2024 లో జాయింట్ స్పేస్ మిషన్

నాసా మరియు ఇస్రో కలిసి ‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కార్పొరేషన్’ కోసం పనిచేస్తూ ఒక కొత్త వినూత్న స్ట్రాటజిక ఫ్రేమ్ వర్క్ డెవలప్ చేస్తున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా,Artemis Accordsతో చేరాలని నిర్ణయించుకోవడం, అంతేకాకుండా నేషనల్ ఆర్నాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 2024 నిర్దేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిర్వహించే జాయింట్ మిషన్లో పాలుపంచుకోవడానికి అంగీకరించామని వెల్లడించారు.  భారత ప్రధానమంత్రి […]

Share:

నాసా మరియు ఇస్రో కలిసి ‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కార్పొరేషన్’ కోసం పనిచేస్తూ ఒక కొత్త వినూత్న స్ట్రాటజిక ఫ్రేమ్ వర్క్ డెవలప్ చేస్తున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా,Artemis Accordsతో చేరాలని నిర్ణయించుకోవడం, అంతేకాకుండా నేషనల్ ఆర్నాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 2024 నిర్దేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిర్వహించే జాయింట్ మిషన్లో పాలుపంచుకోవడానికి అంగీకరించామని వెల్లడించారు. 

భారత ప్రధానమంత్రి మోదీ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ మధ్య జరిగిన మీటింగ్ ప్రకారం,” భారతదేశం కూడా Artemis Accordsలో పాలు పంచుకోబోతున్నట్లు, అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోవడం ద్వారా, మానవజాతికి ఎంతో మేలు జరుగుతుంది” అనే విషయాలు అఫీషియల్ గా వెల్లడించినట్లు PTI తెలిపింది. 

ముఖ్య అంశాలు: 

1. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ (OST) ప్రకారం, Artemis Accords 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష పరిశోధనలో ఎంతగానో సహాయ పడతాయి. అమెరికా నేతృత్వంలో, 2025 నాటికల్లా సాధారణ మనిషి చంద్రుడు మీద అడుగుపెట్టలా చేయడానికి, అదే విధంగా తర్వాత లక్ష్యం మార్స్ మీద అడుగు పెట్టడం అనేది, ఈ పరిశోధన పరంగా ముఖ్య లక్ష్యం. 

2. ఇస్రో మరియు నాసా, ఈ సంవత్సరం మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాల కోసం ఒక చక్కనివ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాయని, ఒక అధికారి తెలిపారు. 

3. హీరో స్పేస్ ఏజెన్సీలు 2024 నిర్దేశించి అంతర్జాతీయ కేంద్రానికి జాయింట్ మిషన్ కు అంగీకరించామని ఒక అధికారి PTI తో తెలిపారు. 

4. స్పేస్ సెక్టర్ లో,  Artemis Accordsలో పాలు పంచుకోబోతున్నట్లు, అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోవడం ద్వారా, మానవజాతికి ఎంతో మేలు జరుగుతుంది అని ANIకి ఒక సీనియర్ అధికారి తెలిపారు. 

అమెరికన్లు మోదీ గురించి చెప్పిన విషయాలు: 

అమెరికాను సందర్శించిన భారత ప్రధానమంత్రి మోదీ రాక గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ” మోదీ గారు ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. నిజానికి అమెరికన్లు మరియు భారతీయులు మధ్య ప్రేమ పూర్వకమైన కుటుంబ సంబంధం తప్పకుండా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారతదేశం వంటి ఒక డెమొక్రటిక్ దేశం అంతే కాకుండా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశం మద్దతు అమెరికాకు ఉంటే, తప్పకుండా చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు సరితూగేలా ఉండొచ్చు అనేది అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ అంచనా వేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి, మునుపటి సంవత్సరం L. Yellen భారతదేశాన్ని సందర్శించడం జరిగింది.

నిజానికి చెప్పుకోవాలంటే, భారతదేశానికి సుమారు అన్ని దేశాల నుండి స్నేహపూర్వకపైన సంబంధాలు ఏర్పడటానికి ముఖ్య కారణం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో విదేశీ పర్యటనలు ఈ స్నేహపూర్వకమైన సంబంధాలకు ముఖ్య కారణాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతి నెల ఆయన నేరుగా ప్రజలతో మన్ కీ బాత్ ద్వారా మాట్లాడ్డం ద్వారా మరింత భారతదేశ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవారికి సహకారంగా, చిరు వ్యాపారస్తులకు, చిన్న పిల్లల చదువులకు, ఆరోగ్యం సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు భారత దేశంలో నిర్వహించారు.