Israel-Gaza War: ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఇలాగే కొనసాగిందో….

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న విషయం ఇజ్రాయెల్-గాజా(Israel-Gaza War) యుద్ధం. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ ను కవ్వించి యుద్ధం చేసేలా పాలస్తీనా (Palastina)కు చెందిన హమాస్ (Hamas) గ్రూప్ రెచ్చగొట్టింది. రెచ్చిపోయిన ఇజ్రాయెల్ (Israel) ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రతాపం చూపితే చూపింది కానీ అమాయకులైన గాజా ప్రజల మీద ఇజ్రాయెల్ (Israel) సేనలు విరుచుకుపడుతున్నాయి. దీంతో గాజాలో ఉన్న అనేక మంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు ఏం సంబంధం లేకపోయినా […]

Share:

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న విషయం ఇజ్రాయెల్-గాజా(Israel-Gaza War) యుద్ధం. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ ను కవ్వించి యుద్ధం చేసేలా పాలస్తీనా (Palastina)కు చెందిన హమాస్ (Hamas) గ్రూప్ రెచ్చగొట్టింది. రెచ్చిపోయిన ఇజ్రాయెల్ (Israel) ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రతాపం చూపితే చూపింది కానీ అమాయకులైన గాజా ప్రజల మీద ఇజ్రాయెల్ (Israel) సేనలు విరుచుకుపడుతున్నాయి. దీంతో గాజాలో ఉన్న అనేక మంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు ఏం సంబంధం లేకపోయినా ఇజ్రాయెల్ (Israel) తమ మీద దాడులు చేస్తోందని వారు వాపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇజ్రాయెల్ (Israel) శాంతి స్థాపన కోసం నడుం బిగించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ (Israel) మాత్రం హమాస్ శాశ్వతంగా అంతం అయ్యే వరకు తమ దాడులను ఆపే ప్రసక్తే లేదని చెబుతోంది. స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే పై విధంగా కామెంట్లు చేయడం గమనార్హం. ఇప్పటికే గాజా సిటీని అన్ని వైపుల నుంచి కమ్మేసిన ఇజ్రాయెల్ (Israel) సేనలు ఆ సిటీ రూపురేఖలు మారుస్తున్నాయి. దీంతో గాజా ప్రజలు ఏం చేయాలో తోచక ముల్లె మూట సర్దుకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. గాజా ప్రజలు నిరాశగా వలస వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రపంచ దేశాలు కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్-గాజా యుద్ధం గురించి అందరూ భయపడ్డ విధంగానే ఇజ్రాయెల్ రచయిత(Author), చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ కూడా భయపడుతూ (Fear) పలు హెచ్చరికలు జారీ చేశాడు.. 

యుద్ధం ఇలాగే కొనసాగిందో.. 

ఇజ్రాయెల్-గాజా యుద్ధం (Israel-Gaza War)పై ఇజ్రాయెల్ రచయిత యువల్ నోహ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే అది ప్రపంచ యుద్ధానికి  (World War) దారి తీసే ప్రమాదం ఉందని అతడు హెచ్చరించాడు. కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-గాజా యుద్ధం (Israel-Gaza War), గ్లోబల్ అస్థిరత కారణాలు ప్రపంచానికి మరో యుద్ధ ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని అతడు హెచ్చరించాడు. గత ఐదు నుంచి 10 సంవత్సరాలు గా విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అతడు తెలిపాడు. కరోనా కూడా దానిలో ఒక భాగమే అని అతడు తెలిపాడు. ఇజ్రాయెల్ (Israel) మరియు పాలస్తీనాలో ఇప్పుడు ఏమి జరుగుతోందో మనమంతా చూస్తున్నామని, ఇది మరింత అధ్వాన్నంగా మారే పరిస్థితి ఉందని అతడు అన్నాడు. ఒక వేళ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇది ప్రపంచమంతటా వ్యాపిస్తుందని తెలిపాడు. ఇది మూడవ ప్రపంచ యుద్ధాని (Third World War) కి దారితీయవచ్చు అనే భయాందోళనను వ్యక్తం చేశాడు. మారిన ఆయుధాలు, యుద్ధ రీతులు మానవాళిని తప్పకుండా నాశనం చేస్తాయని అతడు భయం వ్యక్తం చేశాడు. హరారీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అనేక మంది మేధావుల్లో ఒకరు. 

Read More: Israel: లెబనాన్ లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి

హమాస్ పైన యుద్ధం అయినా చనిపోతుంది పౌరులే.. 

అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ (Israel) మీద దాడి చేసి దాదాపు 1500 మందిని పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ (Israel) హమాస్ మీద యుద్ధం ప్రకటించింది. తీవ్ర దాడులతో విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉండే గాజా సిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కానీ ఈ దాడుల్లో అమాయకులు (Citizens) కూడా మరణిస్తున్నారు. అయినా కానీ ఇజ్రాయెల్ వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా సరే హమాస్ ఉగ్రవాదులు లేకుండా సమూలంగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ (Israel) చెబుతోంది. ఈ దాడుల్లో నిన్న గాజా సిటీలో ఉన్న ఒక ఆసుపత్రి (Hospital) మీద రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆసుపత్రిలో ఉన్న అనేక మంది అమాయకులు మరణించారు. ఈ దాడిని ప్రపంచ దేశాలు (World Countries) తప్పబడుతున్నాయి. కానీ ఈ దాడి చేసింది మేము కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) ఇప్పటికే ప్రకటించారు. 

Read Also: Dogs: యుద్ధ సమయంలో ఇజ్రాయిలీలకు సహాయం చేసిన కుక్కలు

ఇది హమాస్ మిలిటెంట్ల పనే అయి ఉంటుందని అన్నాడు. వారు తప్పుగా రాకెట్ ను ప్రయోగించి ఉంటారని తెలిపారు. ఇందులో ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ సేనలు) కు ఎటువంటి సంబంధం లేదని అతడు తెలిపాడు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇజ్రాయెల్ విలవిల్లాడుతోంది. ఇందుకు కారణం హ మాస్ చేస్తున్న దాడులే అని ఈజీగా తెలుస్తోంది. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ ను హమాస్ మిలిటెంట్లు అనవసరంగా కవ్వించారు. ఇక ఇప్పుడు వారు కూడా విపత్కర పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఇజ్రాయెల్ ముప్పుట దాడి చేయడంతో హమాస్ మిలిటెంట్లకు ఎక్కడా దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని నుంచి బయటపడే మార్గం లేక వారు కొట్టుమిట్టాడుతున్నారు. అంతే కాకుండా హమాస్ గ్రూప్ కు చెందిన అనేక మంది అగ్రనాయకులు కూడా ఈ దాడిలో మరణిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏదేమైనా ఇజ్రాయెల్-గాజా (Israel-Gaza War) అనది హమాస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.