Israel: హ‌మాస్ చేతిలో బందీలను విడిపించడానికి ఇజ్రాయిల్ పోరాటం

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది.  హ‌మాస్ చేతిలో బందీలను విడిపించడానికి ఇజ్రాయిల్ పోరాటం:  […]

Share:

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. 

హ‌మాస్ చేతిలో బందీలను విడిపించడానికి ఇజ్రాయిల్ పోరాటం: 

గాజాలో తమ వద్ద ఉన్న బందీలకు బదులుగా పాలస్తీనా (Palestina) ఖైదీ (prisoners)లందరినీ వారి జైళ్ల నుంచి విడుదల చేయాలని హమాస్ ఇజ్రాయెల్ (Israel)‌ను డిమాండ్ చేసింది. అయితే ఈ ఖైదీ (prisoners)ల మార్పిడి (Exchange) గురించి ఇంతకుముందు చాలాసార్లు చర్చ అయితే జరిగింది. అక్టోబర్ 7న జరిగిన దాడి లో, పాలస్తీనా హమాస్ సమూహం, ఇజ్రాయెల్ (Israel) సరిహద్దు పట్టణాలలో నివసిస్తున్న  200 మందికి పైగా పౌరులను కిడ్నాప్ చేసి బందీలు (Hostages)గా మార్చింది. వీరిలో పలువురు విదేశీయులు.. రెండు దేశాలకు సంబంధించిపౌరసత్వం కలిగినవారు ఉన్నారు. ఇజ్రాయెల్ (Israel)‌తో తక్షణ ఖైదీ (prisoners)ల మార్పిడి (Exchange)కి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ ఇటీవల చెప్పారు. 

Also Read: Netanyahu: ఇది జీవన్మరణ సమస్య అన్న ప్రధాని నెతన్యాహు

2011లో ఒక సైనికుడిని విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) 1,027 మంది పాలస్తీనా ఖైదీ (prisoners)లను మార్చుకుంది. ఈసారి, యుద్ధ ప్రాంతంలో హమాస్‌ చేతిలో చాలా మంది బందీలు (Hostages)గా ఉన్నందున, నిజానికి ఇది ఇజ్రాయెల్ (Israel) కి చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. యుఎస్ మరియు ఖతార్ జోక్యంతో ఇప్పటివరకు ఇజ్రాయెల్ (Israel)‌కు అనుకూలంగా చర్చలు పనిచేసినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే నలుగురు బందీలను (Hostages) విడుదల చేశారు. 

కాల్పుల విరమణ కోసం బందీలు (Hostages):

హ‌మాస్ (Hamas) కాల్పుల విరమణకు బదులుగా బందీలందరినీ (Hostages) విడుదల చేయాలని ప్రతిపాదించింది, అయితే హమాస్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే యుద్ధం ప్రకటించిన ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎటువంటి ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చు.

బందీల భద్రత:

ఏదైనా చర్చలు తీసుకోవాలన్న, నిర్ణయాలు తుది నిర్ణయాలు కావాలన్నా, హమాస్ లోని బండిలుగా ఉన్న వారి భద్రతను నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది. హమాస్ లోని బందీలు (Hostages)గా ఉన్న చాలామంది, ఇస్రాయిల్ చేసిన దాడుల కారణంగా మరణించారు అన్న విషయం చెప్తున్నప్పటికీ, హమ్మస్ (Hamas) లోని బందీలు (Hostages) బ్రతికున్నారా! చనిపోయారా! అనే విషయం పైన ఇజ్రాయెల్ (Israel) గాని మరి ఇతర దేశాలు గాని ద్రువీకరించలేదు. బందీలను (Hostages) సైనికంగా విడిపించేందుకు ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న ప్రయత్నాలు వారి మరణాలకు దారితీయచ్చు.

ఎంతకాలం బందీలు (Hostages)గా ఉండొచ్చు?

హ‌మాస్ (Hamas) కొన్ని వర్గాల నుండి పొందిన మద్దతును నిలుపుకోవడం కోసం కొంతమంది మహిళలు, పిల్లలు మరియు వృద్ధులను విడుదల చేయడానికి అంగీకరించచ్చు. కానీ చాలా కాలం పాటు బందీలు (Hostages)గా ఉంచిన ప్రాంతంగా, హమాస్‌కు ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ముఖ్యంగా గిలాడ్ షాలిత్ అనే సైనికుడు, 1,000 మంది పాలస్తీనా ఖైదీ (prisoners)లకు బదులుగా ఐదు సంవత్సరాల పాటు బందీగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.