హ‌మాస్‌కు ఇజ్రాయెల్ ప్ర‌ధాని స్ట్రాంగ్ వార్నింగ్

ప్రస్తుతం ప్రపంచం కలవరపడుతున్న విషయాల్లో మొదటి స్థానంలో ఉండేది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధమే. ఈ యుద్ధం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో సతమతం అయిన ప్రపంచదేశాలకు ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో కొత్త తలనొప్పి వచ్చిపడింది. మొదట శాంతంగా ఉంటూ తన పని తను చేసుకుంటున్న ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్లే దాడి చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తన దాడులను ముమ్మరం చేసింది. ఈ యుద్ధం వల్ల […]

Share:

ప్రస్తుతం ప్రపంచం కలవరపడుతున్న విషయాల్లో మొదటి స్థానంలో ఉండేది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధమే. ఈ యుద్ధం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో సతమతం అయిన ప్రపంచదేశాలకు ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంతో కొత్త తలనొప్పి వచ్చిపడింది. మొదట శాంతంగా ఉంటూ తన పని తను చేసుకుంటున్న ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్లే దాడి చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తన దాడులను ముమ్మరం చేసింది. ఈ యుద్ధం వల్ల అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కానీ హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పాశవిక రీతిలో నరమేధం సృష్టిస్తూ హమాస్ గ్రూప్ సభ్యులు రాక్షసానందం పొందుతున్నారు. 

గట్టి హెచ్చరికలు పంపిన ఇజ్రాయెల్ ప్రధాని

ఈ యుద్ధం మీద ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఆయన హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు గట్టి సందేశాలు పంపారు. ఆయన మాట్లాడుతూ… ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ.. దీన్ని తప్పకుండా పూర్తి చేస్తుందని అన్నారు. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. హమాస్ వారు అనవసరంగా ఇజ్రాయెల్ మీద దాడి చేశారని మనకే అనిపిస్తుంటే అక్కడే ఉన్న ఆ దేశ ప్రధానికి కోపం రావడంలో తప్పు లేదని పలువురు అంటున్నారు. ఈ యుద్ధం కోసం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే 3,00,000 మంది సైనికులను సిద్ధం చేసింది. యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ చేస్తున్న అతి పెద్ద యుద్ధం ఇదే అని చెబుతున్నారు. 

మేము కోరుకోలేదు కానీ.. 

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే.. ఇజ్రాయెల్ యుద్ధంలో ఉందని, మేము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు కానీ మా మీద ఇది అత్యంత క్రూరమైన రీతిలో బలవంతంగా రుద్దబడిందని తెలిపారు. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ.. దానిని పూర్తి చేసే బాధ్యతను తప్పకుండా తీసుకుంటుందని ఆయన తెలిపారు. హమాస్ చేస్తున్న భీకర దాడుల్లో అనేక మంది అమాయకులైన ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారు (హమాస్ గ్రూప్) ఇందుకు తప్పకుండామూల్యం చెల్లిస్తారని, అంతే కాకుండా దీనిని చిరకాలం గుర్తుంచుకుంటారని ప్రధాని నెతన్యాహు హమాస్‌పై విరుచుకుపడ్డారు. మాపై దాడి చేయడం ద్వారా వారు చారిత్రాత్మక తప్పిదం చేశారని తెలిపారు. రాబోయే దశాబ్దాలపాటు వారికి గుర్తుండేలా మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. 

ఆ దాడులు కలిచి వేశాయి.. 

హమాస్ గ్రూప్ బంధీలుగా పట్టుకున్న దుస్థితిని గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ… అమాయక ఇజ్రాయిలీలలపై హమాస్ చేసిన క్రూరమైన దాడులు నా మనస్సును కదిలించాయని తెలిపారు. హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్ లో అనేక దారుణాలకు పాల్పడుతోంది. అనేక కుటుంబాలను వారి ఇళ్లలో వధించడం, బహిరంగ వేడుకల్లో వందలాది మంది యువకులను ఊచకోత కోయడం వంటి అనేక ఘటనలకు పాల్పడుతోంది. అంతే కాకుండా అనేక మంది మహిళలు, పిల్లలు మరియు వృద్ధులను కిడ్నాప్ చేస్తూ పాశవిక ఆనందం పొందుతోంది. 

హమాస్‌ ను ఐసిస్‌ గా ముద్రవేస్తూ.. హమాస్‌కు వ్యతిరేకంగా “నాగరికతా శక్తులు” ఏకమై దానిని ఓడించాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మరియు ఇతర ప్రపంచ నాయకులు తమకు మద్దతు తెలిపినందుకు ఇజ్రాయెల్ ప్రధాని వారికి కృతజ్ఞతలు తెలిపాడు.  ప్రెసిడెంట్ బైడెన్‌  తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, ఇజ్రాయెల్ భద్రత కోసం అమెరికా చేస్తున్న సాయానికి ఇజ్రాయెల్ పౌరులందరి తరపున అతనికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. 

అలాగే, ఇజ్రాయెల్‌ కు మద్దతు తెలిపిన అనేక మంది ప్రపంచ నాయకులకు కూడా నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా హమాస్‌ పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేస్తోంది. ఈ దాడిలో కేవలం ఇజ్రాయెల్ పౌరులు మాత్రమే కాకుండా హమాస్ మిలిటెంట్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు మరోసారి ఆపదను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రభావం వల్ల అనేక సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో అనేక మంది ఆకలితో అలమటించే అవకాశం ఉంటుంది.