Gaza Hospitals: గాజా ఆసుపత్రుల్లో ఉన్న చిన్నారులపై కీలక నిర్ణయం

వారిని తరలిస్తామని వెల్లడించిన ఇజ్రాయెల్

Courtesy: twitter

Share:

GaZa Hospitals: సైలెంట్ గా ఉన్న తమతో కయ్యం పెట్టుకున్న హమాస్ (Hamas) కు ఇజ్రాయెల్ (Israel) గట్టిగానే బుద్ది చెబుతోంది. హమాస్ కమాండర్లను ఏరి వేసే క్రమంలో ఇజ్రాయెల్ (Israel) చేతిలో కొంత మంది అమాయక పౌరులు బలి అవుతున్నారు. మరీ ముఖ్యంగా గాజా (Gaza) స్ట్రిప్ ప్రజలు ఇజ్రాయెల్ దాడులతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. గాజా (Gaza) నగరంలో ఉన్న ఆసుపత్రుల్లోని అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. ఇజ్రాయెల్ (Israel) కాస్త వెనకా ముందు చూసి దాడులు చేయాలని ఆ దేశాన్ని ఐక్యరాజ్య సమితి కూడా రిక్వెస్ట్ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న ఓ పెద్ద ఆసుపత్రిని (Gaza Hospitals) పేల్చేశారు. ఇజ్రాయెల్ సైన్యమే ఇలా చేసిందని హమాస్ ఆరోపిస్తుండగా.. మాకు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. వీరు ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా సరే అక్కడ ఉన్న అనేక మంది అమాయక రోగులు మాత్రం తమ ప్రాణాలను విడిచారు. గాజా ఆసుత్రుల (Gaza Hospitals) మీద ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. 

 

దాడులు కొనసాగుతాయి.. కానీ 

 

దాడులను ఆపే ప్రసక్తే లేదని ఇప్పటికే అనేక సార్లు ఇజ్రాయెల్ (israel) అధికారులు తేల్చి చెప్పారు. కేవలం అధికారులు మాత్రమే కాకుండా స్వయాన ఆ దేశ ప్రధాని నెతన్యాహునే (Prime minister Netanyahu) దాడులు ఆపబోమని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం (Israel Army) పాలస్తీనా సమూహం హమాస్‌ కు వ్యతిరేకంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటుందని అతడు వెల్లడించాడు. గాజా స్ట్రిప్ లోని అతి పెద్ద ఆసుపత్రి (Gaza Hospitals) అయిన అల్-షిఫాతో సహా గాజాలోని ఆసుపత్రుల దగ్గర భీకర పోరు కొనసాగుతోంది. ఆసుపత్రిపై (Hospital) మరలా ప్రత్యక్ష దాడి జరుగుతుందోమోనని భయపడ్డ అనేక మంది అక్కడ ఆశ్రయం పొందుతున్న వారు దక్షిణాదికి పారిపోయారు. పాలస్తీనా అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం… ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో తీవ్రమైన పోరాటాల వల్ల ఇంధన కొరత ఏర్పడిందట. దీంతో ఆసుత్రిలో (Hospital) పరికరాలు సరిగ్గా నడవక అనేక మంది పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పాలస్తీనా (Palastina) ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటన చేసిన వెంటనే దీనిపై ఇజ్రాయెల్ (Israel) స్పందించింది. అల్-షిఫా ఆసుపత్రి నుండి శిశువులను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆదివారం నాటి తరలింపు ప్రక్రియలో దళాలు సహాయపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. 

 

కాల్పుల విరమణకు ససేమిరా 

 

కాల్పుల విరమణ (Fire Hold) కోసం అంతర్జాతీయంగా అనేక మంది విజ్ఞప్తులు (Request) చేస్తున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం వినడం లేదు. పాలక హమాస్ మిలిటెంట్లను పూర్తిగా తుడిచిపెట్టేవరకు యుద్ధం ఆపేది లేదని ప్రకటనలు చేస్తోంది. యుద్ధం ఆపేది లేదని ఇంకా తీవ్రతరంగా యుద్ధం కొనసాగిస్తామని స్వయాన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే (Netanyahu) ప్రకటించారు. గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 239 మందిని విడుదల చేస్తేనే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని నెతన్యాహు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ (Israel) సైన్యం గాజాలోని ప్రధాన ఆసుపత్రులను (Gaza Hospitals) చుట్టుముట్టిందని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండిస్తోంది. తాము ఆసుపత్రులను టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆసుపత్రుల(Hospitals) నుంచి శిశువులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బంది శిశువైద్య విభాగం నుండి సురక్షితమైన ఆసుపత్రికి తరలించడంలో సహాయం కోసం అభ్యర్థించారని, మేము అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. యుద్ధం ఆరవ వారంలోకి ప్రవేశించింది. కాల్పుల విరమణకు ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ ప్రధాని ఒప్పుకోవడం లేదు. ఒక టెలివిజన్ ప్రసంగంలో నెతన్యాహు మాట్లాడుతూ.. కీలక ప్రసంగం చేశారు. యుద్ధం తర్వాత గాజా సైనికీకరణ చేయబడుతుందని మరియు ఇజ్రాయెల్ అక్కడ భద్రతా నియంత్రణను కలిగి ఉంటుందని కూడా చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) గాజాలోని అల్-షిఫా ఆసుపత్రితో తాము కమ్యూనికేషన్ కోల్పోయినట్లు ప్రకటించింది. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూనే పోరాటంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరి భద్రత కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్య సంస్థ కార్యకర్తలు, వందలాది మంది జబ్బుపడిన మరియు గాయపడిన రోగులు, లైఫ్ సపోర్ట్‌ లో ఉన్న పిల్లల కోసం సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ మరియు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తదితరులతో సహా డజన్ల కొద్దీ నాయకులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ద్వారా తీవ్ర దాడికి గురవుతున్న ఉత్తర గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయమే ఈ ప్రకటన చేసింది. హమాస్, ఉత్తర గాజా స్ట్రిప్‌ పై నియంత్రణ కోల్పోయిందని వెల్లడించింది.