China: ఇజ్రాయిల్ పద్ధతి హద్దు మీరుతుంది అంటున్న చైనా

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, […]

Share:

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ గాజా (Gaza)లో చేస్తున్న పనులు హద్దులు మీరుతున్నాయని చైనా (China) అభిప్రాయపడింది. 

ఇజ్రాయిల్ పద్ధతి హద్దు మీరుతుంది అంటున్న చైనా (China): 

గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) చర్యలు ఆత్మ రక్షణ పరిధికి మించి ఉన్నాయని, అంతే కాకుండా ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం గాజా (Gaza) ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలి అని చైనా (China) విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం తెలిపారు.

గాజా (Gaza)లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ (Israel) దాడులకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించినందున, వాంగ్ శనివారం తన సౌదీ అరేబియా కౌంటర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌కు పిలుపు మేరకు, వాళ్ళ తరఫునుంచి మాట్లాడటం జరిగింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ (Israel) చర్యలు స్వీయ రక్షణ పరిధిని మించిపోయాయి అని వాంగ్(Wang) అన్నారు.  అంతేకాకుండా గాజా (Gaza)లోని ఎక్కువ గుంపులుగా ఉండే ప్రదేశాలను ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలి వెళ్లాలి అని అభిప్రాయపడ్డారు. 2.3 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హమాస్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ (Israel) గాజా (Gaza)లో 2,200 మందిని చంపిన ఇస్లామిస్ట్ గ్రూపును లక్ష్యంగా చేసుకుని భారీ ప్రతీకార బాంబు దాడిని ప్రారంభించింది. ప్రధానంగా చైనా (China) ప్రచురించిన కొన్ని నివేదికల ప్రకారం, ప్రత్యేకించి హమ్మస్ సంబంధించి దాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఇజ్రాయెల్ (Israel)-హమాస్ వివాదంలో కాల్పుల విరమణ కోసం, శాంతి చర్చలను ప్రోత్సహించడానికి చైనా (China) ప్రత్యేక రాయబారి జాయ్ జున్(Zhai Jun) వచ్చే వారం మిడిల్ ఈస్ట్ వల్లనున్నారని ఆ దేశ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV ఆదివారం తెలిపింది. శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా నివేదికలు పేర్కొన్నాయి. 

హమ్మస్ దాడి: 

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్ భారీ రాకెట్లతో, ఇజ్రాయిల్ పై  (Israel) దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఎంతో మంది ఇజ్రాయెల్ (Israel)‌ వాసులు చనిపోగా సుమారు, 3,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా (Gaza) అధికారులు తెలిపారు.  లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ (Israel) స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్ ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 

ఎంతో మంది సైనికులు మరియు పౌరులను హమాస్ కిడ్నాప్ చేసినట్లు ఇజ్రాయెల్ (Israel) అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు విధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారని, పౌరులను ఊచకోత కోశారని.. వందలాది మంది దేశంపై దాడి చేశారని, ఇంకా వందల మంది ఇజ్రాయెల్ (Israel) లోపల సైనికులతో పోరాడుతున్నారు అని ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. బందీలుగా ఉన్న అనేక మంది ఇజ్రాయిలీల ఫోటోలను ప్రస్తుతానికి హమాస్ విడుదల చేసింది.