Girl Friend: గర్ల్ ఫ్రెండ్ ను దారుణంగా చంపిన వ్యక్తి రిలీజ్

అదే కారణం అని చెప్పిన అధికారులు

Courtesy: pexels

Share:

Girl Friend: ప్రేమ (Love) ఎంతో మధురం (Sweet) అని అనేక మంది చెబుతారు. ప్రేమ మధురం అని చెప్పేందుకు అనేక ఘటనలు కూడా చరిత్రలో (History) ఉన్నాయి. కానీ ప్రేమ గుడ్డిది అని వాదించే వారి వాదనను నిజం చేస్తూ ఇటలీలో (Italy) ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ (Girl Friend) ను 57 సార్లు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య (Murder) చేశాడు. 35 సంవత్సరాల ఇటలీ వ్యక్తి ఇలా చేశాడు. అతడికి తన గర్ల్ ఫ్రెండ్ (Girl Friend) కి బ్రెడ్ క్రంబ్స్ గురించి వాదన రావడంతో అతడు ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అటువంటి వ్యక్తిని అధికారులు జైలు (Jail) నుంచి రిలీజ్ చేస్తున్నారు. 

 

అదే కారణం.. 

 

అంతటి ఘోరమైన వ్యక్తిని, నర హంతకున్ని జైలు నుంచి విడుదల చేసేందుకు కారణం ఉందని అధికారులు (officers) చెబుతున్నారు. జైలులో పెట్టే ఆహారం వల్ల ఆ వ్యక్తి విపరీతంగా బరువు (Weight) పెరుగుతున్నాడు. ఇది అతడి ఆరోగ్యానికే హానికరం (Danger) అని వైద్యులు చెప్పడంతో చేసేదేం లేక అధికారులు అతడిని జైలు నుంచి రిలీజ్ చేస్తున్నారు. మీడియా (Media) నివేదికల ప్రకారం 2017లో సార్డినియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో డిమిత్రి ఫ్రికానో అనే వ్యక్తి.. తన 25 ఏళ్ల స్నేహితురాలు (Girl Friend) ఎరికా ప్రీతిని దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా అంటే 2019లో అక్కడి కోర్టు ఫ్రికానోకి శిక్ష విధించింది. కానీ కరోనా కారణంగా అతడు ఏప్రిల్ 2022 వరకు జైలు శిక్షను అనుభవించడం మొదలు పెట్టలేదు. 2022లో జైలు శిక్షను అనుభవించడం స్టార్ట్ చేసిన సమయంలో అతడి బరువు 120 కేజీలు. కానీ కొద్ది రోజుల్లోనే అతడు విపరీతంగా బరువు (Over Weight) పెరిగాడు.ఇప్పుడు, ఇటలీలోని టురిన్ నిఘా కోర్టు (Court) మిస్టర్ ఫ్రికానోను కేవలం ఒక సంవత్సరం జైలు శిక్ష తర్వాత వైద్య కారణాలపై విడుదల చేసింది. జైలు అధికారులు 35 ఏళ్ల అతని ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెప్పారు. ఎందుకంటే అతను సన్నబడటానికి అవసరమైన తక్కువ కేలరీల ఆహారాన్ని అందించలేమని వారు పేర్కొన్నారు. .ఫ్రికానో యొక్క బరువు కేవలం ఒక సంవత్సరంలోనే 200 కిలోల వరకు పెరిగిందని కోర్టు పేర్కొంది.

అక్కడ ఉండలేడు.. 

 

నర హంతకుడు ఫ్రికానో (Fricano) ఇక జైలులో ఉండలేడని కోర్టు తీర్పు చెప్పింది. అతని బరువును కంట్రోల్ చేసే ఆహారాన్ని జైలు అధికారులు (Jail Officers) అందించలేరని అభిప్రాయపడింది. ఇంత బరువు వల్ల అతడికి వీల్ చెయిర్ అవసరం పడుతోంది. వీల్ చెయిర్ లేకుండా అతడు తిరగడం అసాధ్యం అవుతోంది. అంతే కాకుండా అతనో చైన్ స్మోకర్ అని కూడా కోర్టు పేర్కొంది. అతను అదే విధంగా జైలులో ఉంటే అతని జీవితం ప్రమాదంలో పడుతుందని న్యాయవాదులు (Lawyers) కూడా వాదించారు. అతని బరువు తగ్గేందుకు అవసరం అయిన డైటరీ ఫుడ్ ను జైలు అధికారులు అందించలేరని అందుకోసమే అతడిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఫ్రికానో ఇప్పుడు మిలన్ (Milan) సమీపంలోని తన తల్లిదండ్రుల ఇంటిలో గృహనిర్బంధంలో తన మిగిలిన శిక్షను అనుభవిస్తాడని కోర్టు వెల్లడించింది. అక్కడ అతను సరైన ఆహారం తీసుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం.. ఫ్రికానో తన గర్ల్ ఫ్రెండ్ ప్రీతీని క్రూరంగా హత్య చేసినట్లు అంగీకరించాడు.

 

అందుకోసమే హత్య

 

ఫ్రికానో తినేటపుడు ప్రీతి కొన్ని చిన్న ముక్కలను టేబుల్‌ (Table) పై ఉంచింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ వాగ్వాదంలో మాటామాటా పెరిగి ఫ్రికానో ప్రీతిని దారుణంగా హత్య చేశాడు. 57 సార్లు అతడు తన గర్ల్ ఫ్రెండ్ (Girl Friend) ను పొడిచాడు. ప్రీతి చనిపోయినపుడు ఈ జంట శాన్ టియోడోరోలో సెలవులో ఉన్నారు. వారు బీచ్ కు వెళ్లే ముందు వారికి ఈ వాదన జరిగింది. గొడవ జరుగుతున్న సమయంలో ప్రీతి తనను పేపర్ వెయిట్ (Paper Weight) తో కొట్టిందని ఫ్రికానో తెలిపాడు. అందుకోసమే తాను కత్తి  (Knife)తీసుకుని ప్రీతిని అన్ని సార్లు పొడిచి అతి క్రూరంగా హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత తప్పించుకునేందుకు ఫ్రికానో పెద్ద స్కెచ్చే వేశాడు. ప్రీతిని దోపిడీ దొంగలు చంపినట్లు అతడు చిత్రీకరించాడు. అదే విధంగా దోపిడీ దొంగలపై ఆరోపణలు కూడా చేశాడు. 

కానీ చివరికి అతను తన నేరాన్ని అంగీకరించాడు. బ్రెడ్ విషయంలో తమకు గొడవ జరిగిందని ఆ గొడవలో తాను ప్రీతిని అతి దారుణంగా హత్య చేశానని పేర్కొన్నాడు. 

ఫైర్ అవుతున్న ప్రీతి కుటుంబీకులు

ఫ్రికానోను ఇలా విడుదల చేయడంపై ప్రీతి కుటుంబసభ్యులు (Family Members) ఫైర్ అవుతున్నారు. కోర్టు నిర్ణయం సిగ్గుచేటని వారు మండిపడుతున్నారు. మా కూతురిని ఎవరూ తిరిగి ఇవ్వరనే బాధ కంటే మా చిన్నారిని పొట్టన పెట్టుకున్న నీచుడు  ఇంత త్వరగా శిక్ష (Prison) నుంచి బయటకు రావడం తమను ఇంకా ఎక్కువగా బాధిస్తోందని (Sad) వారు తెలిపారు.