Israel: గాజాను ఉత్తర, దక్షిణగా విభజించి దాడులు..

Israel: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్(Israel) మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరం(Gaza City)పై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్‌(Hamas)తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(Israeli Army) అధికార ప్రతినిధి డేనియల్ హగారి(Daniel Hagari) ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి.  […]

Share:

Israel: కాల్పుల విరమణ చేయాలని కోరుతున్న ప్రపంచ దేశాల విన్నపాన్ని ఇజ్రాయెల్(Israel) మరోసారి తోసిపుచ్చింది. ఆదివారం బాంబుల దాడులతో గాజా నగరం(Gaza City)పై విరుచుకుపడింది. గాజాను రెండుగా విభజించి హమాస్‌(Hamas)తో జరుగుతున్న యుద్ధంలో కీలక ఘట్టానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(Israeli Army) అధికార ప్రతినిధి డేనియల్ హగారి(Daniel Hagari) ప్రకటించారు. గాజాను మొత్తం చుట్టుముట్టి, ఉత్తర-దక్షిణ గాజాగా విభజించడంలో విజయం సాధించామని వెల్లడించారు. అటు.. గాజాలో సమాచార వ్యవస్థ నిలిచిపోవడం యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇది మూడోసారి. 

గాజా క్రమంగా ఆకలి రాజ్యంగా మారుతోంది. సలాహ్‌ అల్‌-దీన్‌(Salah al-Deen) వద్ద ఇజ్రాయెల్‌ సేనలు మోహరించాయి. దీంతో ఉత్తర-దక్షిణ గాజాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ఈజిప్ట్‌ నుంచి రఫా సరిహద్దు మీదుగా వస్తున్న మానవతాసాయం గాజాకు అందడం లేదు.ఉత్తరాది వారికి పూటకు ఒక రొట్టె దొరకడం కూడా గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

హమాస్(Hamas) అంతమే ధ్యేయంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్ సేనలు.. ఆదివారం గాజాలో రెండు శరణార్థి  శిబిరాలపై దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 53 మంది మరణించారు. అటు.. హమాస్‌ను అంతం చేసే వరకు, బందీలను క్షేమంగా వదిలిపెట్టే వరకూ కాల్పులను ఆపబోమని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. తమకు ఇంకో దారి లేదని తెలిపారు. యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్‌ అని గుర్తుచేశారు. మరోవైపు దక్షిణ గాజాలోకి  ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది. 

గాజాలోని ఇంటి ఇంటికి వెళ్లి ఇజ్రాయేల్ సైనికులు గాలిస్తూ పోరాటం చేస్తున్నారు. దాడులు ఓ భూకంపాన్ని తలపిస్తున్నాయని గాజావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర గాజా నుంచి దక్షిణాన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పౌరులకు ఇజ్రాయెల్ కరపత్రాలను పంపిణీ చేసింది. టెక్స్ట్ సందేశాలను పంపింది. అయితే, వార్ జోన్‌లో కనీసం 350,000 మంది పౌరులు మిగిలి ఉన్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్(Antony Blinken) దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనియన్లకు మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు తన మధ్య ఆసియా పర్యటన అని నొక్కిచెప్పారు. బ్లింకెన్‌ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌(West Bank)లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌(Mohammad Abbas)తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel – Hamas) యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌(Iraq)లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుదానీ(Mohammed Shia Al Sudani)తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. 

‘అంతర్జాతీయ చట్ట నిబంధనలు పట్టించుకోకుండా ఇజ్రాయేల్ చేస్తున్న విధ్వంసకర యుద్ధంలో మా పాలస్తీనా ప్రజలు అనుభవించిన మారణహోమం’ అని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వఫా పేర్కొంది. మరోవైపు, గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నారు. ఉత్తర గాజాతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడం వల్ల అక్కడ ప్రజలకు కనీసం రొట్టెముక్క కూడా దొరకడం లేదు. పరిస్థితులు మరో వారం పదిరోజులు ఇలాగే కొనసాగితే.. ఆకలిచావులు తప్పవని గాజాలోని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర గాజాతో పాటు.. దక్షిణాదిన కూడా దారుణ పరిస్థితులు నెలకున్నాయి. ఈ పరిస్థితులపై ఐక్యారాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్(Antonio Guterres) కలత చెందుతున్నారు.

ఇజ్రాయెల్‌ – హమాస్‌(Israel – Hamas) మిలిటెంట్ల మధ్య అక్టోబర్‌ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 1400 మంది మరణించారు. 280 మంది నిర్బంధంలో ఉ‍న్నారు.