Rafah crossing: రఫా క్రాసింగ్ విషయం గురించి స్పందించిన ఇజ్రాయెల్

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు (Border) ప్రాంతంలో, ఇజ్రాయెల్ (Israel) స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్(Hamas) ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ (Israel) దళాలు, హమాస్ మధ్య యుద్ధం 10 వ రోజుకు చేరుకోవడంతో, ఈజిప్ట్‌ (Egypt)కు పారిపోవడానికి విదేశీయులను అనుమతించడానికి రఫా (Rafah) క్రాసింగ్ ద్వారా గాజా (Gaza) విడిచి వెళ్లేందుకు సంఘీభావం తెలిపిందని అందుకే గాజా (Gaza)లో కాల్పుల […]

Share:

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు (Border) ప్రాంతంలో, ఇజ్రాయెల్ (Israel) స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్(Hamas) ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ (Israel) దళాలు, హమాస్ మధ్య యుద్ధం 10 వ రోజుకు చేరుకోవడంతో, ఈజిప్ట్‌ (Egypt)కు పారిపోవడానికి విదేశీయులను అనుమతించడానికి రఫా (Rafah) క్రాసింగ్ ద్వారా గాజా (Gaza) విడిచి వెళ్లేందుకు సంఘీభావం తెలిపిందని అందుకే గాజా (Gaza)లో కాల్పుల విరమణ కొనసాగుతుంది అనే వార్తలను..ఇజ్రాయెల్ (Israel) ఖండించింది. 

ఇజ్రాయిల్ స్పందన: 

గాజా (Gaza)లో ప్రస్తుతం కాల్పుల విరమణ లాంటివి..మానవతా సహాయం చేస్తూ విదేశీయులను బయటికి వెళ్లేందుకు అనుమతించడం లాంటివి ఇక్కడ జరగట్లేదు అని ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ (Israel) దళాలు, హమాస్ మధ్య యుద్ధం 10 వ రోజుకు చేరుకోవడంతో, అమెరికా పౌరులను రఫా (Rafah) క్రాసింగ్ ద్వారా గాజా (Gaza) విడిచి వెళ్లేందుకు ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించాయని ఒక అమెరికన్ అధికారి AFPకి శనివారం తెలిపగా, ఇటువంటి వార్తలలో నిజం లేదు అంటూ ఇజ్రాయెల్ (Israel) నివేదికను ఖండించింది.

ఇజ్రాయెల్ (Israel) నియంత్రణలో లేని గాజా (Gaza) స్ట్రిప్‌లోనికి, వెలుపలకు వెళ్లేందుకు ఏకైక మార్గం, రాఫా సరిహద్దు (Border) దాటడం మాత్రమే. పాలస్తీనా సరిహద్దు (Border) పోస్టులపై ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసిన తర్వాత మంగళవారం నుండి రాఫా సరిహద్దు (Border) క్రాసింగ్ అనేది మూసేయడం జరిగింది

రఫా క్రాసింగ్ చరిత్ర: 

అక్టోబర్ 1, 1906 నాటి ఒట్టోమన్-బ్రిటీష్ ఒప్పందం ప్రకారం, అప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం పాలించిన పాలస్తీనా, అప్పుడు బ్రిటన్ పాలించిన ఈజిప్టు (Egypt) మధ్య సరిహద్దు (Border)ను ఏర్పాటు చేసింది. సరిహద్దు (Border) తబా నుండి రఫా (Rafah) వరకు ఉంటుంది. 1979లో, ఈజిప్షియన్-ఇజ్రాయెల్ (Israel) శాంతి ఒప్పందం అనేది, నిజానికి 1906లో గీసిన రేఖకు సరిహద్దు (Border)గ మార్చడం జరిగింది. దీని అర్థం ఈజిప్ట్ సినాయ్ ప్రాంతాన్ని దక్కించుకోగా, ఇజ్రాయెల్ (Israel) గాజా (Gaza) నగరాన్ని తన స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై సంతకం చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ (Israel) దళాలు సీనాయి దీవిని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది.

చివరి ఇజ్రాయెల్ (Israel) దళాలు ఉపసంహరించుకున్న తర్వాత, రఫా (Rafah) క్రాసింగ్ పాయింట్ మొదటిసారిగా అంతర్జాతీయ సరిహద్దు (Border)గా తెరవడం జరిగింది, సరిహద్దు (Border) చట్టబద్ధంగా అంతర్జాతీయంగా మారింది. ప్రస్తుత గాజా (Gaza)-ఈజిప్ట్ సరిహద్దు (Border) క్రాసింగ్ క్యాంప్ డేవిడ్ ఒప్పందాల తర్వాత 1982లో ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ, పాలస్తీనియన్లు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ (Israel) నియంత్రణలో ఉన్న సరిహద్దు (Border) క్రాసింగ్‌లకు సంబంధించి, చాలా సార్లు పోరాడినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికీ కొనసాగుతున్న వైనం కనిపిస్తోంది. 

అయితే ఆ తర్వాత 1994లో గాజా (Gaza)-జరికో(Jericho) అగ్రిమెంట్ జరిగింది. మళ్లీ తర్వాత 2000 సంవత్సరంలో ఏరియల్ షారన్ (Ariel Sharon) జెరూసలేం పట్టణాన్ని సందర్శించింది. ఆ సమయంలో కూడా రఫా (Rafah) క్రాసింగ్ గురించి ప్రస్తావన నెలకొంది. మళ్లీ ఆ తర్వాత 2005లో ఇజ్రాయిల్ గవర్నమెంట్ అలాగే పాలస్తీనా అధికారం మధ్య మరో అగ్రిమెంట్ నెలకొంది. 

2011లో, ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు హోస్నీ ముబారక్, హమాస్ వ్యతిరేకి, ఈజిప్టు (Egypt) విప్లవం తరువాత పదవీవిరమణ చేశారు. ఇది రఫా (Rafah) క్రాసింగ్‌ను తిరిగి తెరవడానికి సహాయం చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే, జనరల్ అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి నేతృత్వంలోని, 2013లో హమాస్ మిత్రపక్షమైన ఈజిప్ట్ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీని తొలగించి, రఫా (Rafah) క్రాసింగ్‌ను మరోసారి మూసివేసింది.  ఇలా పలుసార్లు రఫా (Rafah) క్రాసింగ్ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. 

మహమ్మారి సమయంలో: 

ఇక 2020 కరోనా సమయంలో కూడా హమ్మస్ రఫా (Rafah) క్రాసింగ్ ను మూసివేసింది. అయితే తర్వాత చాలా చర్చలు జరగా, 2021 తరువాత హమ్మ స్ అలాగే ఈజిప్ట్ (Egypt) మధ్య కైరోలో జరిగిన మాటల తర్వాత రఫా (Rafah) క్రాసింగ్ రీ-ఓపెన్ చేయడం జరిగింది.