Israel: పోరాడేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వెళ్తున్న ఇజ్రాయిలీలు

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ (Israel) తనని తాను రక్షించుకోవడానికి […]

Share:

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ (Israel) తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ లెబనాన్ (Lebanon)‌లోని హిజ్బుల్లా(Hezbollah) లక్ష్యాలపై ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ఇజ్రాయిలీలు, తమ సొంత గడ్డకు దారి వెతుకుతున్నారు. తాము స్వయంగా హమాస్ (Hamas) అంతు చూసేందుకు ప్రయాణం అవుతున్నారు. 

హమాస్ కు వ్యతిరేకంగా పోరాటానికి ఇజ్రాయిలీలు: 

పసిఫిక్ సౌత్‌వెస్ట్‌కు ఇజ్రాయిల్ (Israel) కాన్సుల్ జనరల్ ఇజ్రాయిల్ (Israel) బచార్ ప్రకారం, US నుండి వాణిజ్య మరియు చార్టర్ విమానాలలో ఇప్పటికే 10,000 మందికి పైగా ఇజ్రాయిలీలు, ఇజ్రాయిల్ (Israel) కు ప్రయాణించారు. చాలా మంది ఇజ్రాయిల్ (Israel) సైన్యం (Army) ప్రపంచవ్యాప్తంగా ఉన్న3,60,000 మంది ఇజ్రాయిలీలకు తమతో పాటు యుద్ధం (War)లో పాల్గొనమని పిలుపునిచ్చారు. అందులో కొంతమంది సామాన్య పౌరులు, వాలంటీర్లు ఉన్నారు.

Also Read: Israel – Gaza War : బందీలను విడుదల చేసిన హమాస్, నిరాకరించిన ఇజ్రాయెల్

న్యూయార్క్ (New York) మరియు లండన్ ( London), లాస్ ఏంజిల్స్ ( Los Angeles) మరియు పారిస్ ( Paris), బ్యాంకాక్ ( Bangkok) మరియు ఏథెన్స్ నుండి విమానాలు వస్తూనే ఉన్నాయి. ఇది ఎలా ఉండగా, అనేక గ్లోబల్ ఎయిర్‌లైన్‌లు టెల్ అవీవ్‌కు సేవలను రద్దు చేసినప్పటికీ, ఇజ్రాయిల్ (Israel)‌లోని రిజర్వ్ సైనికులు మరియు వాలంటీర్ల తాము ఇజ్రాయిల్ (Israel) ప్రయాణం చేసేందుకు అనేక మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది

హైఫా సమీపంలో పెరిగిన గ్రిన్‌బర్గ్ అనే 35 ఎలా వ్యక్తి, ఇజ్రాయిల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్‌లో 19 నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు పనిచేశాడు. రిజర్వ్‌గా అతను ప్రతి సంవత్సరం 20 రోజుల పాటు తన యూనిట్‌కు తిరిగి వస్తూ ఉంటాడు. అక్టోబరు 7న జరిగిన దాడి కారణంగా స్వదేశానికి తిరిగి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అతను మరియు అతని భార్య, ఈ యుద్ధం (War)లో ఏమి జరగబోతుందనే దాని గురించి వారి పిల్లలతో ముందుగానే చెప్పామని కూడా, ధైర్యంగా చెప్పడం జరిగింది

మెజారిటీ ఇజ్రాయిల్ (Israel)‌లు 18 ఏళ్లు నిండిన తర్వాత వారికి సైనిక శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. వారి డ్యూటీ పరంగా సేవలు పూర్తి చేసిన తర్వాత, చాలా మంది IDF సిబ్బంది 40 ఏళ్ల వయస్సు వరకు లేదా జాతీయ అత్యవసర పరిస్థితిలో అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చే వరకు రిజర్వ్ యూనిట్‌లకు కాల్-అప్ చేయడానికి అర్హులు. విదేశాలకు వెళ్లే వారు శిక్షణ, రిజర్వ్ డ్యూటీ కోసం తిరిగి రారు, అయితే అది వారి యూనిట్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: Israel-Palestine War: దూకుడు పెంచిన ఇజ్రాయెల్

యుద్ధభేరి: 

ఈ నెలలో దాడిని ప్రారంభించిన హమాస్ (Hamas) వందల మందిని బందీలుగా మార్చడమే కాకుండా, 1,400 మందిని పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా (Gaza)ను పాలిస్తున్న ఈ మిలిటెంట్ గ్రూపును అమెరికా, ఈయూ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.

హమాస్ (Hamas) చేసిన దాడి తర్వాత, ఇజ్రాయిల్ (Israel) గాజా (Gaza) అంతటా వైమానిక దాడులను ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్, యూరప్, యుఎస్ అంతటా నిరసనలకు ఆజ్యం పోసిన శత్రుత్వాలు ప్రారంభమైనప్పటి నుండి, 4,500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ (Hamas) ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. 2 మిలియన్ల మంది ప్రజలు నివసించే గాజా (Gaza)లోకి మరింత సహాయం అందించడానికి, అదేవిధంగా ఇజ్రాయిల్ (Israel)‌పై ఒత్తిడి తీసుకువస్తూ యుద్ధాన్ని అరికట్టడానికి ప్రపంచ నాయకులు ప్రయత్నిస్తున్నారు.