరికొత్త విప్లవానికి నాంది పలికిన జపాన్

ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అన్నీ రంగాలలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ఒక సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో బాగా వాడుతున్నారు. కానీ ‘రీ యూటర్స్’ అందించిన లేటెస్ట్ నివేదిక ప్రకారం జపాన్ దేశం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ వాడకం లో అగ్రగామిగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ని సంపూర్ణంగా వాడుకొని జపాన్ దేశం […]

Share:

ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అన్నీ రంగాలలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ఒక సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో బాగా వాడుతున్నారు. కానీ ‘రీ యూటర్స్’ అందించిన లేటెస్ట్ నివేదిక ప్రకారం జపాన్ దేశం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ వాడకం లో అగ్రగామిగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ని సంపూర్ణంగా వాడుకొని జపాన్ దేశం ఆర్ధిక వ్యవస్థని పెంపొందించే విధంగా  అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కాదు ఆ దేశం లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలలో అమర్చబడి అడ్వాన్స్ చిప్స్ లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరి లోపు జపాన్ యూరోపియాన్ స్టేట్స్ లో ఉన్నట్టుగా కఠినమైన నిబంధలతో కాకుండా, అమెరికా లో ఎలా అయితే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అన్నీ విభాగాల్లో ఎలాంటి పరిమితి లేకుండా దూసుకుపోతుందో, అలా జపాన్ కూడా దూసుకొని వెళ్లేలా ఒక స్ట్రాటజీ ని తయారు చేస్తున్నారు.

యూరోపియన్ యూనియన్ దేశాల నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయి :

అయితే అమెరికా లో లాగా జపాన్ దేశం వాళ్ళు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని నేర్చుకోవడం లో వెనకబడుతున్నారు. ఎందుకంటే జపాన్ లో ఉన్నటువంటి కొంతమంది హయ్యర్ అఫిషియల్స్ అమెరికన్లు చూపించినంత పట్టుదల ని చూపించడం లేదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లో కొన్ని మోడ్యూల్స్ ని నెర్కకోవడానికి అనుమతి లేదు, ఒకవేళ అనుమతి లేకుండా వాడుకుంటే మాత్రం కాపీ రైట్స్ పడుతుంది. అదే కనుక జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల టెక్స్ట్ మరియు గ్రాఫిక్స్ వంటివి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి జెనెరేట్ చెయ్యడం కష్టం అయిపోతుంది. జపాన్ ప్రభుత్వం కాస్త చిరవ తీసుకొని, ఈ విషయం పై శ్రద్ద చూపిస్తే కచ్చితంగా ఈ ప్రపంచం లో ఆర్టిఫీషియల్ టెక్నాలజీ ని ఉపయోగించి ఆ దేశం అద్భుతాలు సృష్టించ వచ్చు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా జపాన్ ప్రొడక్ట్స్ ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా యూరోపియాన్ ఇండస్ట్రీస్ చీఫ్ తీరి బ్రిటోన్ ప్రస్తుతం టోక్యో లో EU ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి అందులో మార్పులు చేర్పులు చేసిన మరింత అడ్వాన్స్ గా మార్చి సెమీ కండక్టర్స్ లో వాడేందుకు తెగ ప్రయత్నం చేస్తుంది. అంటే కాకుండా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో లో జపాన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  కౌన్సిల్ లో ముఖ్యులు,  ప్రముఖ సీనియర్ ప్రొఫెసర్  ఉతాక మత్సువో  మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడకం పై యూరోపియన్ యూనియన్ పెట్టిన నిబంధనలు చాలా కఠినమైనవి. అంతే కాకుండా సరైన కాపీ రైట్ కంటెంట్ ని పట్టుకోవడం అనేది చాలా కష్టం గా మారిందని అంటున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ EU పద్దతి ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించడం వల్ల చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తయారు చెయ్యొచ్చు’ అని అభిప్రాయ పడుతున్నాడు, అంతే కాదు అక్కడ ఉన్న ప్రముఖ ఇండస్ట్రీస్ మొత్తం కూడా EU పద్దతి ద్వారానే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి యూరోపియన్ యూనియన్ పెట్టిన నిబంధనలను ఛేదించి జపాన్ ఈ టెక్నాలజీ లో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో చూడాలి.