Israel-Palestine War: దూకుడు పెంచిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్- పాలస్తీనా (Israel-Palestine War) యుద్ధం అనేక రోజుల నుంచి జరుగుతోంది. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ (Israel) మీద హమాస్ మిలిటెంట్లు దాడులు చేసి ఇజ్రాయెల్ ను కవ్వించారు. దాంతో తేరుకున్న ఇజ్రాయెల్ (Israel) తేరుకుని దాడులను తీవ్రతరం చేసింది. ఈ యుద్ధం  (Israel-Palestine War) ఆగిపోవాలని అనేక మంది ప్రార్థనలు చేస్తున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధాన్ని ఆపడం లేదు. ఎలాగైనా సరే హమాస్ ఉగ్రవాదుల అంతు చూస్తామని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. […]

Share:

ఇజ్రాయెల్- పాలస్తీనా (Israel-Palestine War) యుద్ధం అనేక రోజుల నుంచి జరుగుతోంది. సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ (Israel) మీద హమాస్ మిలిటెంట్లు దాడులు చేసి ఇజ్రాయెల్ ను కవ్వించారు. దాంతో తేరుకున్న ఇజ్రాయెల్ (Israel) తేరుకుని దాడులను తీవ్రతరం చేసింది. ఈ యుద్ధం  (Israel-Palestine War) ఆగిపోవాలని అనేక మంది ప్రార్థనలు చేస్తున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధాన్ని ఆపడం లేదు. ఎలాగైనా సరే హమాస్ ఉగ్రవాదుల అంతు చూస్తామని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదని అంతా అనుకుంటున్నారు. అనేక దేశాలు పాలస్తీనాకు తమ మానవతా సాయాన్ని ప్రకటిస్తున్నాయి. అయినా కానీ అక్కడ ఇంకా భయానక పరిస్థితులే ఉన్నాయి. ఎంత మంది మానవతా సాయాన్ని ప్రకటించినా కానీ ఇజ్రాయెల్ (Israel) మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 

దాడులు తీవ్రతరం చేస్తాం.. 

ఇప్పటికే ఈ దాడులను తీవ్రతరం చేస్తామని అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ (Israel) హెచ్చరించింది. అక్కడి ఆర్మీ అధికారుల నుంచి ప్రధాని వరకు దాడులు పెరుగుతాయనే హెచ్చరిస్తున్నారు. అయినా కానీ హమాస్ మిలిటెంట్లు ఏ మాత్రం వణకడం లేదు. చాలా రోజుల నుంచి వారు ప్లాన్ చేసిన విధంగానే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే గాజా (Gaza)ను దిగ్బందనం చేసిన ఇజ్రాయెల్ (Israel) మరింత దాడులు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది గాజాను వదిలివెళ్లిపోగా.. మిగిలిన కొందరు కూడా గాజా (Gaza)ను వదిలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏర్పడుతున్న మానవతావాద పరిస్థితుల గురించి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు పలు మార్లు హెచ్చరికలు జారీ చేశాయి. అనేక దేశాలు మానవతా సాయాన్ని పంపిస్తున్నా వాటికి కూడా పరీక్షే ఎదురవుతోంది. శనివారం రోజు ఈజిప్ట్ నుంచి పాలస్తీనా భూభాగంలోకి మొదటి విడత మానవతా సాయం పంపించబడింది. 

Also Read: Gaza: గాజాకు మానవతా సాయం పంపిన ఇండియా

ఎంత మంది చనిపోయారంటే? 

తన పని తాను చేసుకుంటున్న ఇజ్రాయెల్ (Israel) మీద హమాస్ మిలిటెంట్లు మొదట దాడులు చేసి అమాయకులైన ఇజ్రాయెలీలను పొట్టన పెట్టుకున్నారు. దీంతో తేరుకున్న ఇజ్రాయెల్ (Israel) తాను కూడా దాడి చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ (Israel) అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం, హమాస్ మిలిటెంట్లు (Hamas Militants) కనీసం 1,400 మందిని చంపేశారు.  హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ (Israel) బాంబు దాడిలో 4,300 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇక ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. మొత్తం గృహాలలో 40 శాతానికి పైగా దెబ్బతిన్నాయి లేదా నాశనం చేయబడ్డాయని తెలిపింది. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాకు ఆహారం, నీరు, ఇంధనం మరియు విద్యుత్ పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. .

ఇప్పటికే హెచ్చరించాం.. 

ఇజ్రాయెల్ (Israel) గాజా మీద దాడులను పెంచింది. ఇక్కడ చేస్తున్న దాడుల్లో సాధారణ ప్రజలు మరణించకుండా ఉండేందుకు అక్కడ ఉంటున్న పౌరులను దక్షిణం  (South) వైపుకు వెళ్లాలని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అనేక మంది గాజా వాసులు తాము ఉంటున్న ఇంటిని వదిలేసి గాజా (Gaza) దక్షిణం వైపునకు పయనమయ్యారు. కానీ దక్షిణ ప్రాంతంలో కూడా బాంబుల దాడి కొనసాగింది. అక్కడ ఖాన్ యూనిస్ లో రాత్రిపూట ఓ వైమానిక దాడి జరిగిందని, ఈ దాడిలో తొమ్మిది మంది మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. 

చర్చలు జరుపుతున్న ఖతార్ 

ఈ దాడుల్లో అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్ (Israel) సైన్యం అనేక మంది బంధీలను పట్టుకుంది. ఈ బంధీల విడుదలకు అనేక దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఖతార్ దేశం కూడా బంధీలను విడుదల చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఇజ్రాయెల్ అధికారులు మాట్లాడుతూ.. గాజా (Gaza) జనసాంద్రతతో ఉందని, శత్రువులు అక్కడ చాలా వస్తువులను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వారు ఎన్ని వస్తువులను సిద్ధం చేసినా కానీ తాము తప్పక విజయం సాధిస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు 7వ తేదీన హమాస్ చేత 200 మంది బంధీలు అపహరించబడి గాజాలో ఉంచబడ్డారు. అనంతరం గాజా (హమాస్ మిలిటెంట్లు) ఇద్దరు అమెరికన్ బంధీలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు, ఖతార్ (kathar) మధ్యవర్తిత్వం తర్వాత, మరింత మందిని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.