Israel: యుద్ధంలో 68 మంది కుటుంబ సభ్యులకు కోల్పోయిన బామ్మ

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది

Courtesy: Un splash

Share:

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. యుద్ధానికి సంబంధించి కొంతమంది తమ బాధను వ్యక్తం చేస్తున్న ఒక వీడియో వైరల్ గా మారింది. యుద్ధంలో తమ 68 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయామంటూ, ఒక మహిళ అడిగిన ప్రశ్న వైరల్ గా మారుతుంది. 

 

ఇంకా ఎంత మంది చనిపోవాలి?: 

 

ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) యుద్ధంలో కాల్పుల విరమణ (ceasefire)కు పిలుపునివ్వాలని మసాచుసెట్స్‌లోని యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌ను పాలస్తీనా మహిళ నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బోస్టన్‌లోని ఒక రెస్టారెంట్‌లో, మహిళ తనను తాను పాలస్తీనా శరణార్థిగా వారెన్‌కు పరిచయం చేసుకుంటూ, గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో తన కుటుంబంలోని 68 మంది సభ్యులు చనిపోయారని చెప్పడం కనిపిస్తుంది. ఆమె వారెన్‌ను, 'కాల్పు విరమణకు ముందు ఇంకా ఎంతమంది చనిపోవాలి?' అని అడుగుతుంది. తమ కుటుంబంలో శోకం.. ఇంక ఎంతమంది చూడాలి అంటూ, ఆ మహిళ బాధతో వస్తున్న ఉక్రోషంతో నిలదీయడం వీడియోలో కనిపిస్తుంది. 

 

ఇజ్రాయెల్ (Israel), గాజా (Gaza)లో కాల్పుల విరమణ (ceasefire) కోసం వాదించాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనియన్ అనుకూల నిరసనకారుల సమూహం, బోస్టన్ సిటీ హాల్ వెలుపల సెనేటర్ వారెన్ హాజరైనవేళ ఒక మార్చ్ నిర్వహించింది. బోస్టన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, సెనేటర్ వారెన్ మాట్లాడటం ముగించిన అనంతరం, సిటీ హాల్ మెజ్జనైన్ నుండి బయలుదేరుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక నిరసనకారుడు నేరుగా సెనేటర్ వారెన్‌ను ఉద్దేశించి, గాజా (Gaza)లో కాల్పుల విరమణ (ceasefire)కు మద్దతు ఇవ్వాలని ఆమెను కోరారు. చాలామంది ఆందోళనకారులు కాల్పుల విరమణ (ceasefire) కోసం నినాదాలు చేయగా పోలీసులు సంఘటనను సర్దుమనుగనిచ్చారు.

 

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది: 

 

గత నెలలో ఇజ్రాయిల్‌ (Israel)లోని ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశం, హమాస్ (Hamas) చేసిన మొదటి దాడులలో ఒకటి. ఇక్కడ 250 మందికి పైగా మరణించారు. అప్పుడు, మ్యూజిక్ ఫెస్టివల్ హాజరైన ఒక ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model), హమాస్ (Hamas) ఎటాక్ (Attack) నుంచి తప్పించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ తో సహా, మృతదేహాల కుప్ప కింద గంటల తరబడి ఎలా దాక్కోవలసి వచ్చిందో వివరించింది. 

 

తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ నేమాన్‌ను కాల్చి చంపిన తర్వాత రెండు గంటల పాటు మృతదేహాల కుప్ప కిందనే దాక్కోవాల్సి వచ్చిందని, కాలు అదేవిధంగా భుజంపై గాయాలు పాలైన ఇరవై ఏడు సంవత్సరాల మోడల్ (Model) నోమ్ మజల్ బెన్-డేవిడ్ చెప్పింది. చాలా రక్తాన్ని కోల్పోయినప్పటికీ, హమాస్ (Hamas) ఎటాక్ (Attack) జరిగిన సమయంలో మోడల్ (Model) సజీవంగా తప్పించుకోగలిగిందని చెప్పుకొచ్చింది. అక్టోబర్ 7 ఉదయం 6.30 గంటలకు సూపర్‌నోవా ఉత్సవానికి చేరుకున్నప్పుడు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత అంతా అంధకారంగా మారింది అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). 

 

తనతో పాటు 14 మంది మూడు గంటలు దాకున్నప్పటికీ, చాలామంది వాళ్లని కనిపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపారని బాధాకరమైన విషాద కథను వెల్లడించింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). ఆ సమయంలోనే చాలామంది తమని కాపాడమంటూ తమని బందీలుగా చేయొద్దు అంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model) వెల్లడించింది. ఈ ఘోరమైన సంఘటన నుంచి బయటపడేందుకు చాలామందికి ఫోన్లు చేస్తూ, భయానక సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model).