Israel Hamas War: హమాస్ కీలక కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్

అక్టోబర్ 7వ తేదీన వందలాది మంది ఇజ్రాయెలీ పౌరులను పొట్టనబెట్టుకున్న మెరుపుదాడికి సారథ్యం వహించిన సీనియర్ కమాండర్(Commander)ను హతమార్చినట్టు ఇజ్రాయిల్ (Israel) సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్- పాలస్తీనా(Israeil-Palestine) మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్‌ గ్రూపును పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్(Hamas) ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌(Israeil) పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌(Gaza Strip)పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. గాజా సరిహద్దు […]

Share:

అక్టోబర్ 7వ తేదీన వందలాది మంది ఇజ్రాయెలీ పౌరులను పొట్టనబెట్టుకున్న మెరుపుదాడికి సారథ్యం వహించిన సీనియర్ కమాండర్(Commander)ను హతమార్చినట్టు ఇజ్రాయిల్ (Israel) సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్- పాలస్తీనా(Israeil-Palestine) మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్‌ గ్రూపును పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్(Hamas) ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌(Israeil) పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌(Gaza Strip)పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. గాజా సరిహద్దు వైపునకు మరిన్ని ఇజ్రాయెల్‌ బలగాలు కదులుతున్నాయి. ఏరియల్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను పంపతున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.  ఇజ్రాయెల్-పాలస్థీనా యుద్ధంలో హమాస్(Hamas) సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు  ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా స్ట్రిప్‌(Gaza Strip)లో జరిగిన వైమానిక దాడిలో హమాస్ టెర్రర్ గ్రూప్‌లోని సీనియర్ సభ్యుడు మురాద్ అబూ మురాద్‌ని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(Israeil Defence Force) వెల్లడించింది.

అబూ మురాద్(Abu Murad) గత వారం ఇజ్రాయెల్(Israeil) ప్రజలను ఊచకోత కోసిన టైంలో ఉగ్రవాదుల(Terrorists)కు దిశానిర్దేశం చేయడంలో పెద్ద పాత్ర పోషించాడు. అతన్ని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. శత్రువులు మూల్యం చెల్లించుకోవడం ప్రారంభమైందని, తర్వాత ఏం జరుగుతుందో మాత్రం బయటకు చెప్పలేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నేతన్యాహూ(PM Netanyahoo) అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనన్నారు. హమాస్‌(Hamas) నాశనమే తమ లక్ష్యమని మరోసారి పునరుద్ధాటించారు. సరైన సమయంలో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్‌తో కలిసి పోరాడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా గ్రూపు పేర్కొన్నది.

అయితే హమాస్ శనివారం కూడా ఇజ్రాయెల్‌(Israeil) పై దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 13 వందలకు పైగా మరణించగా.. ఇజ్రాయెల్ ఎదురు దాడుల్లో గాజాలో 15 వందలకు పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 15 వందల మంది హమాస్(Hamas) మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది. 

తీవ్రరూపం దాలుస్తోన్న యుద్ధం..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. హమాస్‌(Hamas) పాలనలో ఉన్న గాజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించి అనేక భవనాలను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌(Israeil) సైన్యం దాడిని మరింత ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర గాజాలోని దాదాపు 11 లక్షల మంది పాలస్తీనీయులను 24 గంటల్లోగా ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశించింది. హమాస్‌ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయటానికి వీలుగా భూతల యుద్ధానికి దిగటం కోసమే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. అంతమంది ఒక్కసారిగా తరలివెళ్లటం అసాధ్యమని, మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇప్పటికే నెలకొన్న విషాదాన్ని పెను విపత్తుగా మార్చవద్దని, ఆ ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌(Israeil) ను కోరింది. మరోవైపు, మానసిక యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్‌ ఇటువంటి హెచ్చరికలకు పాల్పడుతున్నదని, ఎవరూ ఉత్తర గాజాను వదిలివెళ్లవద్దని పౌరులకు హమాస్‌ పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకం మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోతున్నవారిపైన కూడా ఇజ్రాయెల్‌ దాడులు చేసిందని, 70 మంది చనిపోయారని హమాస్‌ ఆరోపించింది.

ఢిల్లీ చేరుకున్న రెండో విమానం

ఆపరేషన్‌ అజయ్‌(Operation Ajay)లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి 235 మందితో రెండో విమానం శనివారం ఢిల్లీకి చేరింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు విమాన సర్వీసులపై నిషేధాన్ని ఎయిరిండియా 18 వరకు పొడిగించింది. శిక్షణ నిమిత్తం ఇజ్రాయెల్‌కు వెళ్లిన తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టీ రమేశ్‌ ఆ దేశంలో చిక్కుకుపోయారని ఆయన భార్య తెలిపారు. ఆయన్ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.